జగములనేలే అమ్మ

అక్షర కొరకు
రచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక – జగములనేలే అమ్మ

జగములనేలే అమ్మ
జగన్మాత శక్తి స్వరూపిణి
రాక్షసులను అంతమెుందించే
ఆది పరాశక్తి  ఆ అమ్మ!

ఇంటిల్లి పాదిని ఆనందంతో
ఉంచే మధుర హాసిని అమ్మ
ఆ ఇంటి ఇల్లాలే తన లోగిలిని
అందంగా ఆనందంగా ఉంచేది!

ఆవనికి ఎంత ఓపిక ఉందో
ఆ అమ్మకు కూడా అంతే ఓపిక
పిల్లలందరూ తలా ఒకరకం
కానీ అమ్మకు వేయి చేతుల తీర్చే శక్తి!

ఇంట గెలిచి రచ్చ గెలిచే
మహిళామణి అమ్మనే
బయట ఉధ్యోగాలు చేస్తూ
ఇల్లు అనే రాజ్యానికి మాహారాణి!

ఇది నా స్వీయ రచన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *