చేదోడు వాదోడుగా…బాబుకి బారసాల చేస్తున్నప్పుడు 

అంశం:⁠- వేధింపులు

శీర్షిక:⁠- చేదోడు వాదోడుగా

                         యాదయ్య తన కూతురికి పెళ్లి చేసి సంవత్సరం అయింది. ఇప్పుడు కడుపుతో ఉంది. అత్తారింట్లో సీమంతం చేసి పుట్టింటికి తీసుకొని వచ్చారు. రెండు నెలలు తర్వాత బాబు పుట్టాడు.  బాబుకి బారసాల చేస్తున్నప్పుడు  స్నేహ అత్తారింటి వాళ్ళు అందరూ వచ్చారు. స్నేహాకి మరిది అయిన సుమన్ కి స్నేహ చెల్లెలు అయిన రమ్య నచ్చింది.
తొలి చూపుల్లో ఇష్టపడ్డాడు. రమ్య  చదువుకుంటుంది.  అక్కకి మరిది అయినా సుమన్ తో కొంచం చనువుగా మాట్లాడేది రమ్య.
అలా మాట్లాడడంతో రమ్య నంబర్ తెలుసుకుని సుమన్ అప్పుడప్పుడు తనకి కాల్ చేసేవాడు.
కొన్ని రోజులు బాగానే మాట్లాడుకున్నారు.
ఒక రోజు హఠాత్తుగా ,
“నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
నేను ఇంట్లో వాళ్ళకి చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారు” అని చెప్పాడు సుమన్.
“నా తల్లిదండ్రులకు ఇష్టమైతే , నాకు ఇష్టమే” అని చెప్పింది రమ్య.
అయితే సుమన్ ఆర్మీ లో చేస్తున్నాడు. స్నేహ భర్త లోకేష్ ఇంటి దగ్గరే మెకానిక్ షెడ్ పెట్టుకున్నాడు. సరిగ్గా నడవడం లేదు ఆ షాప్ సరిగ్గా నడవడం లేదు. ఓకే సంపాదన అంతంత మాత్రం ఇంకా ఇల్లు గడపకపోవడం వల్ల ఆర్మీలో ఉన్న సుమన్ ఇంటికి ఖర్చులన్నీ చూసుకునేవాడు.
రమ్యని ప్రేమిస్తున్నాను మాకు పెళ్లి చేయండి అని సుమన్ ఇంట్లో వాళ్లని అడిగితే ఎవరూ ఒప్పుకోలేదు. కానీ రమ్య ,స్నేహాని వాళ్ళ అమ్మానాన్నని ఇష్టమొచ్చినట్టు తిట్టారు.
ఎన్ని రకాలుగా , అన్ని విధాలుగా సుమన్ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నించిన వాళ్లు మాత్రం ఒప్పుకోలేదు.
అతను ఆర్మీ లోకి వెళ్లిన తర్వాత తీవ్ర మనస్థాపనికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కొడుకు సంపాదన అంతంత మాత్రం సంపాదించే కొడుకు తన కోడలు చెల్లెలు వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని పగతో కోడల్ని ఆడపడుచులు అత్త కలిసి వేధించడం మొదలుపెట్టారు.
వాళ్ళు స్నేహని ఎంత వేధింపులకు గురిచేసిన భరిస్తూనే ఉంది కానీ ఒకరోజు మాత్రం స్నేహ తండ్రి తన అత్తయ్య వాళ్ళని పరామర్శచడానికి వస్తే ఘోరంగా అవమానించి పంపించారు.
ఇంకా స్నేహ అక్కడ వేధింపులు భరించలేక తన తండ్రితోనే పుట్టింటికి వెళ్లిపోయింది.
ఇద్దరూ నెల రోజుల తర్వాత ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
తన కొడుకుని చూసుకుంటూ చిన్న ఉద్యోగం చేసుకుంటుంది స్నేహ. తన తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటుంది.

మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *