"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

జీవితం లో ఎన్నో ఒడిదుడుకులు

జీవితం లో ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి పోతుంటాయి .

హయిగా సాగిపోతున్న జీవితంలో హటాత్తుగా ఏదైనా ప్రమాదమో లేదా ఇంకేదైనా సంఘటనో జరగవచ్చు ,
అప్పుడు ఏమి చేయాలో ఎవరికీ మన బాధ చెప్పుకోవాలో తెలియక పోవచ్చు , చెప్పినా ఎదుటి వారు అర్ధం చేసుకోక పోవచ్చు,అర్ధం చేసుకున్న కూడా మన బాధను మాత్రం
వారు తీర్చలేక పోవచ్చు అయినా ఎన్నాళ్ళు అని బాధను మోస్తూ అనుభవిస్తూ అదే తలచుకుంటూ బ్రతుకుతూ చస్తూ ఉండలేం కదా , కలం కలంతో పాటూ మనం కూడా
ముందుకు జీవితం లో వెళ్ళాల్సిందే కాబట్టి ఈ విషయాన్నీ మనం ఆకళింపు చేసుకోగలగాలి , అప్పుడే మనకు మనమే ధైర్యం చెప్పుకోవడమే కాకుండా మరొకరికి కూడా ధైర్యం చెప్పే స్థితికి వస్తాం
మనల్ని నమ్ముకుని మన కుటుంబం లేదా మన భార్యాపిల్లలు ఇంకెవరో ఉండవచ్చు మనమే ధైర్యాన్ని కోల్పోతే మరి మనవారికి ధైర్యాన్ని ఎవరిస్తారు అనే ఆలోచనతో ఉంటూ మన పని మనం
చేసుకోవాలి మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి, ఏదైనా జరిగినప్పుడు ఆ జరిగిన సంఘటన మనకెన్నో నేర్పిస్తుంది మనలో ఎదో ఒక తెగింపు వస్తుంది. అలాంటి వాడే అజయ్, అజయ్ చిన్నప్పటి
నుండి అన్నిట్లో చాలా చురుకుగా ఉంటూ తల్లిదండ్రులకు ఎంతో పేరు తెచ్చిపెట్టాడు చిన్నతనంలోనే, ఆ తల్లిదండ్రులు తమ కొడుకు ప్రతిభ చూసి చాలా సంతోషించారు అలంటి కొడుకు తమ కడుపున
పుట్టినందుకు ఎంతో ఆనందపడి కొడుకు బాగు కోసం గుడికి వెళ్ళి అర్చనలు కూడా చేసారు ఎంతో అందంగా సాగిపోతున్న ఆ సమయంలో అజయ్ కి ముంబైలో ఉద్యోగం వచ్చిందనే సంతోషం తో పాటూ తల్లిదండ్రులకు
దూరంగా వెళ్తున్నా అనే బాధున్నా తల్లిదండ్రులు సర్ది చెప్పి పంపించారు. అలా అజయ్ ఉద్యోగంలో చేరాడు, కొన్ని రోజుల్లోనే కంపెని లో అతను తన ప్రతిభను చూపించి అత్యుత్తమ స్థాయికి వెళ్ళగలిగాడు. అందరూ సంతోషించారు, ఆ ఆనందం లో పార్టీ చేసుకున్నారు అజయ్ కి ఎలాంటి దురలవాట్లు లేవు. అలా పార్టీ చేసుకుంటున్న సమయంలో చాలా సంతోషం లో ఉన్న అజయ్ అలా హటాత్తుగా పడిపోయాడు, పార్టీ లో అలా పడిపోయిన అజయ్ ని చూసి అందరూ వెంటనే హాస్పెటల్ కి తీసుకుని వెళ్ళారు. ఇటు తల్లిదండ్రులకు కబురు పెట్టారు, వాళ్ళు ఆఘమేఘాలపై వచ్చారు తమ కొడుక్కు ఏమైందో అనే ఆత్రంలో,అజయ్ ని అంతా పరిశీలించిన డాక్టర్లు ఎక్కువ సంతోషం తో అతని మాట పడిపోయింది తప్ప మిగతా అంతా బాగానే ఉందని రెండు రోజుల తర్వాత చెప్పారు. మాట పడిపోయింది అనే సరికి మాట్లాడకపోతే ఉద్యోగంలో కొనసాగడం కష్టం కాబట్టి తాము అజయ్ ని ఉద్యోగంలోంచి తీసి వేస్తున్నామని యాజమాన్యం చెప్పింది, మరి అజయ్ మాటలతోనే అత్యుత్తమ స్థాయికి ఎదగ గలిగాడు. విషయం విన్న తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు ,ఇక అజయ్ చాలా బాధపడ్డాడు కొన్నాళ్ళకి ఇంటికి తీసుకుని వచ్చారు అజయ్ ని కని అజయ్ బాధతో కొంత క్రుంగి పోయాడు తన అవిటి తనానికి ,చుట్టుప్ప్రక్కల ఉన్నవారి ఓదార్పు మాటలకు కాంత్ క్రుంగి పోయాడు , కాని తర్వాత కొంత కాలానికి తనను తానూ సమాధాన పరచుకున్నాడు. తన గురించి బాధ పడుతున్న తల్లిదండ్రులకు ఓదార్పు చెప్పాడు సైగలతో,అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది, తానూ అనవసరంగా క్రుంగి పోతున్నాను అని, తనలాంటి వారు ప్రపంచంలో అనేమంది ఉండి ఉంటారు అనే ఆలోచన తో మాటలు రాణి తనలాంటి వారికి తను చదువుకున్న చదువును నేర్పాలని అనుకున్నాడు ,అనుకున్నదే తడవుగా దానికి సంభందించిన ఏర్పాట్లు చేయమని తండ్రికి చెప్పాడు, తండ్రి కూడా అజయ్ ఆలోచన బాగుంది అని అన్ని సమకూర్చాడు, ఒక బోర్డు, చాక్ పిసులు, కెమెరా,స్థాండ్ ఇలా అన్ని సమకూర్చి పెట్టాడు. ఇక అజయ్ తనకు వచ్చిన చదువును సైగలతో వివరిస్తూ , బోర్డ్ పై రాస్తూ విడియో తీసి కొన్ని టీవీ లకు పంపాడు. అది చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇలా సైగలతో చదువు నేర్పడం, వివరించడం వారికి ఎంతో ఉపయోగ పడేలా అనిపించింది, వినికిడి శబ్దం లేని వారికీ,మాటలు రని వారికీ ఇదెంతో ఉపయోగ పడుతుంది అని అనుకుని వెంటనే అజయ్ ఇంటికి వెళ్ళారు, ఇదెలా సాధ్యం అయ్యిందంటు అజయ్ ని అడిగితే తండ్రి ఉన్న విషయాన్నీ అంతా చెప్పుకొచ్చాడు ,దాంతో అజయ్ ఇంటర్యు తీసుకున్న వాళ్ళు పేపర్లలో రాశారు,టీవీ ల్లో చెప్పారు , ఒక టీవీ వాళ్ళు అయితే తమ ఛానెల్లో న్యూస్ చెప్పడానికి అతన్ని అపాయింట్ చేసుకున్నారు, ఇక అజయ్ కి తిరుగులేక పోయింది. అలా మొట్ట మొదటి బధిరుల వార్తలు చదివే వ్యక్తిగా అజయ్ చరిత్రలో తన పేరును తానే రాసుకున్నాడు.
అందుకే యది జరిగినా మన మంచికే ఏదైనా ప్రమాదం లేదా అనుకోని సంఘటనలు జరగగానే క్రుంగి పోకుండా తమకు తామే ధైర్యం చెప్పుకోవాలి, తర్వాత తాము ఎలా పది మందికి ఉపయోగపదతామో ఆలోచించాలి, తమ బ్రతుకు తెరువును తామే చూసుకోవాలి , ఇదంతా చెప్పడానికి ,రాయడానికి బాగానే ఉంటుంది కాని ఆచరణలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి, కొన్ని ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు కూడా దానికి కూడా క్రుంగి పోకుండా మనకంటూ ఒక పేజిని చరిత్రలో రాసుకోవడానికి వీలైనంత వరకు కృషి చేస్తూనే ఉండాలి, మనం జన్మించ దానికి ఎదో ఒక కారణం ఉండే ఉంటుంది . కాబట్టి అదేంటో గ్రహిస్తే చాలు, మనం చేయాలనుకున్నది ఎవరూ ఆపలేరు, అందుకు ముందు నీపై నీకు నమ్మకం,తపన ఉండగలగాలి. తపన,నమ్మకం ఉంటె చాలు మనమే మన చేతులతో చరిత్ర లో ఒక పేజి ని లిఖించవచ్చు.

ఒక ఉదాహరణగా చెప్పగలిగితే అలా జన్మించిందే మన అక్షరలిపి, ఎన్నో అవాంతరాలు , ఎంతో కృషి,తపన తో ఒక భాష ను కాపాడాలి, ముందు తరాలకు మనమేంటో , మన పేరు ఏంటో తెలియాలి అనే ఉద్దేశ్యం తోనే మన అక్షర లిపి స్థాపించడం జరిగింది, భవ్య అంటే ఎవరికీ తెలియకపోవచ్చు, కాని గూగుల్ లో ఎవరైనా ఆ పేరుతొ సెర్చ్ చేసినా, లేదా భ అనే అక్షరం కొట్టినా వెంటనే నా కథలు వస్తాయి. మిరే ఒకసారి సెర్చ్ చేసి చూడండి, మీ పేరు కూడా చూసుకోండి అప్పుడు మీకు తెలుస్తుంది భవ్య లేదా అక్షర అని కొట్టినా వెంటనే వస్తుంది. అయితే ఇప్పటికే ఇది ఆగిపోదు మన ముందు తారలు ఇంకా సాంకేతికత వాడుకుంటాయి కాబట్టి వారికి కూడా మన అక్షరలిపి గురించి మన గురించి మన రాతల గురించి తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన పూర్వీకులు రాసిన తాళపత్రాల గురించి మనం వెతుకుతూ కరోనాకాలంలో మందును ఆయుర్వేద చికామణిలో ఉందని గుర్తించి తీసుకున్నాం దాంతో మన సైంటిస్టులు వ్యాక్సిన్ ను కనిపెట్టారు ఇది ఒక ఉదాహరణ తీసుకుంటే మన అక్షరాలు కూడా ఒక తాళపత్ర గ్రంథం అవ్వచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు రచనలు చేస్తూ మీ పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ రెండు ఉదాహరణలు మీ కళ్ళముందే కనిపిస్తున్నాయి కాబట్టి ఇక ఆలోచించకుండా రాయడం మొదలు పెట్టండి చరిత్రలో మీకు ఒక పేజీని స్వయంగా మీరే రాసుకోండి ఎవరి కథను రాయాల్సిన అవసరం లేదు మీ కథను మీరే రాసుకోవచ్చు మీ కథ ఒకరికి కనువిప్పు కలిగేదిగా లేదా జ్ఞానం కలిగేదిగా లేదా ఒక పాఠాన్ని నేర్పేదిగా ఉంటుంది. ఇక ఇంతటితో కథ ముగిస్తూ అందరూ రాసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ
మీ భవ్యచారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *