చిన్న మామయ్య

ఇది నా చిన్నప్పుడు జరిగిన సంగతి అంటే అప్పుడు నాకు పదేళ్ళు ఉంటాయి అనుకుంటా .మాది అంటే మా అమ్మమ్మ తాతయ్యలది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం కావడo తో అందరూ కలిసిమెలిసి ఉండే వారిమీ.అప్పట్లో జరుగు బాటు అంటే విడిగా కాపురాలు పెడితే బతకలేక ఇలా ఉమ్మడికుటుంబాల్లో ఉంటూ ఏదొక పని చేసుకుని నాలుగు రాళ్ళూ వెనక వేసుకునివాటితో ఇంకో ఊరికి వలస గా వెళ్ళి అక్కడ ఎదో తోచిన వ్యాపారం చేస్తూ విడిగా బతికేవాళ్ళు.

అప్పట్లో అంటే ఎనభై తొమ్మిదో సంవత్సరం లో అనుకుంటా నాకు ఇది గుర్తు ఉండక పోయేది కానీ సంఘటనకు నేనే ప్రధాన కారణం కాబట్టి నాకు ఇది గుర్తు ఉంది.మర్చిపోలేని ఘటన అది కానీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకుంటున్నా అంటే ఒక వార్త నాలో కలవరాన్ని పెంచింది.ఆదేమి వార్త అంటే ఎప్పుడో మా ఇంటి నుండి వెళ్ళి పోయిన మా చిన్న మామయ్య వస్తున్నా అంటూ రాసిన ఉత్తరం మాలో పెద్ద దుమారాన్ని లేపింది.అసలు ఇన్ని రోజులు కనిపించకుండా వెళ్ళిన వ్యక్తి వస్తున్న అంటే సంబర పడాలి కానీ ఇలా ఆందోళన ఎందుకు అంటారా ?..  

మరి ఆందోళన కాక మరేంటి ఎప్పుడో వెళ్ళిపోయినా వ్యక్తి మేము చనిపోయాడు అని భావిస్తున్న వ్యక్తి ఇప్పుడు అందర్నీ వదిలేసినేను ఎక్కడున్నానో తెలుసుకునినాకే ఉత్తారం రాసాడు అంటే నాకు భయంఆందోళన కాక మరేంటి ఉంటాయి. చిన్నప్పటి గుర్తులుఅ సంఘటన నాకు గుర్తుకు వచ్చాయి.నాకు పదేళ్ళ వయసుమా మామయ్యలు నలుగురు మొత్తంఇక చిన్న మామయ్య అంటే మాకు అందరికి చాలా  ఇష్టంఎందుకంటే మాకు అన్ని విషయాల లో ను మాతో కలిసి ఆడుతూ పాడుతూ ఉండే వాడు

దాంతో మాకేమి కావాలన్నా మేము మా చిన్న మమయ్యనే అడిగే వాళ్ళంమా తాతయ్య అంటే మాకు అందరికి హడల్ఇంట్లో ఒక్క మా చిన్న మామయ్యే మా తాతగారికి ఎదురుగా వెళ్ళి మాట్లాడేవాడు అప్పుడప్పుడుమా తాతగారి కి ఆడపిల్లలు అంటే అంత ఇష్టం ఉండేది కాదగు.మాకేమో బయటకు వెళ్ళి ఆదుకోవాలని పొలాల వెంట నడవాలనిఅక్కడి వింతలూ అన్ని చూడాలని ఉండేది.అయితే అలా తిరిగితే పని వాళ్ళు ఇచ్చే గౌరవం తగ్గి పోతుందని భావించే వాళ్ళు తాతగారు.

మాకేమో ఎప్పుడూ ఇంట్లో ఉండి బోర్ గా ఫీల్ అయ్యే వాళ్ళంఅలాంటి ఒక వేసవి కలం లో నాకు అప్పుడప్పుడే బయటకు వెళ్ళి చెరువులో తామరలు చూడాలనే కోరిక ఎక్కువయ్యిందిదానికి కారణం లేకపోలేదునా స్నేహితురాలు ఒకమ్మాయి మన ఊర్లోని చెరువులో ఉన్న తామర పువ్వులు ఎంత బాగా ఉన్నాయో తెలుసానీకు అవి చూసే విలు లేదంటూ నన్ను వేలాకోలం చెయ్యడం తో అవి ఎలాగైనా చూడాలి అని అనుకునిమా మామయ్య తో చెప్పను ఎప్పుడోకానీ మా తాతగారు ఇంట్లోనే ఉండడం వల్ల మాకు బయటకు వెళ్ళడం కుదరలేదు.తర్వాత కొన్ని రోజులకు మా తాతగారు పని మిద పట్నం వెళ్ళడం తో మా ఆనందానికిఅవధులు లేవు

.అంటే మేము ఏమైనా చేయాలి అని అనుకుంటే మా తాతగారు పట్నం వెళ్ళినప్పుడే పనులన్నీ చేస్తూ ఉంటాములేదంటే తాతగారికి తెలిసిందో మాకు పెద్ద శిక్ష నె వేస్తాడు.కాబట్టి మేము మాకు కావాల్సిన పనులన్నీ ఒక్కొక్కటిగా ఒక పేపర్ మిద రాసి మా మామయ్యకు ఇచ్చే వాళ్ళందాంతో ఎవరి కోరిక లో ఎంత నిజం ఉందో దాన్ని మొదట తీర్చే వాళ్ళు అలా మా తాతగారు ఎన్ని రోజులు పట్నం వెళితే మాకు అన్ని రోజులు పండగే ఇకతాతగారు వెళ్ళే రోజు రానే వచ్చింది

మా అందర్నీ పిలిచి మేమెంతా పెద్ద కుటుంబం కాబట్టి ఒక డజను కన్నా ఎక్కువ పిల్లలమే ఉంటాం కాబట్టి మా అందర్నీ పిలిచి మాలో పెద్ద వాళ్ళను చూస్తూ చూడండి మీ పిలలు ఎక్కడికి వెళ్ళ కూడదు దివాణం దాటాకుడదు ఆడపిల్లలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అసలే దొంగల భయం ఉంది ఊర్లో కాబట్టి దివాణం దాటి ఎవరూ వెళ్ళ కూడదు నా మాట దాటి వెళ్ళారో మీకూ కఠి శిక్ష ఉంటుంది అని మాకు వార్నింగు లాంటిది ఇచ్చారు.మేమంతా బుద్ది గా తలలు ఊపాము ఎక్కడికి వెళ్ళమన్నట్టుగా ఇక తాతగారు వెళ్ళిపోయారు పట్నానికి

రోజు మాత్రం అందరం తాతగారికి చెప్పినట్టుగా బుద్ది గా ఉన్నాము. రాత్రి మా చిన్న మామయ్య ఎవరికీ తెలియకుండా మేము రాసిన కాగితం లోని అందరి కోరికలని చదవడం మొదలు పెట్టాడు.మేము ముందు అంటే మేము ముందు అని అందరూ ఎగబడ్డారుదాంతో నా కంటే పెద్ద వాళ్ళ కోరికలను తీరుస్తాను అని అన్నాడు

.సరే నేను వాళ్ళ కంటే చిన్న దాన్ని కాబట్టి ముందు  నా కోరిక తీర్చాలి అని నేను అడిగాకానీ వాళ్ళ కోరికలు కొంచం సబబుగానే అనిపించాయిఅందులో మామిడి పళ్ళు తినడం ,తాటిముంజలు దొంగిలించాలి కొబ్బరి బొండాలు తాగడం జామతోటలో వండుకుని తినడం వంటివి నాకు నచ్చినవి ఉండడం తో నేను ఎక్కువ వాదించలేక పోయాను.

ఇక తెల్లవారి నుండి మా ఒక్కో కోరికను తిర్చడం మొదలు పెట్టాడు మా చిన్న మామయ్య అదేంత కష్టమో నేను దగ్గర ఉండి చూడడం తో మా కోసం మామయ్య ఎంత కష్ట పడుతున్నాడో అర్ధం అయ్యి నాకు మా మామయ్య మిద ఇంకాస్త ప్రేమ పెరిగింది.ఇక మా తాతగారు మరో రెండు రోజుల్లో వస్తారు అని అనగా మేము అనుకున్న సమయం వరకు అయితే రోజు మధ్యానం నేను మా చిన్న మామయ్య కలిసి తామర పువ్వుల కోసం చెరువు దగ్గరికి వెళ్ళామునేను గట్టున ఉంటె మా మామయ్య చెరువులోకి దిగి పువ్వులు కోస్తూ ఉన్నాడుఎంతైనా ఆడపిల్లలం కదా ఎన్ని పువ్వులు కోసినా ఇంకా కావాలి అనిపిస్తుంది

కదా నేను ఒక పది పువ్వులు కోసినా కూడా చెరువు మధ్యలో ఉన్న ఒక తామర పువు బాగా వికసించిపెద్దాగా కనపడడం తో నాకు అది కావాలని అడిగా మా మామయ్య దాన్ని కోయడానికి వెళ్ళిన మామయ్య అక్కడ ఉబి ఉందని చూసుకోలేదు దాంతో అందులో కురుకు పోతూ నన్ను పిలిచే సరికి నాకు భయం వేసి గట్టిగా అరిచాను..

నా అరుపులు విన్న చుట్టుపక్కల ఉన్న పొలాల లోని రైతులు అంతా పరుగున వచ్చి మామయ్య ఉబిలోకి వెళ్ళడం చూసి అతి కష్టం మిద అతన్ని కాపాడారు.మామయ్య సృహ కోల్పోయాడు.నాకు భయం తో చెమటలు వచ్చాయి.వాళ్ళంతా  నన్ను  మామయ్యను దివాణం లోకి తీసుకుని వెళ్ళి వదిలి పెట్టారు మా అదృష్టం బాగా లేక మా తాతగారు అదే రోజు సాయంత్రం వచ్చారు విషయం తెలిసి బాగా కొప్పాడ్డారు ఆ తర్వాత సృహలో లేని మామయ్య ను ఆచారి  గారి కి చూపించి వైద్యం చేయించారు.

తర్వాత రెండు రోజులకు మామయ్య కోలుకున్న తర్వాత తనని పిలిచారు మేము భయ పడుతూనే ఉన్నాం ఎందుకంటే ఎదో శిక్ష వేస్తా అన్నారు కదా తాతయ్య అని అందరం కలిసి వెళ్లాం మేము తాతయ్య ముందుకు వెళ్ళాక కాస్త దూరం లో నిలబడ్డాం మామయ్య కాస్త మొండి వాడు కాబట్టి ఎదురుగ వెళ్ళాడు.చూడు శ్రీధర్ నేను వద్దు అన్న పని చేయడం నీకు అలవాటు గా మారిందినేనేమి చెప్పినా చేయొద్దు అని అంటున్నా అదే పని చేయడం నీకు కొత్తేమి కాదు కానీ నువ్వు ఇప్పుడు చేసిన పని మాత్రం నాకు నచ్చలేదు

నువ్వు కాబట్టి చెరువులో దిగావు అదే ఆడపిల్ల దిగితే ఏమై పోయేదో ఒక్కసారి ఆలోచించు అయినా మీరు చిన్న వాళ్ళు కాదు  అర్ధం కాకపోవడానికి ఇప్పుడు నేను నీకు శిక్ష వేయకుండా ఉంటె మీ అందరికి అదే అలవాటు గా మారుతుంది కాబట్టి నువ్వు ఇప్పుడే ఇలాగె కట్టు బట్టలతో ఇంట్లోచి బయటకు వెళ్ళి పో అని అన్నాడు

మేము అది వినగానే అయ్యో వద్దు తాతయ్య అని అంటూ బతిమాలాము తాతయ్య ముందుకు వెళ్ళి కానీ తాతయ్య గారు ఊరుకోకుండా వెళ్ళు అవతలికి అని మా అమ్మలను పిలిచి మీ పిల్లను మీతో పాటుగా తీసుకుని వెళ్ళండి అని ఘర్జించారు ఇక ఆయనకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ లేక పోవడం తో మేము జాలిగా లోపలి కి  వెళ్లిపోయాము అదే నేను చివరి సారి మా చిన్న  మామయ్యను చూడడం ఇక అక్కడి నుండి మా నాన్నగారు వేరే ఊర్లో బిజినెస్ పెట్టుకోవడం తో మేము బయటకు వచ్చేసాము ఆ తర్వాత చదువు పెళ్లి పిల్లలు అన్ని అయిపోయాయి ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత తను నన్ను వెతుక్కుంటూ నా కోసం వస్తున్నాడు అంటే తను ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నేనే కారణం కాబట్టి నన్ను ఎదైనా చేయడానికి వస్తున్నాడా లేదా అదే సాకుగా చూపించి నా భర్తకు నా మిధ లేని పోనీ వి చెప్పి మా కాపురం లో చిచ్చు పెడతాడ ఏమి చేస్తాడు

ఎందుకైనా మంచిదని విషయాన్నీ నా భర్తకు చెప్పడం మంచిది అని భావించి తనతో మొత్తం విషయం చెప్పాను దానికి మా వారు ఎందుకు అంతాగా భయ పడుతున్నావు అతను వచ్చాక ఏమి అంటాడో చూద్దాం ఇప్పటి నుండే ఎందుకు అంత ఆలోచన చేస్తున్నావు నీ గురించి నాకు నా గురించి నీకు అన్ని రహస్యాలు తెలిసి నప్పుడు వేరే ఎవరో వచ్చి ఎదో చేస్తారు అని భయపడుతూ కూర్చుంటే ఎలా అని నన్నే తను ఓదార్చి నాలోని భయాన్ని బయటకు పంపే ప్రయత్నం చేసాడు.

నాకు అదే నిజం అనిపించింది రాని చూద్దాం ఇన్నేళ్ళుగా రాని వాడు ఇప్పుడు నా దగ్గరికే అందునా అడ్రెస్స్ తెలుసుకుని మరి ఎవరి ఇంటికి వెళ్ళకుండా ఎందుకు వస్తున్నాడో అసలు తన మనసులో ఏముందో చూద్దాం వచ్చాక ఎలాగు తెలుస్తుంది లే అని అనుకున్నా కానీ ఎక్కడో మనసు లోతుల్లో నాలో భయం పొంగుతుంది.రాత్రుళ్ళు నిద్ర పోవడం ఆలస్యం నిద్రలో కూడా మా మామయ్య నా భర్త తో ఎదో చెప్పినట్లు అతను దాన్ని నమ్మి నన్ను తోసేసి వెళ్తూన్నట్టు నేను ఆగమని అంటూ వాళ్ళని బతిమాలితే వినకుండా నా పిల్లలను కూడా తీసుకుని వెళ్తూన్నట్టు ఏవేవో పిచ్చి పిచ్చి కలలు రాసాగాయి

అతను వచ్చి ఏదోటి చెప్పే వరకు నాకు ఇలాగె వస్తాయి అనేది మాత్రం అర్ధం అయ్యింది.అయినా ఎందుకిలా గిల్టి గా ఫీలవుతున్నా నేనేం తప్పు చేయలేదు కావాలని కూడా చెయ్యలేదు ఎవర్ని బాధ పెట్టలేదు రోజు తాత అలా అనడం నా తప్పు కాదు కదా అని నాకు నేనే సమాధానం చెప్పుకున్నా మామయ్య వచ్చి అడిగితె అసలు ఏమడిగినా నేను జవాబు చెప్పాలి అని అనుకున్నట్టుగా అన్ని సమాధానాలు పూర్తి చేసి పెట్టుకున్నా ఎలా అడిగినా ఏమి అడిగినా అన్నిటికి జవాబు ని ఇవ్వాలని అనుకుని సిద్ధంగా ఉన్నాను

మామయ్య వచ్చే రోజు రానే వచ్చింది. రోజు నా భర్త వెళ్ళి నా మామయ్య ని రిసీవ్ చేసుకున్నాడు కానీ ఆయన్ని గుర్తు పట్టడానికి వీలుగా చేతిలో అతని పేరుతో ఉన్న అట్ట ని పట్టుకుని నిల్చుంటే మామయ్య వచ్చి పలకరించి అది నేనే అని పరిచయం చేసుకున్నాడు అని మా వారు ఇంటికి వచ్చాక నాకు చెప్పాడు.అప్పటికి ఇప్పటికి మా మామయ్య చాలా మారి పోయారు

బాగా ఎత్తుకు తగ్గ లావు తో చూడడానికి నిండుగా అందంగా హుందాగా ఉన్నాడు మామయ్య ఇప్పుడు కమిషనర్ గా పని చేస్తూ ఉన్నాను అని చెప్పాడు మేము చాలా సంతోషించాము ఆ రెండు రోజులు మాకు మామయ్య కబుర్ల తోనే గడిచి పోయింది అయినా ఎక్కడో ఎదొ అనుమానం ఎక్కడో ఎదో గిల్టీ ఫీలింగ్ అయితే మామయ్య మొహం లో గంబిరతను చూసాను

అనే తృప్తి తప్పా కౌర్యం కృరత్వం పగ లాంటివి నాకు ఏమి కనిపించలేదు.మా వారు కూడా అదే అన్నారు నాతో పూర్వి నువ్వు ఏదేదో అనుకుని భయ పడ్డావుబాధ పడ్డావు కానీ అతని మనసులో ఏమి లేనట్టే కనపడుతున్నారు మనిషి కూడా చాలా హుందాగా ఉన్నారు అని అన్నారు అభి నా భర్త….

మా చిన్న మామయ్య వచ్చి వారం రోజులు అవుతున్నా కూడా తను ఏమి అనడం లేదు పైగా విషయం గురించి కూడా తీయడం లేదు నేను మా మామయ్యకు కావలసినవి అన్ని వండి పెడుతూ ఉన్నా ఆయనకు నచ్చినట్టుగానే  చేస్తున్నా తను నా భర్తకు ఏమి చెప్తున్నారో అనే నా ఆడమనసు కోట్టుకుంటూ ఉంది.

ఒక రోజు అభి కూరగాయల కోసం బయటకు వెళ్ళారు ఇంట్లో నేను చిన్న మామయ్య తప్ప ఎవరూ లేరుపిల్లలు స్నేహితుల ఇంటికి వెళ్ళారు నేను వంటింట్లో అభి తెచ్చే కూరగాయలు పెట్టాడానికి ఫ్రిడ్జే లో స్థలాన్ని రెడీ చేస్తున్నాఇంతలో వెనక ఎదో అలికిడి అయ్యి గబుక్కున వెనక్కి తిరిగి చూసానుఅక్కడ నవ్వుతూ మా చిన్న మామయ్య నిలబడి ఉన్నారు.

క్షణం లో వెయ్యో వంతు నాకు వళ్ళు జలదరించి నాలో రకరకాల అనుమానాలు మొదలైనాయి అయినా మొండి గా అలాగే నిలబడిన నా దగ్గరికి వస్తున్నారు. మామయ్యఏంటి మామయ్య మికావాలి అని అడిగాను బింకంగాదానికి ఆయన నవ్వుతూ అది అది అది అని అంటూ నసుగుతూ ఉన్నారు దాంతో నా అనుమానం బలపడసాగింది అయినా ఎక్కడో అపనమ్మకంఏంటి మామయ్య చెప్పండి అని అంటే అది నువ్వు అని ఆగిపోయారు హే భగవాన్ నాకు తండ్రిలాoటి మామయ్యను కొట్టే పరిస్థితి రానివ్వకు అని అనుకుంటూ నా ఎడమచేతిని పక్కనే ఉన్న చాకును పట్టుకున్నాను

మామయ్య మళ్ళి నవ్వుతూ ఏమి లేదురా పూర్వి మీ అమ్మగారు చేసే పూల్ మఖని తీపి అంటే నాకు చాలా చాలా ఇష్టం ఇన్నాళ్ళుగా నువ్వు చేస్తావేమో అని చూసాను కానీ నువ్వు చేయలేదు అది నీ భర్త ముందు అడిగితె బాగోదు అని కేవలం అది తినడానికే నేను ఇంత దూరం నిన్ను వెతుక్కుంటూ వచ్చానుకొందరు చేతిలో ఎదో మహత్యం ఉంటుంది అది మీ అమ్మ నీకు నేర్పే ఉంటుందని భావించిఅంత దూరం నుండి ఇంత దూరం కేవలం అది తినాలనే ఇన్నేళ్ళ తర్వాత వెతుక్కుంటూ వచ్చను అనిఈ రోజు నాకు చేసి పెట్టు రేపే నా ప్రయాణం అని చెప్పివెళ్ళిపోయాడు గది లోకి.

ఓహ్ గట్టిగా గుండెల నిండా ఉపిరి పీల్చుకుని వదిలేసానుగత రెండు వారాలుగా ఎంతో సతమతమవుతూఏదేదో ఉహించుకుంటున్న నేను మామయ్య చెప్పినా మాట తో నాలోని అనుమానాలుదిగులుబాధఆత్రుత లు అన్ని ఒక్కసారిగా చేత్తో తిసేసినట్టుగా పోయాయి.ఇదెందుకు నేను ఆలోచించలేక పోయాను.

అందుకే అంటారేమో ఆడది ముందు పుట్టి అనుమానం తర్వాత పుట్టింది అని అవును మామయ్య కొంచం బోజన ప్రియుడు అతను ఎక్కడ ఆహారం బాగుoదని తెల్సినా వెళ్ళి తిని వస్తారు. ఇది నాకు తట్టనే లేదు అని నాలో నేను నవ్వుకున్న తర్వాత అభి వచ్చేసరికి మామయ్య తో గల గల నవ్వుతు మాట్లాడుతున్న నన్ను చూసి ఆశ్చర్యపోవడం అభివంతు అయ్యింది…..

Normal
0

false
false
false

EN-US
X-NONE
HI

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
mso-bidi-font-size:10.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-fareast-font-family:”Times New Roman”;
mso-fareast-theme-font:minor-fareast;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Mangal;
mso-bidi-theme-font:minor-bidi;}

Related Posts

1 Comment

Comments are closed.