జనం
జనంతోనే జీవితాలు ముడిపడివున్నవి
మనిషి జీవనయాత్ర రకరకాల మజిలీలతో సంపూర్తి
వివేకవంతుడు అనుభవాల నేపథ్యంలో గమ్యం చేరుతాడు
మూర్ఖుడు కఠినమైన పరీక్షలకు లోనై వైఫల్యం చెందుతాడు
జీవితం పూచిన వెన్నెల శ్రమైక్య విజ్ఞానికి
వీణను మీటితే సంగీత స్రవంతులు హృదయాన్ని మీటితే నవజీవన స్రవంతులు
జీవితంలో వెలుగుల జ్యోతులు జ్ఞాన తృష్ణ జ్వలిస్తుంటే
ప్రతి జీవితం పండువెన్నెల పూర్ణకుంభం జనచైతన్యోణ్ముఖునికి
జనజీవితాలు ఉజ్వల ప్రగతి పథంలో పయనించేది చైతన్య శ్రమలతోనే
మనిషికి మనిషికి మధ్య బంధం ఇరు హృదయాల అనుబంధంలొనే
నాయకుడు తన కార్యసాఫల్యతకు సామాజిక ప్రయోజనాలకు జనాన్ని కూడదీసుకుంటాడు
మనిషనేవాడు మన్వంతరాల నుండి మారుతూ రూపుదిద్దుకున్న సజీవ శిల్పం
మనిషి జఠిలమైన సమస్యలను కుశాగ్రబుద్దితోనే పరిష్కరించగలడు
విద్య విజ్ఞానం మనిషిని మరోప్రపంచం రూపసిగా నిలబెడుతుంది
అపరాజిత్
సూర్యాపేట