జీవనయానం,,,,,,,!
ఈ ఆనంతకోటి విశ్వం సృజియించిన గీతానివి నీవు
జీవితంలో అలసి సొలసి వడలిపోయిన శరీరాన్ని మోస్తో,,,,,,,
పాలిపోయిన మసక మబ్బుల గుహ నీ జ్ఞాపకాల దొంతరల మనఃఫలకం,,,,,,,,
రివ్వున ఎగిరే గబ్బిలాలు విషాద ప్రాశ్చాత్య సంగీతంలా రొదపెడుతున్నాయ్,,,,,,,,,
అనుబంధాలు ఆప్యాయతలు క్షణక్షణం తుమ్మచెట్టు ముళ్ళు గుచ్చుకుంటున్నట్లు మనస్సు నిప్పుల కుంపటి,,,,,,,,,,
ఈ సువిశాల విశ్వం నిన్ను రా రమ్మంటూ చేతులు చాస్తోంది మానవ ధూళికి పొగబారి రంగు వెలిసిన గగనం అంచుల దాకా,,,,,,,,
జీవిత అనుభవాలు కనుపాపల్లో సుడులు సుడులుగా తిరుగుతూ మనస్సు పొద నిండా నల్ల గులాబీలు విచ్చుకున్నాయ్,,,,,,,
ఈ జీవిత చరమాంకంలో ఏదో తెలియని దిగులు దిగాలుగా ఈ బ్రతుకుపై ఏదో తెలీని ప్రీతి,,,,,,,,
స్మశాన వైరాగ్యంలో మనస్సు కొట్టుమిట్టాడుతూ మోడ్రన్ చిత్రకారుడు ఆఖరి క్షణాలలో చిత్రించినట్లు మనస్సు పొరల్లో దాగున్న రహస్యాలు సుందర నదీ తీరాలు నిఘోడ స్వప్నాలు సుషుప్తిలోకి జారుకుంటుంటుంటే ఊతకర్ర ఆసరాతో దారివెంట నడుస్తూ వెళుతున్న జీవనయానం,,,,,,,,!!
అపరాజిత్