చిత్రకవిత
జీవితపు ఆటు పోట్ల సుడిగుండాల్లో
ఎంత పెనుగులాడినా చేజారిన జీవితం తిరిగి రాక
ఒంటరివై పెను చీకట్లు కమ్మిన జీవితంలో
ఉక్కిరిబిక్కిరి యవుతూ,,,,,,,!
అలవిగాని అందళాల కోసం చేసిన శ్రమలు అంచనాలు తారుమార్తె
నీ చీకటి ఎద మాటున గూడుకట్టున్న భవిష్యత్ పై దిగులు
ఎటు చూసినా అంధకారం
బ్రతుకు తెరువు కానరాని అగాధమై
గుండెల్లో అగ్ని కుంపటి రగులుతుంటే
చదివిన చదువుల పట్టాలు పిచ్చి కాగితాలై
స్నేహితులు నిన్ను ఉతకర్రగా చేసుకుని అందనంత ఎత్తు ఎదిగితే,,,,,,
నీ విజ్ఞానం వెర్రితలలై నిట్టూర్పుల సుడిగాలులతో ఏకాకివై
బ్రతుకు పుటలన్నీ ఎర్రని సిరామరకలై కన్నీళ్ల పర్యంతం!!
మబ్బులు కమ్మిన నిశ్శబ్ద నిశి రాత్రి
నీ ఆలోచనల సాలోచనలు మరిగి మరిగి పొంగుతుంటే,,,,,,,,
ఈ రోజులు ఎల్లకాలం ఉండవు
నీ కష్టాల కారుచీకట్లు తొలగి తొలిపొద్దు వేకువ కచ్చితంగా ఉంటుంది
నీ శ్రమల ప్రతిఫలాలు అందుకుంటావ్ ఓర్పు వహించు,,,,,,,!
ఓ వేడి నిట్టూర్పు విడిచి ఇంటికి పద
నీవు నీవు గా బ్రతికే రంగంలో వీడక శ్రమ చెయ్ మిత్రమా!!
అపరాజిత్
సూర్యాపేట