జ్యోతిర్మయం జ్ఞానం
దీపంజ్యోతి కిరణాల వెలుగులలో
మది ప్రజ్వలనాలు అక్షరాల జ్వాలలు
తిమిరాలను చీల్చుకుని
దీపశిఖలో దివ్య తేజస్సు
అక్షరజ్యోతి కిరణాల పసిడి పూవులు విజ్ఞాన గనులు
అక్షరాలు కాంతులు వెదజళ్ళుతూ
మూఢ మనస్కులలో నిఘోడంగా
రగిలే ఆత్మపరిశీలనలు
ఈ జ్ఞానజ్యోతి హృదయం వికసించేను
పుస్తక పఠనం, లిఖించే జ్ఞాన ప్రకాశినులు
జీవితంలో నూతన అధ్యాయం
ఆత్మగూడులో చైతన్య ప్రజ్వలనలు
ఉప్పొంగే మెరుపుల అలలు అక్షర సంద్రంలో
వికసించిన పూవులు విజ్ఞాన జ్యోతులు
కారుచీకట్లలో సృజనలు జ్ఞానగ్రాహ్యాలు
ఆర్ద్ర ఉదయినులు అక్షరీకరణంలో
అక్షరోద్యమంతో తెరిపించే చీకటి మనస్సు పొరలు
అజ్ఞానాంతకములు దేదీప్యమానం స్వప్నాల తేజస్సులు
అద్భుత ప్రతిభలు లిఖించే జ్ఞానప్రభలు
హృదయం గుహలో యశో విజ్ఞానజ్యోతి
గమ్యం చేర్చును జీవితప్రస్థానం
ఒకో అక్షరం ఒకో దివ్వె ఒకో దివ్యగ్రంథం
లిఖించే అక్షరాల జ్యోతి క్రింద శతకోటి సంపుటాలు
కావ్యఖండాల నిండా తేజస్సులు అక్షర సత్యాలు
ఉత్తుంగ తరంగాలు జ్ఞానజ్యోతి క్రింద పఠనలు ,రచనలు కిరణాల వెలుగులలో సాలోచనలు
దీపంజ్యోతి కిరణాలలో ఆత్మపరిశీలనలు ఆత్మజ్యోతి తంత్రులు జగత్తు నిండా తేజరిల్లే మౌని జ్ఞానవిప్లవాలు,,,,,,
కళ్ళు వెలుగు వసంతాలలో జీవనయానం కొనసాగుతూ దివ్యగ్రంథాల ఆవిష్కరణలు ఆత్మతత్వం లోతుల్లోని తేజస్సులు పసిడిపూవులు అక్షరాలు జ్ఞానజ్యోతి వాడికిరణాలు,,,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట