జీవిత నాటకం
నన్ను నిలువునా చీల్చి
ఖండ ఖండాలు చేసేందుకు
శత్రువు భీభత్స పన్నాగం !
ఉరితాడు నన్ను కబళించేందుకు కుట్రలు కుతంత్రాలు
అయినవాళ్ళు కానివాళ్ళు అంటూ తేడా ఏమీలేదు
నిద్రలేమి ఎప్పుడు మింగేస్తుందో తెలీదు
ఈ పక్షులు జంతువులే నాకు దారి చూపించే నేస్తాలు
మానవత్వం లేని ఖరీదు మనుష్యులకు బహుదూరం
ఈ హృదయంలో సుగంధాల పరిమళాలు
ఆత్మీయత అనురాగాలు ప్రేమలు!!
కన్నీటియెద నిండా అవమానాల హేళణల పెను గాయాలు
మూగ మనస్సు అగ్గి వ్రణాలలో కారం జల్లే వికృత లోకం నైజం!!
ఈ జీవన్నాటకం అంతం పలికేందుకు కణకణ మండే సూరీడు సాక్షిగా
విషపు అగ్గిరవ్వల మాటలతో హృదయంలో తూట్లు పొడుస్తూ వెకిలి నవ్వులు,,,,,,
మనస్సు గింగిరాలు తిరుగుతూ అలవికాని ఆవేదనలు
నాకై నేను తమాయించుకున్నా
ఏ క్షణంలో ఏమి జరుగుతుందో నని వీడని దుఃఖం
పగబట్టి పగలబడి నవ్వే జనం
వీడికి ఇలాగే కావాలి అంటూ నయవంచన
ఇన్నేళ్ళు భారమయంగా కొనసాగిన జీవితం
ఒకేసారి వెలుగు ద్వారాలు తెరుచుకుంటే
ఓర్వలేని జనం నా జీవితంపై రాళ్ళు విసురుతూ వికృతానందం
ఎన్నెన్ని గాయాలు వ్రణాల మయమయితేనేం
నా హృదయం చేతుల్లో పట్టుకుని
అక్షరాల పువ్వులు పూయిస్తూ
లక్షల అవలక్షణాలను తోసుకుంటూ
ముందుకు సాగే మౌన వెన్నెలలు అక్షరాలతో పూయిస్తూ
నీ మనోవికారాలను తూడ్చివేసే వైద్యుడను
నేను నీ నిప్పుల కళ్ళల్లో చల్లని పన్నీళ్ళు చిలికించే బహుదూరపు బాటసారిని
ఊరికే అలా నవ్వితే అవి నాకు పువ్వులౌతాయ్ సుమా అక్షరాలతో,,,,,,,!!
అపరాజిత్