చీకటి నుండి వెలుగుకు
పెద్ద ( చిక్కటి ) చీకట్లో
చిన్న దీపం వెలుతురు
ఎంతో గొప్పగా కనిపిస్తుంది
దారి ని చూపిస్తుంది!
అజ్ఞానమనే పెద్ద అంధకారంలో
విజ్ఞానమనే చిన్న జ్ఞాన జ్యోతి
మనసుకు వెలుగై మనుషలకు
కొలువై జీవితాలను నడిపిస్తుంది!
ఆ వెలుగు దారుల్లో నడిచీ నడిచీ
చిరు చిరు చీకట్లలో పడిపోకు
వెలుగులోనే జీవించు! వెలుతురు
నే ఆశ్రయించు!
అప్పుడే చీకటితో వెలుతురు
చెప్తుంది నేనున్నానని! నేను
న్నాననీ నీకేం కాదనీ! నిజమే
కదా! వెలుతురులో ఉంటే మనకేం
కాదు! వెలుగులోనే జీవిద్దాం!
ఉమాదేవి ఎర్రం