చెదిరిన గూడు…ప్రకృతిని కాపాడడంలో విఫలమౌతున్నాడు…

శీర్షిక:- చెదిరిన గూడు…

ప్రకృతిలో భాగమైన మనిషి
ప్రకృతిని కాపాడడంలో విఫలమౌతున్నాడు…
మనిషి తన అవసరాలకు మించి తన స్వార్థ బుద్ధితో పచ్చటి ప్రకృతిని ధ్వంసం చేస్తు
జీవ వైవిధ్యాన్ని కాలరాసే క్రమంలో అడవులు, భూములు, చెరువులు అంతమౌతున్నాయి….
ప్రకృతిలో ఋతువులు గతితప్పి విపరీతమైన వైపరీత్యాలు పెరుగుతు మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లడమే కాకుండా
ప్రకృతిలోని కొన్ని పక్షులు, జంతువులు అనేక రకమైన జీవరాసులు అంతరించి పోతున్నాయి…
మన కళ్ల ఎదుటనే మనం చూసిన కొన్ని పక్షి జాతులు కనుమరుగై పోతున్నాయి
ప్రకృతి వనంలో జీవించాల్సిన ప్రాణులు… కాంక్రీట్ జనారణ్యంలో జీవిస్తు మనుగడ సాగిస్తున్న వైనం..
వాటి సంతతి మనుగడకై గూడు కట్టుకోలేని దుస్థితి
ఎంత దారుణం ఎంత దారుణం
అందుకే ప్రకృతి పచ్చదనాన్ని కాపాడే బాధ్యత పాలకులకే కాదు ప్రతి పౌరుని బాధ్యత కూడా..
అందుకే…
విరివిగా చెట్లను పెంచుదాం…
జీవవైవిధ్యం కాపాడుదాం…
ప్రకృతి ఒడిలో జీవిద్దాం…
సర్వేజన సుఖినోభవంతు…

అంకుష్…✍️
బెల్లంపల్లి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *