"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

జీవం..

అంశం:జీవం

జీవశ్చవం.

ఆశల కొలిమిలో కొట్టు
మిట్టాడుతున్నప్పుడు
అన్నీ ఉండి ఏమీ లేనట్టు
బతకడం ఒక జీవచ్ఛవంలా

జీవం ఉన్న శవం కింద లెక్క
మనిషికి మనసు ఒక శాపం
బంధాలు బాంధవ్యాలు ముంచే
తేనె తుట్టలు, మురిపించ

అందలం ఎక్కించు హాయిగా
బాధని అందని లోతులలో
పూడుస్తాయి బ్రతుకు
జీవచ్ఛవంలా కాక మరేమిటి,
మనసులో శృతి లేక మోమున
కాంతులు విరియసౌకర్యం
ఎక్కడ, ఇది జీవితం
అబద్ధపు లయల, శృతి లేని

గీతాల మతితప్పే పాటలు
పాడుతూ జీవచ్ఛవంలా
గడపడమే మనిషి బ్రతుకు

ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను
…..కె.కె.తాయారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *