జాతకం

పెళ్లి వాళ్ళకు మన అమ్మాయి జాతకం సరిపోలేదని ఫోన్ చేసారు మరి ఇంకో సంబoదం చూడాలి ఇక అన్నారు సత్యం మాష్టారు భార్య సావిత్రితో ,అయ్యో అదేంటండి పిల్లని చూసాక, అన్ని మాట్లాడుకున్నాక జాతకం కలవలేదు అని అంటూ ఎదో ఒక మెలిక పెడుతున్నారు అని అందిసావిత్రి . ,అయ్యో పిచ్చి మొఖమా  అది జాతకం చాలక కాదే మనం ఇచ్చే కట్నం నచ్చక ,ఇదో వంక అన్నారు కుర్చీలో వాలిపోతూ.

బాగానే ఉంది కట్నం ఎల్లకాలం ఉంటుంద ?ఏమిటి? మనం ఇచ్చే కట్నంతోనే వాళ్ళు బతుకుతారా?, , అయినా అమ్మాయి కట్నం అంటే అది అలాగే ఉంచి ,ఎప్పుడో వాళ్ళకు పిల్లలు పుట్టాక అవసరం అయితే వాడుకోవాలి.  కానీ పిల్ల కట్నానికి ఆశ పడడం నేటి పిల్లలకు అలవాటు అయ్యింది. అందుకే ఆడ పిల్లలు దొరకక మగాళ్ళు  బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. అన్నికలిసిన తర్వాత కట్నం దగ్గర ఇలా అంటే మాత్రం ఆడపిల్లలు పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిదే అన్న ఆలోచనకు వచ్చి ,బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు .

అయినా పర్లేదు లెండి, వాళ్ళు కాకపోతే ఇంకొకరు ,అయినా అమ్మాయి  ఉద్యోగం చేస్తుంది, దాని బతుకు అది బతుకుతుందిలే అని అంటూ ,భర్తకు కాఫీ తేవడానికి లోపలికి వెళ్లిపోయింది..అవును భార్య చెప్పింది నిజమే కట్నం ఇవ్వకుండా పెళ్ళిళ్ళు కావాలనుకునే అమ్మాయిలు అందరూ ఇప్పుడు బాగా చదువుకుని జాబ్స్ చేస్తూ,వారికీ నచ్చిన విధంగా ఉంటున్నారు.అయిన తన ముగ్గురు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసాడు బాగానే కానీ ఇప్పుడు హర్షిత విషయం లోనే ఇలా జరుగుతుంది .

తను టీచర్ గా జాబు చేసి కట్టుకున్న ఇల్లు ఒక్కటే ఉంది అయినా మిగతా పిల్లలు ఇద్దరు వాళ్ళు ప్రేమించిన వారిని తీసుకుని వచ్చి తన ముందు నిలబెడతే,తను వాళ్ళ ఇష్టానికి విలువని ఇచ్చాడు ,అటూ వాళ్ళు తెచిన అబ్బాయిల తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో ఆటంకం లేకుండా వారి పెళ్ళిళ్ళు చేసాడు,ఒకే కులం వాళ్ళని చూసుకున్నారు.

తనకి కులాల పట్టింపు లేకపోయినా పెళ్లి జరిపించాడు సింపుల్గా    అయినా హర్షిత ఒక పట్టాన ఒప్పుకోలేదు పెళ్ళికి తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మిమల్ని ఎవరూ చూస్తారు అని అంటూ చాలా రోజులు పెళ్ళే వద్దని మొండికేసింది,ఎన్నో విధాలుగా నచ్చ చెప్పి,బుజ్జగించి,చివరికి బెదిరిస్తే అప్పుడు పెళ్ళికి ఒప్పుకుంది. చాలా రోజులు వెతికి ,వెతికితే ఒకే ఒక్క వరుణ్ణి ఒకే చేసింది.దానికే తల్లి oతోష పడి,జాతకాలన్నీ చూసాక అన్ని కుదిరాయి అని తెలిసాక ,పిల్లని కూడా వాళ్ళు వచ్చి చూసుకున్నారు,తను అయిదులక్షల్లో ఉన్నా అని చెప్పాడు ముందే . 

కానీ మాట వాళ్ళకు తెలిసాక జాతకం కుదరలేదు అని ఫోన్ లో చెప్పారు .ఆలోచనలో ఉన్న సత్యం మాస్టారు భార్య కాఫీ పెట్టి వెళ్ళడం కూడా గమనించలేదు సావిత్రి తిరిగి వచ్చి ,చూసి అయ్యో రామా ఇలా ఆలోచన చేస్తూ తిండి ,నిద్ర మానేస్తే ఎలా,అయినా కులం వాళ్ళే కావాలి అని అనుకుంటే ఇదిగో ఇలాగె ఉంటుంది,అది కూడా అక్కల లాగానే ఎవర్నో ఒకర్ని ప్రేమిస్తే బాగుండేదిఈ ప్రేమలు మంచివి కాకున్నా తల్లిదండ్రులుచూద్దామనుకున్న మధ్యతరగతి జీవితాల్లో కట్నాల జాతకాలు మారవు కద అని ఏమండి అని గట్టిగా పిలిచే సరికి తన ఆలోచనలోనుండి బయటకు వచ్చి,ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు.ప్రతి దానికి ఇలా బెంబేలు పడడం ఏంటో అని తనలో తనే గోణిగింది సావిత్రి.

విషయం తెలిసిన హర్షిత మాత్రం చాలా ఆనంద పడింది.ఎందుకు అంటే తల్లిదండ్రులను వదిలి వెళ్ళడం అంటే హర్షితకు ఇష్టం లేదు .అలా అని మొత్తానికి పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని కూడా లేదు,కానీ తనని పెళ్లి చేసుకునే వాడు తన తో పాటు తన తల్లిదండ్రులను కూడా ఒప్పుకుని ,ఇల్లరికం రావాలి అని అనుకునేది ,కానీ తల్లిదండ్రులు మాత్రం తనకు పెళ్లి చేయాలి అని అనుకుంటూ ఉంటె వారి బాధని చూడలేక ఒప్పుకుంది. 

ఇప్పుడు కట్నం దగ్గర ఇలా అయ్యేసరికి సంతోష పడింది.చాలా రోజుల నుండి హర్షితను గమనిస్తున్నాడు వికాస్,గమనించడం అని అనే  కంటే తనని చూడకుండా ఉండలేకపోతున్నాడు అనడం మంచిది.ఇంతకీ వికాస్ ఎవరూ అంటే సత్యం మాష్టారి ఇంటి పక్కనే ఉన్నా మూర్తి గారి పెద్ద అబ్బాయి ,అతను కుడా ఉపాద్యాయుడే ,ఇద్దరికీ ఒకే సారి ఉద్యోగాలు వచ్చాయి,ఇద్దరు ఒకే దగ్గర ఇల్లు కూడా కట్టుకున్నారు ,కాకపోతే ఎక్కువ పరిచయం లేదు ,హలో అంటే హలో ,ఎప్పుడైనా మాట్లాడుకున్నా బడి లోని సమస్యల గురించే మాట్లాడుకునే వాళ్ళు తప్ప,ఇంటి సమస్యల గురించి మాట్లాడుకునేంత దగ్గర కాలేక పోయారు .

వికాస్ మాత్రం హర్షితని చిన్నపాటి నుండి చూస్తూ పెరిగాడు,ఆమె మిద చిన్నప్పుడు ఏర్పడిన అభిమానం ప్రేమగా మరి అది పెరుగుతూ వచ్చింది తప్ప తరగలేదు.కానీ ప్రేమిస్తున్న అని చెప్తే తన మిద ఉన్న గౌరవం పోతుందేమో అని అనుమానపడుతూ ఉండే వాడు,తనకి పెళ్లి చూపులు అని తెలిసి బాధ పడ్డాడు, తర్వాత పెళ్లి కుదరలేదు అని తెలిసి సంతోష పడి ,ఇక తప్పని పరిస్థితిలో తనకు  దక్కకుండా పోతుందేమో అని భయ పడి ,తన తండ్రికి విషయం చెప్పి,తననే పెళ్లి చేసుకుంటాను అని ,సత్యం మాష్టారితో మాట్లాడమని చెప్పాడు .

ఒక్కగానొక్క కొడుకు ఇష్టపడిన పిల్లతో పెళ్లి చేయడానికి మూర్తి గారికి అబ్యతరం కనిపించలేదు,కానీ కులాలు వేరు మరి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో ,వాళ్ళు ఒప్పుకున్నా మిగతా అలుళ్ళ ముందు వారి పరువు పోతుందేమో అని భయపడిన మూర్తి గారికి భార్య లక్ష్మి దైర్యం చెప్పి,అడగడం లో తప్పు లేదు కదా అని పంపించింది.

హల్లో కుర్చుని చాగంటి గారి ప్రవచనాలు వింటున్న సత్యం మాష్టారు ఎవరో వచ్చిన అలికిడికి తల తిప్పి చూసారు,మూర్తి గారు లోనికి వస్తూ కనిపించారు. దాంతో సత్యం గారు రండి రండి మూర్తి గారు చాలా రోజులకు మా ఇంటికి రావాలనే తలంపు కలిగింది అంటూ ఆహ్వానించి,కూర్చున్న తర్వాత సావిత్రి  మూర్తి గారికి టీ అని అరిచి చెప్పారు భార్యకు.

ఇప్పుడేమి వద్దండి అంటున్న మూర్తి గారిని అయ్యో ఇంటికి వచ్చిన వారికీ మాత్రం ఇవ్వక పొతే ఎలా అని,ఉరక రారు మహానుభావులు ఏమిటో మాకు మీ దర్శనం ఇలా అయ్యింది అని అడిగారు. ఎదో పని మీదే వచ్చి ఉంటారు అని భావించి,దానికి మూర్తి గారు వరుస కలుపుతూ చెల్లెమ్మని కూడా రానివ్వండి అని అన్నారు ,అతని కొత్త పిలుపుకు ఆశ్చర్యంగా చూసి ,ఏమి అనలేదు సత్యం మాష్టారు.

ఇంతలో లోపలినుండి బాగున్నారా అన్నయ్య గారు అంటూ టీ తీసుకుని వచ్చిన సావిత్రి గారు ఇద్దరికీ ఇచ్చారు ,టీ తీసుకుని నువ్వు కూర్చోమ్మా మాట్లాడాలి అని అన్నారు మూర్తి గారు సరేనని కూర్చున్న సావిత్రి గారి ని చూస్తూ మూర్తి గారు,సత్యం గారు  నేను ఒక పని మిద వచ్చాను ,అది మీకు చెప్తే మీరు నన్ను తిట్టుకోకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని అన్నారు.

ఏంటో చెప్పండి అన్నయ్య గారు మన మధ్య దాపరికం ఏంటి అని అన్న సావిత్రి ని చూస్తూ.మీకు మా వికాస్ తెల్సు కదా,వాడు మీ హర్షితని ఇష్ట పడుతున్నాడు ,మీకు మీ అమ్మాయికి కూడా ఇష్టం అయితే మనం పెళ్లి గురించి మాట్లాడుకోవచ్చు,మీకు కులం అని ఏమైనా అబ్యంతరం ఉంటె మాత్రం ఇక్కడితో విషయాన్నీ వదిలేయండి, మనం స్నేహితుల్లా ఉందాం.

కానీ అడిగాము కదా అని మన స్నేహాన్ని వదులుకోవద్దు ,మీరు బాగా ఆలోచించండి ,మాకున్నది ఒక్కగానొక్క కొడుకు వాడు తప్ప మాకు ఎవరూ లేరు ,మాకు వాడి ఇష్టం ముఖ్యం ,మేము వాడి గురించి ఎలా అలోచిస్తామో మీరు మీ అమ్మాయి గురించి ఆలోచించండి ,అయితే మాకు కట్నాలు కానుకల మిద ఆశ లేదు ,మన పిల్లల సంతోషమే మనకు ముఖ్య ,ఇక మీ నిర్ణయం మీరు చెప్పండి. మీకు ఒక నాలుగు రోజులు ఆలోచించండి  అని చెప్పి,ఇక తన పని అయిపొయినట్టుగా  వేళ్ళడానికి  లేచాడు.

అంత పెద్ద బాంబు పేల్చి ,ఇప్పుడేమి తెలియకుండా వెళ్ళడానికి లేచిన మూర్తి గారిని చూసి సత్యం మాష్టారు షర్టు పట్టుకుని లాగి కూర్చో పెట్టి,ఏంటయ్యా నీ ఉద్దేశ్యం చెప్పేది చెప్పి మాకో పరీక్ష పెట్టి  వెళ్ళి పోదాం  అనుకుంటున్నావా ,సరే కానీ ఇందులో వచ్చే ఇబ్బందుల గురించి మాట్లాడవా అన్నారు.

సత్యం మాటలకూ నవ్వుతూ ఉన్న మూర్తి గారు అయ్యో అందులో వచ్చే ఇబ్బందులు ఏమున్నాయ ,మీ కూతుర్లు అల్లుళ్ళు ఒప్పుకోవాలి అంతే కదా మరి దానికో ఉపాయం ఆలోచించే నేను వచ్చా కానీ ,అది మీకు నచ్చుతుందో లేదో మరి అన్నారు ,అది కూడా చెప్పు నువ్వే అన్నాడు సత్యం మాష్టారు,వారి మాటల్ని బట్టి వారికీ వికాస్ అంటే ఇష్టమే అని అర్ధం అయ్యింది మూర్తి గారికి,కానీ అల్లుళ్ళు ఏమంటారో అని భయ పడుతూ ఉన్నారు.

మూర్తి గారు సత్యం మాష్టారుని చూస్తూ ,ఏమి లేదు బావ హర్షితకు పెళ్లి సంబంధం చుసాను కుదిరింద. కానీ కట్నం పది లక్షలు అడుగుతున్నారు కాబట్టి మీరు సహాయం చేయండి అని అడగoడి  మీ అల్లుళ్ళన.  అప్పుడు వాళ్ళెం అంటారో విని,హర్షిత తో తను వికాస్ ని  ప్రేమించిన అని చెప్పమనండి వాళ్ళు తేలిగ్గా ఒప్పుకుంటారు అని చెప్పాడు ,ఇదేదో బాగుంది కానీ హర్షిత దీనికి ఒప్పుకుంటుందా లేదా అనే సందేహం తో అలాగే చెప్తాము బావ.

అని మాట్లాడుకున్న తర్వాత మూర్తి గారు సంతోష మైన వార్తని కొడుక్కు చెప్పడానికి వెళ్ళారు.సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన హర్షత తో సావిత్రి గారు,సత్యం గారు ప్రొద్దున మూర్తి గారు వచ్చి వెళ్ళిన విషయం మొత్తం చెప్పారు ,వికాస్ ని పెళ్లి చేసుకోవడానికి హర్షితకు ఏమి ఇబ్బంది కానీ అబ్యంతరం కానీ కనిపించలేదు ,పైగా పక్క ఇల్లే తల్లిదండ్రులను చూసుకోవచ్చు,వారికీ కష్టం వస్తే తాను దగ్గర ఉండొచ్చు అని అనుకుని ఇదే విషయాన్నీ వికాస్ తో మాట్లాడాలి అని అనుకుంది.

అనుకున్నట్టుగానే వికాస్ తో మాట్లాడింది ,అతని మనసులో తానంటే ఉన్న ప్రేమ ,అభిమానం ఆప్యాయత అన్ని తెలుసుకుని ఇన్ని రోజులు అతన్ని గుర్తించ నందుకు  తనని తానే నిందించుకుంది. ఆమె ఒప్పుకోవడం తో వికాస్ కూడా చాలా ఆనంద పడి,ఆమె పెట్టిన అన్ని షరతులకి ఒప్పుకున్నాడు.అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత హర్షితకు కూడా అదే సమస్య అంటే ఇద్దరు అక్కలు, బావ లు ఒప్పుకుంటారా లేదా అనే oదేహం వచ్చింది,అదే విషయాన్నీ తల్లిదండ్రులతో చెప్పింద.,అయితే దానికి వాళ్ళు వేసిన ప్లాన్ కూడా చెప్పారు తల్లిదండ్రులు ,మూర్తి గారు,ఇక బావలకు చెప్పడం ఒక్కటే మిగిలి ఉంది.

మర్నాడు ఆదివారం కాబట్టి అల్లుళ్ళని,కుతుర్లని పిలిపించారు  సత్యం మాష్టారు. వాళ్ళంతా ఒక రోజు తిండి ఖర్చు కలిసి  వస్తుంది అని వచ్చారు,ఆదివారం అందరూ బోజనాలు చేసి ,కూర్చున్న తర్వాత బాంబు పేల్చారు సత్యం మాష్టారు,తన కూతురి పెళ్ళికి మీరు అంటే అల్లుళ్ళు సహాయం చెయ్యాలని ,తనకు కొడుకులు లేరు కాబట్టి మిరే ముందుకు రావాలి అని,అల్లుడైనా ,కొడుకు అయినా మిరే కాబట్టి మిరే సహాయం చెయ్యాలని కోరారు.వీళ్ళు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్నా ఎక్కడో కట్నం రాలేదు అనే బాధ వారికీ ఉంది.అయినా సత్యం మాష్టారు అన్ని ఘనoగానే జరిపించినా ఎక్కడో బాధ వారికీ, దాంతో చిన్న పండగ వచ్చినా వాలి పోతారు మామా మిద.విషయం వినగానే వారికీ కోపం వచ్చేసింది,మరి డబ్బు ఎవరూ పెడతారు ఈరోజుల్లో …..

దానికి అల్లుళ్ళు ఒక్కసారిగా కోపానికి వచ్చి మాకేం అవసరం ఎదో మేము చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళేవాళ్ళం,మాకు సంబoదం లేదు,మీరేమైనా చేసుకోండి,మా భాద్యతలు మాకు ఉన్నాయంటూ అరిచేసరికి హర్షిత మధ్యలో వచ్చి ,నా పెళ్ళికి ఎవరి సహాయం అవసరం లేదు నా పెళ్లి నేను చేసుకుంటా ,మన పక్కన ఉన్న మూర్తి అంకుల్ కొడుకుని ప్రేమించినా  మీకు ఇష్టం అయితే అతన్నే పెళ్లి చేసుకుంటా అని అంది ,దానికి సత్యం గారు అతను మన కులం కాదు .

పెళ్లి జరగదు,బావ పరువుపోతుంది అని అన్నారు అల్లుళ్ళని చూస్తూ..,దానికి అల్లుళ్ళు మా పరువు కంటే వారి ప్రేమ ముఖ్యం ,పాపం ప్రేమించుకున్నాము అని అంటుంటే కాస్త పెళ్లి చేయండి ,పైగా కట్నం ఇచ్చే బాధ తప్పుతుంది అని హర్షితను సమర్ధిస్తూ ఎక్కడ డబ్బు ఇవ్వవలసి వస్తుందో అని ,కానీ బాబు అతనిది మన కులం కాదు మన బంధువుల్లో ,ముఖ్యంగా మీ వాళ్ళలో పరువు పోతుంది అని అనగానే పరువు ఏముంది మేమే ఒప్పుకున్నాం కదా మీరు కాదు అంటే మేమే దగ్గర ఉండి పెళ్లి చేస్తాం అని ముందుకు వచ్చారు.దాంతో మనసులోనే నవ్వుకున్న సత్యంగారు ఒప్పుకుంటున్నట్టుగా నటించారు.

వారం రోజుల్లో మంచి ముహూర్తం చూసి హర్షితకు ,వికాస్ కూ పెళ్లి జరిపించారు బావలు దగ్గర ఉండి మరి వికాస్  ని కూడా బాగా చూసుకున్నారు ,కట్నం తీసుకోలేదు అని గొప్ప మర్యాద కూడా ఇచ్చారు. రాత్రి మొదటి రాత్రి తెల్ల చీరలో అప్సరస లా తయారయ్యి,గదిలోకి వచ్చిన హర్షితను చూస్తూ వికాస్ అబ్బా ఏమి అందం హరి నిన్ను ఇన్నేళ్ళుగా ప్రేమించినా నీకు చెప్పలేకపోయాను,నిన్ను నా దాన్ని చేసుకుంటా అని కలలో కూడా అనుకోలేదు,నా ప్రేమ నిజం కాబట్టి నువ్వు నా సొంతం అయ్యావు ,లేకపోతె పెళ్లి వరకు వచ్చాక జాతకం బాగా లేదని వాళ్ళు వద్దు అనుకోవడం ఏంటి,నా జాతకం బాగుంది కాబట్టే నువ్వే నా సొంతం అయ్యావు అని అన్నాడు ఆమెని హత్తుకుంటూ,మీ లాంటి మంచి వాడిని దగ్గరే పెట్టుకుని గుర్తించ లేక పోయాను ,కానీ మీరు నాకు దొరకడం నా అదృష్టం నా జాతకం బాగుంది కాబట్టే మీరు నాకు దొరికారు అంది హర్షిత. 

ఇద్దరి జాతకాలూ బాగానే ఉన్నాయి కానీ,అలా జాతకాలా గురించి మాట్లాడుతూ తొలి రాత్రిని వృధా చేయకండి ,దాన్ని సార్ధకం చెయ్యండి అని అంటున్న అక్కలను చూసి సిగ్గుపడి  వికాస్ ఎదలో తల దాచుకుంది హర్షి,,అది చూసి నవ్వుతూ వెళ్ళిపోయారు అక్కలు,వికాస్ హర్షితను తన గుండెల్లో పోదుపుకున్నాడు….

Related Posts