తొలి అడుగులు (కవిత)

జీవితం

జీవితం

ఎవరేమన్నా అనుకోనీ
నీ దారి నువ్వెంచుకో..
నీలో ఉన్న ఆత్మవిశ్వాసం
నీకు తెలుసు!

నీలో ఉన్న గొప్పతనం
నీకు తెలుసు ఇతరులకు
ఎలా తెలుస్తుంది? నీ ధైర్యమే
నిన్ను నడుపుతుంది!

సమాజాన్ని చూసి భయపడకు
అది నువ్వు బాగుంటే ఓర్వలేదు
నువ్వు చెడిరోతే నవ్వుతుంది
కాబట్టి పట్టించుకోకు!

నీ దారి నువ్వెంచుకో
నీ దారికి అడ్డుపడే వాల్లెందరో
అందరినీ తోసేయ్! పక్కకు
తోసేయ్! నీ దారి నువ్వెంచుకో!

నీ దారి సుగమం అయ్యైక
నీకే హారతులు పడతారు ఈ
జనం! నిన్ను పొగుడుతూనే
ఉంటారు! అది తెలుసుకో!

ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *