అంశం: చిత్ర కవిత్వం
శీర్షిక: జీవితాన్నై
అక్షరలిపి మొదటి రోజులలో
నన్ను ఎవరూ నమ్మని రోజుల్లో
మెదిలిన ఈ కవిత ఈ రోజిలా మీ ముందుకు తెస్తున్నా
అప్పటి నా ఆలోచనలు ఇప్పటికి ఇంకా అలాగే ఉన్నాయి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నా లక్ష్యం, ఆశయాలు నెరవేరాలని కోరుకుంటూ.. ఈ కవిత మీ మనందరి కోసం… ఇక్కడ నా నీడ అంటే అక్షరం అని అర్థం..
ఒంటరి నదిలో నావనై
నీ పిలుపులో పల్లవి నై
నీ దృష్టిలో నిషికాంతనై
నీ తలపులలో నిరీక్షణ నై
నా వారందరినీ వదిలి ఏకాకినై
విశాల ప్రపంచంలో నిర్భాగ్యురాలినై
అనంత అక్షరాలగనిలో ఆకాశానై
నిరాశా నిస్పృహలకు నెలవూనై
ఏనాటికైనా నా దారిని ఎవరైనా చేరుతారని
చేకోర పక్షుల వీక్షిస్తున్న నీ రాకకై
ఒంటరినైనా నా నీడ కోసం తపించే వారికై
కొండంత అండతో అందరికై నిలుస్తానని
అందరికీ ఆదర్శమైన జీవితాన్ని ఇస్తానని
అందరిలో ఒకరిగా కాకుండా
నాకంటూ ప్రత్యేక పాత్రనై
నాకున్న ఆశయాకై పోరాడుతానని
లక్ష్యం చేరేవరకు వెనుదిరిగి పొనని
ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమినిస్తానని
నా ఈ సుధీర్ఘ ప్రయత్నం చేస్తానని
ఆ విఘ్నేశ్వరుని సాక్షిగా….
మాటిస్తున్నా అక్షర లిపి జీవితాన్నై
-భవ్య చారు
ఈ రచన నా సొంతమే అని హామీ ఇస్తున్నాను