జాగ్రత్త పిల్లలూ…

శీర్షిక
జాగ్రత్త పిల్లలూ

ఇది నిజంగా జరిగిన కధ. రెండేళ్ల క్రితం దీపావళి ముందు
రోజు నా బాబాయిగారి అబ్బాయి( నా తమ్ముడు)
మా ఇంటికి వచ్చాడు. వచ్చేటప్పుడు మిఠాయిలు, టపాసులు తెచ్చాడు. అంతా
సంతోషంగా దీపావళి పండగ జరుపుకున్నాము. దీపావళి
రోజు సాయంత్రం నా పిల్లలు
తమ మితృలతో టపాసులు కాల్చుకుంటుండగా మా అబ్బాయి ఒక ప్రయోగం
చేసాడు. దీపావళి బాంబులలో
ఉండే పౌడర్ బయటకు తీసి దాన్ని ఒక కాగింతంపై పోసి
అగ్గిపుల్ల గీసి అంటించాడు.
అంతే అది వేగంగా మండిపోయింది. నా అబ్బాయి
అరచెయ్యి బాగా కాలిపోయింది. వాడికి చాలా
నెప్పి వేసింది. చర్మ మొత్తం
కాలటంతో చాలా ఇబ్బంది
పడ్డాడు. మా వాడు చిన్న
పిల్లవాడేమీ కాదు. ఇరవై
ఏళ్ళు దాటాయి. వాడి ప్రయోగం వల్ల చేతులు
కాల్చుకున్నాడు. రెండేళ్లు
అయినా ఇప్పటికీ చేతి
మీద కాలిన మచ్చలు
పోలేదు. అది వాడికి
ఒక గుణపాఠం. మాకు
కూడా కనువిప్పు. అందుకే
దీపావళి రోజు పిల్లలందరూ
జాగ్రత్తగా టపాసులు కాల్చుకోమని పిల్లలకు
సలహా ఇస్తున్నాను. చేతిలో పెట్టుకుని బాంబులు కాలవ
కూడదు. మతాబులు‌, చిచ్చు
బుడ్డులు మోహానికి దగ్గరగా
పెట్టి కాలవవద్దు. టపాసులు
కాల్చేటప్పుడు దగ్గరగా ఒక
బక్కెట్ నీళ్ళు దగ్గరగా
పెట్టుకోవాలి. సురక్షితంగా
దీపావళి జరుపుకోండి.
ఆనందంగా ఉండండి.
అందరికీ దీపావళి
శుభాకాంక్షలు.

ఈ రచన నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను.

వెంకట భానుప్రసాద్ చలసాని.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *