జ్యోతిర్మయం కొత్తకాపురం
చీకట్లను చీల్చే కాంతులుచిందే ఆశాజ్యోతి నవవధువు నూతన గృహప్రవేశం,,,,,
నుదుట తిలకం దిద్దుకుని మేలిముసుగు ధరించిన మురిపాల కొత్త ఇల్లాలు,,,,,,
తమ కొత్త కాపురం ఆశల హరివిల్లు విరిసే ఆనందాలతో శోభాయమానం కావాలని దీపారాధన చేస్తున్న ముగ్దమనోహరి,,,,
ఆ చంద్రుడు అచ్చెరువొందే మోముతో కొత్త కాపురంలోకి అడుగిడుతూ,,,,,
ఆ దీపకాంతుల కిరణాలలో అగుపించే దివ్య దైవస్వరూపిణి,,,,,
రెక్కలు తొడిగిన ఆశలతో మగని హృదయం కొల్లగొట్టి కాపురం సుఖమయం చేసుకోవాలని దీపారాధనతో దివ్యమంగళ రూపిణి సుఖశాంతుల సౌభాగ్యవతి,,,,,
నీ ఆశలు అరవిరిసిన గులాబీ ఘుమఘుమలలో గృహం దేదీప్యమానం జ్యోతి ప్రజ్వలనలో,,,,,
తల్లిదండ్రులను,తోబుట్టువులను వదలి అత్తారింటి గృహప్రవేశం చేసిన నూతన వధువు కలలు కళాఖండాలు,,,,,,
మగని హృదయంలో కొలువైవుండే సుందరి సుశోభిత ప్రేమ భాష్యాలు దీపంజ్యోతులు,,,,
నీ కాపురం పాలవెళ్ళి తరగలలో రమ్యమైన రంగవల్లి కావాలని ఆశించి దీవించే అత్తమామల అదృష్ట దేవతవు,,,,
అపరాజిత్
సూర్యాపేట