చిత్ర కవిత : నా నావ

అక్షర లిపి
18-10-23
అంశం :చిత్ర కవిత
శీర్షిక: నా నావ
వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు.

తీరాన్ని తాకిన నావ,
ఒడిదుడుకుల సంద్రంలో నిరంతర శ్రమతో, ఒడ్డుకు చేరి విశ్రాంతి నొసుగు నా నావ!

‘జీవితంలో కూడా మానవుడి ప్రవర్తనను, ప్రదర్శించు ప్రక్రియ ఒడ్డుకు చేరిన నావ!,

కష్టాల కడిలిలో తుఫానులను, ప్రళయాలను ,ఎదిరించి తీరాన్ని
చేరిన నా నావ,
తెరచాప రెపరెపలు,
మానవుని కష్టాల వలె, అనుక్షణము బాధించిన, తగిన ఓర్పు, సహనంతో ఎదుర్కొని ప్రశాంత జీవితం పొందాలని చెప్పేదే నా నావ,!

‘సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడి, అదే వేగంతో పైకి లేచే కెరటాల వలె,
మన జీవితాలు కూడా, సమస్యల ఊబిలో కూరుకు పోతున్నా, మన మీద మనకు ఉన్న’ ఆత్మబలం ‘తోటే,
పైకి ఎదగాలి,

మన మీద మనకు ఉన్న ‘ఆత్మవిశ్వాసమే’ మన జీవితాలను ఆనందమయం
చేస్తుంది,
అల్లకల్లోల సంద్రాల ఆటుపోటులకు ,తలఒగ్గకుండా
ప్రశాంత తీరాలకు చేరుతుంది
నా నావ!.
“మనము కూడా సమస్యలను, చాకచక్యంగా ఎదుర్కొని ,ప్రశాంత తీరాన్ని చేరుకోవాలి
నా నావ లాగా!!”

*””*”*”*
హామీ పత్రం :ఈ చిత్రకవిత నా స్వీయ రచన,
వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *