ఛలో ఛలో పల్లెకు పోదాం- (Let’s go to the Best Village 7)

ఛలో ఛలో పల్లెకు పోదాం

 

ఛలో ఛలో పల్లెకు పోదాం
ఛలో ఛలో పల్లెకు పోదాం

 

మా వాడు కోరిన కోరిక విన్న నాకు ఆశ్చర్యం కలిగించింది. అంతకు ముందు ఎన్నో సార్లు నేనె అడుగుతున్నా కూడా వద్దు అన్న వాడే వెళ్దాం అని పట్టు పట్టాడు .

దాంతో నాకు సంతోషం కలిగినా ఎందుకో అసలు కారణం తెలుసుకోవాలని అనిపించింది అయితే నేను వెంటనే అడగలేదు అలా పిల్లలని వెంటనే అడిగితే వాడు ఇంకేదో కారణం చెప్పొచ్చు లేదా అసలు చెప్పకపోవచ్చు అందుకే అప్పటికి అయితే సరే అన్నాను అడగలేదు..

రెండు రోజులు అయ్యాక  వాడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు నాన్న  తాతయ్య వాళ్ళ ఊరికి వెల్దామని నీకెందుకు అనిపించింది రా అంటూ అడిగాను. దానికి వాడు చెప్పిన సమాధానం విని ఆశ్చర్య పోవాలో ఆలోచించాలో అర్థం కాలేదు అదేంటి మీరు కూడా వినండి…

 

అమ్మా అక్కడైతే తాతయ్య వాళ్ళు ఉంటారు పచ్చని చెట్లు పంట పొలాలు చల్లని గాలి స్వచ్ఛమైన మనుషులు ప్రేమలు ఆప్యాయంగా పిలిచే ఆత్మీయులు అందరూ ఉంటారు.

అలాగే మందులు వేయని పళ్ళు, కూరగాయలు పాలు పెరుగు దొరుకుతాయి అక్కడ మనుషులు ప్రేమగా మాట్లాడతారు ప్రేమగా ఉంటార్జ్ అన్ని పంచుకుని అందరూ కలిసి తింటారు కలిసే పనులు చేసుకుంటారు కలిసే నిర్ణయాలు తీసుకుంటారు..

ముఖ్యంగా మా పిల్లలకు స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుంది అలాగే మట్టిలో ఆదుకోవడం తాతయ్య చెప్పే నీతి కథలు వినడం మంచి ఎండ ,గాలి తగలడం ఆ మట్టిలో ఆడుకోవడం వల్ల మాకు కావాల్సిన విటమిన్లు అన్ని దొరుకుతాయి.

అందుకే అక్కడ ఉన్న పల్లె జనాలకు రోగాలు రావడం తక్కువ ,ఎందుకంటే కష్టపడి బ్రతుకుతారు పని చేస్తారు కాబట్టి దానికి తగిన తిండి తింటారు

వాళ్ళు స్వశక్తీ తో పండించుకున్న పంటను వాళ్ళు తినడం వల్ల  వారికి మంచిదో చెడేదో తెలుసా కాబట్టి వారిజి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు ఒకవేళ వచ్చినా ఇంటి వైద్యం చేసుకుని తగ్గించుకుంటారు తప్పితే మనలగా ప్రతిదానికి టాబ్లెట్స్ వేసుకోరు.

ఛలో ఛలో పల్లెకు పోదాం

అలాగే తాతయ్య నాన్నమ్మ అమ్మమ్మ మమయ్యాలు వారి పిల్లలు అంతా కలిసి ఉంటాం కాబట్టి మాకు కూడా  పది మందిలో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలో ఎలా మసలుకోవాలి అనే ప్రవర్తన అలవడుతుంది

అలాగే చిన్న చిన్న దెబ్బలు తగిలినా బాధ పడకుండా ఉండే తత్వము ఎన్ని ఆటంకాలు వచ్చినా తట్టుకునే శక్తిని ఎలా పెంపొందించుకోవాలో కూడా మాకు చిన్నప్పటి నుండి అలవడుతుంది

అంటే పట్నం లో ఉండడం కంటే పల్లెలో ఉండడం మంచిది అని మా స్కూల్ లో టీచర్ చెప్పారు అమ్మా అందుకే మనం పల్లెకు పోదాం అమ్మా అంటున్న కొడుకుని చూస్తూ నిజమే కదా పల్లెలో ఉన్న వాళ్ళు కష్టజీవులు పంటను పండించుకుంటు కష్టపడి పనిచేస్తూ

దానికి తగ్గట్టుగా తింటూ పది మందికి పంచుతూ ప్రేమ ఆప్యాయతలు అందరికి ఇస్తూ ఎవరికైనా  కష్టం వస్తే మేమున్నాం అంటూ అండగా ఉంటూ అంతా సముష్టి కుటుంబం లా ఉండే పల్లెలు ఎక్కడ , మాట్లాడితే ఎక్కడ మీద పెడతారో  అని మాట్లాడకుండా

నాలుగు గోడల  మధ్యలో ఉంటూ  నాలుగు గోడల నడుమే పని చేస్తూ అదే లోకం గా భావిస్తూ    అదే స్వర్గం అని అనుకుంటూ డబ్బు సంపాదించడం కోసం తమ  జీవితాలను  త్యాగం  చేస్తూ తామేం కోల్పోతున్నారో తమకే అర్థం  కాక తమ  తర్వాతి తరాలకు మట్టి గొప్పదనం తెలియకుండా

ఆ మట్టిలో తిరిగితే  అవమానం గా భావిస్తూ  తమ పిల్లలకు కూడా పట్నం లో ఉండడమే  గొప్ప అని కాన్వెంటులో చడవడమే ప్రతిష్ట అని బోధిస్తుంది నలుగురితో ఉండకుండా ,నలుగురితో పంచుకోకుండా నలుగురితో మాట్లాడకుండా నాలుగు కాలాలు  బ్రతకాకుండా నాలుగు  గోడలే పరమ శుఖం అని  అనుకుంటూ

నా పిల్లలు కూడా ఇలా గే  ఎవడి దగ్గరో పని చేయాలని అనుజ  తమ కష్టాన్ని  నమ్ముకోకుంఫా ఎవ డో తిట్టినా పడుతూ బ్రతికే వాళ్ళు  తమ పొలం లో తమ మట్టిలో  పనిచేయకుండా ఇలా పట్టణాలు వలస  వస్తే  ఇంకా పల్లెటూరి లో ఎవరి ఉంటారు

ఎవరికి పల్లెలు కావాలి ఆ ఎంద మట్టి ఆ ప్రేమలు ఆప్యాయతలు అనురగలు ఎవరు కోరుకుంటున్నారు అంతా స్వార్థం అనేది ప్రవేశించి మేము మా పిల్లలు బాగుంటే చాలు మాకు ఎవరూ అవసరం లేదు మేమె గొప్ప మకంటే తోపు ఎవరు లేరు మేక్ అన్ని తెలుసు మేమె నాలుగు చేతులా సంపాధిస్తున్నాం

మా పిల్లలు మట్టిలో అడుకోరు వారికని ఫ్రెష్ గా కావాలి వాళ్ళని కాలు కింద పెట్టనియకుండా చూసుకుంటాం ,మేము కష్టపడటం వల్ల మా పిల్లలు కూడా కష్ట పడకూడదు వారికి అన్ని విధాలా అన్ని అమర్చి పెట్టాలి  అనే భావం అందరిలో పాతుకుపోయిన ది.

పల్లె అంటేనే చి చి అంతా మట్టి పశువులు అక్కడ అంతా కంపు అని అనేవాళ్ళు ఇక్కడ   ఫ్యాక్టరీ కంపును మాత్రం ఆహా ఓహో  అంటూ పిలుస్తూ  పాచిపోయిన పిజ్జాలు తింటూ  పాకెట్ పలు తాగుతూ  అదే  ఆరోగ్యం అదే  గొప్పగా అనుకుంటున్నారు.

తమని కానీ పెంచిన వారిని చీఫ్ గా చూస్తూ వారిని పట్టించుకోకుండా వారితో మాట్లాడితే ఎక్కడ కొంప మీదకి పెడతారో అని ఆలోచించి వాళ్ళను అసలు ఇంటికి రానివ్వకుండా తమ పొలాలకు  తాతయ్య నాన్నమ్మ అమ్మమ్మ  మమయ్యాల  ప్రేమలు ఆప్యాయతలు తెలియకుండా వారిని అన్నిటికి దూరం చేయడమే లక్ష్యం గా పెద్దలు మారి పోతుంటే  కలికాలం అనుకోక  తప్పడం లేదు.

ఇలా ఇప్పుడు ఈ జనరేషన్లో అయినా నా కొడుకుతో అయినా. ఈ మార్పు మొదలు కావాలి అలా మొదలు అవ్వడానికే ఏమో ఇలా వాడి నోటి నిండి పల్లెకు పోదాం అనే మాట వచ్చింది

నిజమే వెళ్లి అక్కడి ఉండి పొలాన్ని చూసుకుబతు గడపడం మంచిది ఈ నిర్ణయాన్ని అమలులో పెట్టాలి అని అనుకుంటూ ఆలాగే వెళ్దాం నాన్న నీ కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు బాబు నువ్వు ఆరోగ్యoగా ఉండాలి.

అన్ని విధాల సంప్రదాయాలు ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు నీకు తెలియాలి, నువ్వు అన్నిటిని రుచి చూడాలి అన్ని విధాల నిన్ను మేము పెంచాలి అని అనుకున్నాను.

అందుకే మీ నాన్నగారి తో మాట్లాడి వెంటనే పల్లెకు పోదాం అంది వాడిని దగ్గరకు తీసుకుంటూ…..

Related Posts

1 Comment

Comments are closed.