జీవితం
ఇట్లాగే ఉంటదని
ఇట్లాగే ఉండాలని
ఆంక్షల గీతలు గీసి
వాటి మద్యే నడవాలని
కట్టుబాట్ల సంద్రపు తీరాల
చుట్టూతే ఈదాలని
చెప్పినోడి జీవితం
మరి అట్టాగే ఉంటదా?
ఈ సమాజమే
అర్దాల్లేని పదాల మధ్య
ఆధిపత్య అర్దాలను
అంటగట్టి నడుస్తుంది
అనుమానాలు
అవమానాలతో
బద్నాం చేస్తోంది
నమ్మకాల గాలికొదిలి
అవసరాల కొరకే
నచ్చినంతసేపే
నచ్చినట్టుగా ఉంటది
పరిచయానికి
పరమార్థం మరిచిపోతుంటది
స్వార్థపు విషమెక్కిస్తుంటది
మరేదీ జీవితం
నీకు నచ్చిందా?
నాకు నచ్చిందా?
నలుగురు మెచ్చిందా?
నీ జ్ఞానపు స్వేచ్ఛే
నీ జీవితం
నీ శాస్త్రీయ ఆలోచనల
సమాహారమే జీవితం
నీ ప్రగతిశీల ఆచరణే
నీ జీవితం
– అమృతరాజ్
Chala bagundhi raj garu 🙏
Super raj garu bagundi