చిన్నిల్లు

మాధవి,సాయి కి పెళ్లి అయ్యి పన్నెండు సంవత్సరాలు అవుతుంది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చిన్న కుటుంబం,చక్కని సంసారం హాయిగా సాగిపోతున్న రోజులు..సాయి కి రెండు లారీలు ఉన్నాయి.వాటిని కిరాయికి ఇస్తూ,తాను కూడా డ్రైవర్ గా కొన్ని కంపెని లకు డ్రైవర్ గా వెళ్తాడు.అలా హాయిగా సాగిపోతున్న వారి జీవితంలోకి ఒక పెద్ద తుఫాను ను తెచ్చి పెట్టాడు సాయి

ఒక వారం రోజులుగా సాయి ఇంటికి రావడం లేదు.అడిగితే పని ఉంది అని చెప్తున్నాడు. మాధవి కూడా నిజంగా పని ఉందేమో అని ఆనుకుంది.కానీ ఎప్పుడూ రెండు రోజులకన్న ఎక్కువ బయట తిరగని సాయి వారం రోజులు అయిపోతున్న ఇంకా ఇంటికి రావడం లేదు.తన కోసo కాకున్నా పిల్లల కోసం అయినా ఇంటికి వచ్చి,ఎంత రాత్రి అయినా పిల్లలను ముద్దు చేయనిది ఉండే వాడు కాదు సాయి..

అలాంటి వాడు ఇప్పుడు వారం రోజులు దాటి పోతున్నా ,ఫోను కానీ,రావడం కానీ చేయడం లేదు. దాంతో మాధవికి అనుమానం వచ్చి,అతను పని చేసే కంపెనీకి తన తమ్ముడిని పంపించింది. చూడ్డానికి మాధవికి తల్లిదండ్రులు లేరు,తమ్ముడు చిన్నమ్మ కొడుకు ప్రసాదు ను ,అతను కంపెనీ కి వెళ్లి తన బావ గురించి ఆరా తీసాడు అతనికి వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే ,గత నాలుగు రోజుల నుండి సాయి డ్యూటీ కి రావడం లేదని,ఫోన్ చేస్తే ఎల్లుండి వస్తా అని చెప్పాడు అని ,దాంతో అదే విషయాన్ని తన అక్కకు ఫోన్ చేసి చెప్పాడు ప్రసాదు.

అది విన్న మాధవి కి అనుమానం వచ్చింది. ఎప్పుడు తన దగ్గర ఏదీ దాచని సాయి,ఎటు వెళ్ళి నట్టు,ఎక్కడ ఉంటున్నట్టు అని దాంతో తమ్ముడు ని అక్కడే ఎదురుచూడమని చెప్పి,తాను కూడా వస్తాను అని చెప్పింది.ప్రసాదు అక్కడికి దగ్గరలో ఉన్న తమ చుట్టాల ఇంట్లో రాత్రికి ఉండిపోయాడు. తెల్లరగానే మాధవి కూడా అక్కడికి వచ్చింది.ఇద్దరు కలిసి కంపనీ బయట సాయి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దాదాపు పది గంటలకు సాయి లారీ తీసుకుని కంపెనీ కి వచ్చాడు. సాయంత్రం వరకు కంపెనీ లోనే పని చేసాడు. మాధవి,ప్రసాదు కూడా అక్కడే కాపు కాశారు.

సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూడసాగారు మాధవి,ప్రసాదు లు ఇద్దరూ,సాయంత్రం అయ్యింది. అందరి తో పాటు సాయి కూడా బయటకు వచ్చి,లారీ ని తీసాడు, లారీ వెనకాలే ఫాలో అవుతూ మాధవి,ప్రసాదు లు ఇద్దరూ వెళ్లారు. సాయి కంపనీ నుండి ఇంటికి వెళ్లే దారి కాకుండా వేరే దారిలో వెళ్ళసాగాడు అది చూసి మాధవి ఇటెక్కడికి వెళ్తున్నాడు అని ఆందోళన పడసాగింది..

సాయి లారీ ఒక ఇంటి ముందు ఆగింది. మాధవి తమ్ముడిని బైక్ దూరంగా అపమని చెప్పి,బైక్ దిగి,చూడసాగింది. సాయి లారీ దిగి ఇంట్లోకి వెళ్ళాడు.కాసేపు అయ్యాక మళ్ళీ బయటకు వచ్చి,లారీ లోంచి ఏవో సామాను లు తీసి,ఇంట్లోకి వెళ్ళాడు,అతను ఇంట్లోకి వెళ్ళగానే తలుపులు ముసుకున్నాయి. ముసుకున్న తలుపులని చూస్తూ,మాధవి అక్కడే కులబడిపోయి ఎడవసాగింది.

అక్క ఏడవడం చూసిన ప్రసాదు వెళ్లి అడుగుతా అంటూ ముందుకు కదిలాడు. వద్దు అని ఆపింది మాధవి. తర్వాత గంటకు మళ్ళీ తలుపులు తెరుచుకున్నాయి. సాయి రెడి అయ్యి వచ్చాడు,అతను లారీ లోకి ఎక్కిన తర్వాత,లోపలనుండి ఒక అందమైన అమ్మాయి  బయటకు వచ్చి,అతనికి ఏవో ఇచ్చి,నవ్వుతూ టాటా చెప్పింది.దూరంగా ఉన్న వీరికి ఆమె సరిగ్గా కనిపించలేదు.వారి మాటలు వినిపించలేదు.కానీ భార్య భర్తల్లా  మాట్లాడుకుంటున్నారని అర్థం అయ్యింది. లారీ కదిలింది..

భర్త వెళ్లిన తర్వాత ప్రసాదు ని ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు,ఏంటి అని అన్ని వివరాలు కనుక్కోమని చెప్పి,తాను ఇంటికి బయల్దేరి వెళ్ళింది. మాధవి ఇంటికి వెళ్ళేసరికి సాయి వచ్చి,పిల్లలతో ఆడుకుంటూ కనిపించాడు. మాధవి రావడం చూసి ఎక్కడికి వెళ్ళవు మాధవి అని అడిగాడు. ఎక్కడికి వెళ్తే ఏంటి లెండి ,మీరు మాత్రం అన్ని చెప్తున్నారా అంది మాధవి.

తాను రెండు రోజులు రాకపోవడంతో కోపంగా ఉందన్న సాయి ,మాధవి తో నేను కంపనీ పనిమీద ఉరేళ్ళను రావడం లేటయ్యింది అని అన్నాడు. అబ్బద్దం చెప్తున్నా భర్త ను చూసి,ఆశ్చర్య పోయింది మాధవి. తర్వాత ఏమి మాట్లాడకుండా అతనికి అన్నం వండి పెట్టి, పిల్లల ముందు ఎందుకు అడగడం అని ఉరుకుంది అప్పటికి..

భార్య ముభావంగా ఉండడం చూసిన సాయి కూడా ఎక్కువ మాట్లాడలేదు మాధవి తో,అంటి ముట్టనట్లు గా ఉన్నాడు. తెల్లారింది ప్రసాదు అన్ని విషయాలు తెలుసుకుని ఫొటోలతో సహా వచ్చాడు.

పిల్లలని రెడి చేసి స్కూల్ కి పంపింది మాధవి.దగ్గరలోనే ఉన్న అత్తమామలను పిలిపించింది ప్రసాదు తో,అందరూ వచ్చి కూర్చున్నారు ఏంది మాధవి ఏమైంది ఎందుకు రమ్మనవు అని అన్నాడు మామ మాణిక్యం. మామ మీ అబ్బాయి  నాకు అన్యాయం చేసాడు అంటూ ఏడుపు మెడలు పెట్టింది మాధవి,ఎంఎం చేసాడు అని అంది అత్త ,అతను ఇంకో అమ్మాయి తో ఉంటున్నాడు అని ప్రసాదు తెచ్చిన ఫోటో లు అత్తమామల ముందు వేసింది మాధవి ..

అవి చూసిన అత్తమామలు ఆశ్చర్య పోయారు. తమను కాదని కొడుకు పని చేయడు అని అనుకుంటున్నా తమ కొడుకు ఇలాంటి పని చేస్తాడు అని వారు అనుకోలేదు.సాయి ఏంటి ఇది నిజమా నువ్వు ఇలా చేసావ అని అడిగారు తల్లిదండ్రులు. సాయి అది చూసి మాధవి కి అంతా తెలిసిపోయింది అని అనుకుని, అమ్మా అవ్వన్ని అబద్ధాలే నా మీద నీకు నమ్మకం లేదా అంటూ బుకాయించడం మొదలుబెపెట్టాడు.

అదంతా అబ్బద్దం ఎదో మాట్లాడిన అంటే మాట్లాడిన అంతే దానికి నాకు సంబంధం లేదు అని అందరి మీద ఒట్టు పెట్టుకుని మరి చెప్పాడు.కానీ మాధవి ఉరుకోలేదు ఏంటి ఇది అబద్ధం అని అంటున్నవా నేను నా కళ్ళతో చూసాను,ఎందుకు అందరి మీద ఒట్టు పెట్టి అబద్ధాలు అడుతావు అంటూ,అత్తయ్యా ఏంటి ఇది నాకు తల్లిదండ్రులు లేరని,మిరే నా తల్లిదండ్రులు అనుకున్నా,నాకు అంతా మిరే అనుకున్న ,నాకే కష్టం వచ్చినా మీకు చెప్పుకున్నా,ఇప్పుడు మీ అబ్బాయి పిల్లల మీద ఒట్టేసి,అబ్బద్దం చెప్తే మేము ఏమై పోవాలి అని అంది. దాంతో అత్త సుశీల సాయి ఇలా కాదు నువ్వు నా మీద ఒట్టేసి ఆమెకు ,నీకు సంబంధం లేదని చెప్పు అంటూ

అతని మీద ఒత్తిడి తెచ్చింది. దాంతో సాయి కి నిజం ఒప్పుకోక తప్పలేదు. అవునే అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నా అని అంటూ చావు కబురు చల్లగా చెప్పినట్లు చెప్పడం తో అందరు అవాక్కయ్యారు. మాధవి ఏడుస్తూ ఏమండీ నేను మీకు ఏమి తక్కువ చేసాను అని దాన్ని చేసుకున్నారు. ఇప్పుడు నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి ఏమిటి అయ్యో దేవుడా ఇంత బతుకు బతికి ఇక చావడమేనా  నాకు దిక్కు అని అంది.

అరే మాధవి నువ్వు ఉరుకో మేమున్నాం కదా అని ఓదార్చింది అత్త సుశీల, తర్వాత సాయి తో ఇదిగో సాయి నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి,ఇవ్వన్నీ మనకు కుదరవు. అందరూ మన గురిoచి చెడు గా మాట్లాడుకుంటారు. వద్దు సాయి ఆమెని వదిలేసి ని భార్య పిల్లలతో ఉండు అని హితవు చెప్పారు. కానీ సాయి మాత్రం తన తల్లిదండ్రుల తో,మాధవి తో ఇదిగో చూడండి ఆమెని నేను పెళ్లి కాకముందే ప్రేమించిన,అప్పుడు పెళ్లికి మీరు ఇప్పుకోలేదు. ఇప్పుడు నేను చేసుకున్న ఇక మికేమి సంబంధం లేదు మాట్లాడకండి.అంటూ గట్టిగా అని అక్కడ నుండి వెళ్లి పోయాడు.

అతని మాటలకు సాయి తల్లిదండ్రులు నివ్వెర పోయారు.ఎప్పుడో చిన్నతనం లో ప్రేమ అని అంటే అప్పుడు చిన్నతనం అని వద్దు అన్నారు.కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాక ఆమెనే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అని తెలిసి వాళ్లేమి మాట్లాడలేకపోయారు. అది విన్న మాధవి కూడా ఆలోచనలో పడి, తర్వాత అత్తమామల దగ్గరికి వెళ్లి,పోని ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడదమా అంటూ అడిగింది,దానికి  అత్తమామలు పోదాం వాడితో మాట్లాడం కదా,చూద్దాం ఒక వారం రోజులై మారతదేమో అంటూ వెళ్లి పోయారు , మాధవి ఒక్కతి ఏమి చేయలేక ఉరుకుంది.

ఇలా పిల్లలు వెళ్ళగానే రోజు ఇంట్లో గొడవలు జరగడం,మాధవి ఏడవడం,సాయి సర్ది చెప్పడం,మాధవి తన చుట్టాలకు పెళ్లికి వచ్చిన వారందరికీ ఫోన్ లు చేసి అందరని  పిలిచి పంచాయితీ లు పెట్టడం జరిగింది.వారం తర్వాత మాధవి,ఆమె అత్తమామలు,ఇంకా కొందరు చుట్టాలు కలసి సాయి పెళ్లి చేసుకున్న ఆవిడ ఇంటికి వెళ్లారు. వీరిని చూసిన నాగమణి ఆప్యాయంగా ఇంట్లోకి పిలిచి,మర్యాదలు చేసింది,మాధావికి అక్కా,అక్కా అని పిలుస్తూ అన్ని వివరాలు చెప్పింది.

నాగమణి ని చూసిన మాధవి ఆశ్చర్య పోయింది .నాగమణి కి ఒక కాలు కుంటుతoది.ఈమె తన భర్త కి ఎలా నచ్చిందో అని ఆనుకుంది.కానీ నాగమణి మాట తీరు చూశాక భర్త ఆమె ప్రేమలో పడ్డాడు అని గుర్తించింది. అసలు విషయం మాట్లాడుతూ తమ కొడుకును వదిలేసి వెళ్ళిపొమ్మని అన్నారు సాయి తల్లిదండ్రులు.దానికి నాగమణి అత్తమామలని,మాధవిని చూస్తూ నేను మీకు అడ్డుగా ఉన్నాను అని నాకు తెల్సు,నాకు కూడా ఇలా ఉండడం ఇబ్బంది గానే ఉంది. కానీ సాయి మాత్రం నన్ను వదలను అని పంతం పట్టి,నన్ను ఇక్కడ పెట్టాడు. నాకు ఎవరూ లేరు తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు.నాకు అవిటి తనం వచ్చింది. సమయంలో నేనున్నాను అని సాయి వచ్చి,నన్ను చూసుకున్నాడు..

కృతజ్ఞతతోనే నేను అతని తో కలిసి ఉంటున్నాను. నాకు హక్కులు,అధికారాలు  వద్దు ,ఒకప్పుడు మేము ప్రేమించుకున్నాం,మీరు మమ్మల్ని విడ దీసారు,ఇప్పుడు కూడా విడదిస్తాము అంటే నేనెక్కడికి వెళ్ళాలి,మీకు నేనేమి అడ్డు రానని చెప్తున్నా కదా,పైగా ఇప్పుడు నేను గర్భవతి ని కూడా,నన్ను సాయి ని విడదీయకండి అంది నాగమణి.ఆమె చెప్పే విషయాలను విన్న మాధవికి,అత్తమామలు జాలి కలిగింది.కానీ ఇప్పుడు వదిలేస్తే రేపు ఆస్థి లో వాటా అడుగుతుంది అని అనుకుని అవ్వన్నీ కుదరవు అమ్మాయి,మర్యాదగా అతన్ని వదిలేసి పో అని అన్నారు.

దానికి నాగమణి ఎక్కడికి వెళ్ళమని అంటారు మామయ్య గారు కడుపులో మీ మనవడు ఉన్నాడు. మీరిలా నన్ను బెదిరిస్తే నేను చక్కగా వెళ్లి పోలీసు కేస్ పెడతాను. మీకు మంచిగా చెప్తే అర్థం అవ్వడం లేదు.నేను కేస్ పెడితే మీ అబ్బాయి వెళ్లి జైల్ లో కూర్చుంటాడు.ఇక మీ మొదటి కోడలు ఎలా బతూకుతుంది కాబట్టి నోరు మూసుకుని నేను చెప్పింది వినండి.

నాకు మీ ఆస్తిలో పైసా అక్కర్లేదు,నాకు పుట్టే కొడుక్కి మీ కొడుకు తండ్రిగా ఉండాలి అంతే,నేను మీ జోలికి రాను,మీరు నా జోలి కి రాకండి. ఇక మీ కొడుకు సంగతి రెండు రోజులు ఇక్కడ,రెంఫు రోజులు అక్కడ ఉంటు తన భాద్యతలు నెరవేరుస్తాడు ఇది మన అగ్రిమెంట్ అని అంది.

నాగమణి మాటలకు అవాక్కయ్యారు అందరూ.నిజమే తాము కోణంలో ఆలోచించలేదు వాడి మీద కేస్ పెడితే,వాడు వెళ్లి జైల్ లో కూర్చుంటే తమని ఎవరూ చూసుకుంటారు అని మాధవి కూడా భయపడింది. సరే మీరు ఆలోచించుకోండి.

నేను టీ తీసుకొస్తా అని అంటూ లోపలికి వెళ్ళింది నాగమణి. ఏం చేద్దాం,ఏం చేద్దాంమంటూ ఒకరికి ఒకరు అడిగారు.మాధవి అత్తమామలని చూస్తూ ఇంకేం చేస్తాం ఆమె చెప్పినట్లు రెండు రోజులు అక్కడ,రెండు రోజులు ఇక్కడ నా మొగుడిని పంచుకుంటా అంది ఏడుపు గొంతు తో,అది కరెక్ట్ గా చెప్పావు అక్కా,అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం అని టీ ఇచ్చింది నాగమణి.

తర్వాత అందరూ అక్కడి నుండి బయల్దేరి వెళ్ళేటప్పుడు అత్త, మాధవికి  బొట్టు పెట్టి ఖరీదైన చీరను పెట్టింది నాగమణి. చీరను చూసిన అత్త చల్ల బడింది.మాధవి మాత్రం నాగమణి కళ్ల లో కనిపించే కొత్త కాంతి ని చూసి, లోలోపల ఆనంద పడింది. కారణం మాధవి నాగమణి మనసులో సాయి మీదున్న ప్రేమని గుర్తించడమే…. 

ఇది చిన్నిల్లు  ని ప్రోత్సహించడం కాదు. ప్రేమ ఎప్పటికైనా ప్రేమనే ప్రేమించుకున్నాం అని చెప్పిన వారికి దగ్గర ఉండీ పెళ్లి జరిపించండి.వారికి ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం వాళ్ళు భాద పడుతూ,భాగస్వామి ని కూడా భాద పెడతారు. కష్టాంగా అనిపించినా ప్రేమించిన వారితోనే వారు జీవించేలా వారి ప్రేమను ఒప్పుకోండి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *