చుక్కలాంటి చిన్నదానా

చుక్కలాంటి చిన్నదానా

“చీర కట్టి సింగారించి చిలిపి తలపుచిక్కుదీసి,
చక్కదనంతో
సవాలు చేసే చుక్కలాంటి చిన్నదాన!,

. ‘మేలిమి బంగారు పట్టు చీర,
   లేతకు పచ్చ జరీ అంచులతో,
   నునిలేత సున్నిత నీ పసిమి
   వయ్యారములను తాకుతూ,
    కలహంసల కదలికలు నీవే
     సుమా!

    నీ ఆనంద దరహాసాల
     సరిగమలు, పదము
     పదము లో ఘల్లు ఘల్లు
     మన ,
      వనదేవతలా
     కలియతిరిగే కిన్నెరసాని,

     అరచేతిలో పండిన గోరింట
      అందని ద్రాక్ష వైనావే,
      ఓ నా అపరాజిత,!
      నిన్ను చేసిన ‘బ్రహ్మ కైన
       పుట్టినే రిమ్మతెగులు,
       నేనేంతవాడినే
       ఓ సుందరాంగి!
   
  ..  నీ చేతిలో  పూల సజ్జ నైన
      కాకపోతిని,
      నీ కురులలో మల్లి నైన
.     కాకపోతిని ,
       నిలువెల్లా అల్లుకుపోయిన
       పసిడి రంగు పట్టు చీర
       అయినా కాకపోతిని,
       ఈ జన్మకైనా, మరే
       జన్మకైన నిన్ను పొందగలిగే
       అదృష్టం నాదే నా ప్రేయసి!
        .    . .*”””””**

చుక్కలాంటి చిన్నదానా
వేల్పురి లక్ష్మీ నాగేశ్వరరావు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *