టిట్ ఫర్ టాట్ A Good Eye-Opening Story1

టిట్ ఫర్ టాట్

టిట్ ఫర్ టాట్
టిట్ ఫర్ టాట్

లిఫ్ట్ లో నలుగురు ఎక్కారు ఆఫీస్కు సమయం కావడంతో వెళ్లక తప్పలేదు హిమజకి అసలు ఇలా అందరితో పాటు వెళ్ళడం ఇష్టం లేదు, కానీ తప్పదు. ఆఫీసుకు ఇప్పటికే రెండు లేట్ మార్కులు పడ్డాయి. దాంతో తనకు ఇష్టం లేకపోయినా డబ్బు కట్ అవుతుంది అని భయం వల్ల ఇప్పుడు ఇలా వెళ్ళాల్సి వచ్చింది.

కారణం ఏంటంటే, అందులో సురేష్ ఉండడమే. అతను తమ కుటుంబానికి భర్త తరపునుండి బంధువులు అవుతారు. తాను అన్నయ్య అని పిలుస్తుంది. మొదట్లో అతను చాలా మర్యాదగా ఉండేవాడు మర్యాదగానే మాట్లాడేవాడు. చెల్లెమ్మా అని అనుకున్నా మీరు అంటూ బాగానే ఉండేవాడు.

కానీ, అతను ఎంత దాచుకుందాం అని అనుకున్నా అతని నిజ స్వరూపం కొన్ని రోజుల్లోనే బయట పడిపోయింది. ఎదురుగా ఉండటం వల్ల తరచూ ఇంటికి రాకపోకలు సాగించేవారు అలాంటి సమయంలోనే అతని వికృతచేష్టలు బయట పడ్డాయి.

అతను కావాలని హిమజని తాకడం, బట్టలు మార్చుకునేటప్పుడు చూడటం, కావాలనే ఎదురుగా వచ్చి ఢీకొట్టడం వంటివి చేయడం మొదలు పెట్టాడు. మొదట్లో హిమజ అనుకోకుండా జరిగాయని అనుకుంది. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ అతను కావాలనే చేస్తున్నట్లు గమనించింది. అతనితో ఇది తప్పు అని చెప్పాలని ప్రయత్నించింది.

కానీ, అతను ఏమంటాడో తెలియదు తనకు తెలిసినట్లు అతనికి తెలిసిపోతే. అతని ఆగడాలు మరింత ఎక్కువ కావచ్చు లేదా డైరెక్టుగానే అడగవచ్చు అనిపించి, ఏమీ అనలేదు. పోనీ, అతని భార్య శిరీషకి చెప్పాలని వెళ్ళింది ఒకరోజు. కానీ, అక్కడికి వెళ్ళాక అనిపించింది.

తాను ఈ విషయం చెబితే మంచిగా ఉన్నచోట గొడవలు జరుగుతాయి, జరగవచ్చు కూడా… అంతా బాగుంది అన్న సమయంలో తన వల్ల వారి మధ్య గొడవలు రావడం జరుగుతుంది.

పైగా ఈ విషయం తాను అందరితో చెప్తే అతను తననే చెడుగా చేయవచ్చు తనపై నిందలు వేయవచ్చు, అందుకే ఎవరికీ చెప్పకుండా ఇలా మౌనంగా భరించడం ఎందుకు? ఎన్నాళ్ళు ఇలా భరించాలో అర్థం కాలేదు.

కానీ, అతని తప్పించుకునేందుకు ఇలా అతను ఉన్నచోట ఉండకుండా తప్పించుకొని తిరగడం మొదలుపెట్టింది. ఇది ఎవరికీ చెప్పుకోలేనిది. ఏం చేయాలో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. పెద్ద పెద్ద సినిమా స్టార్లంతా ఈమధ్య బయటకు వచ్చి తమకు జరిగిన అవమానాలను బయట పెడుతున్నారు.

కానీ, ఇలా మధ్యతరగతి కుటుంబాల్లో ఉమ్మడి కుటుంబాలలోని మహిళలకు జరుగుతున్న అవమానాలను ఎవరితో చెప్పుకుంటారు. చెప్పుకుంటే ఎవరు నమ్ముతారు. ఉమ్మడి కుటుంబాల్లో ఉండటం ఇష్టంలేక వేరుకాపురం పెట్టడానికి ఇలా నిందలు వేస్తున్నారు అని మహిళలనే అంటారు.

ఉమ్మడి కుటుంబం కాకపోయినా తన భర్త ఎలా అర్థం చేసుకుంటాడు. ఎవరు ఎలా మాట్లాడతారు అనే భయం ఉంది.

తన ఇద్దరు పిల్లలు ఇప్పుడిప్పుడే వయసుకు వస్తున్నారు. తాను వారిని చూసుకోవాలి లేదా తనకు జరిగే అవమానాన్ని ఎలా ఎదుర్కోవాలి తెలియక సతమతం అవుతుంది హిమజ. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి తెలియక రాత్రిళ్లు నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు.

ఎందుకు ఇలా జరగాలి తనకే ఎందుకు జరగాలి తాను చేసిన తప్పు ఏంటి అతడితో అమర్యాదగా నడుచుకో లేదు అతన్ని ఏమీ అనలేదు చాలా గౌరవంగా చూసింది.

అదే అతను అదునుగా తీసుకున్నాడా? పిచ్చిపిచ్చిగా చేయడం తనని తాకడం, బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఎవరూ చూడకుండా, చూడటం. ఇవన్నీ అందరికీ తెలిస్తే, తన పరువు పోతుంది.

టిట్ ఫర్ టాట్

టిట్ ఫర్ టాట్
టిట్ ఫర్ టాట్

ఒకవేళ కేసు పెడితే నలుగురికి తెలిసి ఆఫీస్ లో ఎన్నో అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎలా చేయాలి? ఏం చేయాలి? అనే ఆలోచనలతో సతమతమవుతున్న హిమజ ఆఫీస్ నుండి సాయంత్రం ఇంటికి ఎలా వచ్చిందో కూడా తెలియనంత పరధ్యానంగా గడిచింది ఆ రోజు.

ఈ రోజు కూడా తాను లిస్టులో ఎక్కాక పిర్ర మీద కొట్టాడు. దాన్ని అతని సొంత ఆస్తి అనుకోని తడిమాడు. తనకు దుఃఖం వచ్చింది. వెనక్కి తిరిగి చెంప పగలగొట్టాలని ఉన్నా ఆ పని చేయలేక పోయింది. తన కుటుంబంలోనే ఇలా ఉంటే ఇంకా వేరే వారి కుటుంబాలలో ఎలాంటి బాధలు ఉన్నాయి. ఎన్ని రకాలుగా అవమాన పడుతున్నారు వీళ్ళు కాక.

బస్సుల లోను, రైళ్ల లోను, రద్దీ ప్రదేశాలలోనూ, ఇంకెంత సహనాన్ని భరిస్తూ నెట్టుకొస్తున్నారు. అలాంటి అక్కచెల్లెల్ల పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉందేమో అంటూ ఇలా ఆలోచిస్తున్న హిమజ దగ్గరికి శిరీష పరిగెత్తుకుంటూ రావడం చూసి హిమజ ఏమైంది అంటూ అడిగింది. చూడు ఎవరో నా ఫోన్ కు ఈ మెసేజ్ పంపారు దాంతోపాటు ఇదిగో ఈ ఫోటో కూడా పంపారు అంటూ చూపించింది శిరీష. అది చూడగానే హిమజ కూడా అవాక్కయింది శిరీష కూతురు మూడేళ్ల ఫోటో అది దాన్ని ఎవరో తీసి మార్ఫింగ్ చేసి పంపారు.

దాంతోపాటు పంపిన మెసేజ్ చాలా అంటే చాలా అసహ్యంగా ఉంది. దాంతోపాటు ఇది ఎవరికైనా చెప్తే నెట్ లో ఉంటుంది. అనే బెదిరింపు కూడా ఉంది. అది ఎవరు పంపారు అని అడిగింది హిమజ, తెలియదు వదిన పాపం నా చిన్ని తల్లిని వాడెవడో ఇలా చేసి పంపితే, నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడంలేదు అంది శిరీష. అలా అనకు మీ అన్నయ్య రాగానే ఏం చేయాలో వారే ఆలోచిస్తారు అంది. అవును మా ఆయన రాగానే చెబుతాను అని అంది వెక్కిళ్లు పెడుతూ….

ఇంతలోనే శిరీష భర్త, హిమజ భర్త ఇద్దరు వచ్చారు. రావడంతోనే ఇంట్లో గంభీరంగా ఉన్న ఆడ వాళ్ళని చూసి, ఏమైంది? అంటూ అడిగారు శిరీష ఏడుస్తూ విషయం చెప్పింది. కానీ శిరీష భర్త సురేష్, ఏం కాదులే ఎందుకంటే అది  మూడేళ్లదే కదా… ఇది ఎవరో జోక్ గా చేసి ఉంటారు. ఏం కంగారు పడకండి. చాలా తేలికగా కొట్టి పడేసాడు.

అతను అలా అనడంతో హిమజ అతని ప్రవర్తనకు ఆడపిల్ల, ఆడపిల్లనే కదా ఇతను ఇలా ప్రవర్తిస్తాడు ఏంటి అని ఆశ్చర్యపోయింది. ఇంతలో ఇంకో మెసేజ్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయడం తో అందులో మార్ఫింగ్ చేసిన శిరీష ఫోటో ఉంది. అది చూడగానే శిరీష ఏడుస్తూ కూలబడిపోయింది.

దాన్ని తీసుకుని చూసి కొయ్యబారి పొయ్యాడు సురేష్. ఇది ఇదేంటి ఎవరూ ఇలా పంపింది అని ఇంతలో ఏమైంది బావ అంటూ ఫోన్ తీసుకో పోయాడు శేఖరం. వద్దు బావ వద్దు ఇది నువ్వు చూడకూడదు వాడు ఎవడో కానీ నీ చెల్లిని……. అంటూ ఇక చెప్పలేక చేతుల్లో మొహం దాచుకున్నాడు సురేష్.

ఇంతలో హిమజ భర్త శేఖర్ ఆడవారితో ఆడుకోవడం అందరికీ అనువుగా మారింది. వారు ఎవరికీ చెప్పుకోలేరు. ఏం చేయలేరు అని ఇలాంటి వెధవలు వెధవ పనులు చేస్తున్నారు. కానీ, ఇదే పరిస్థితి వారి ఇంట్లోవారికి వస్తే ఎంత బాధగా ఉంటుందో అని ఆలోచించరు. ఆలోచిస్తే, ఇలాంటి పనులు చేయరు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి రిపోర్టు అని అనగానే శిరీష అన్నయ్య ఎవరో ఇలా చేసి ఉంటారు.

చుట్టాలు స్నేహితుల లో పరువు పోతుంది అంది. అదేనమ్మా వారి బలం మీరు ఇలా ఆలోచిస్తారు బంధాలకు విలువ ఇచ్చి ఇంట్లో వారికి చెప్పకుండా ఉంటారు. కాబట్టి, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక ఇలాంటివి ఎక్కడ తగ్గిపోతాయి బంధాలు తెగిపోతాయి అని ఆలోచిస్తూనే ఇలాంటివి ఎదురైనా చెప్పరు మీరు అన్నాడు ఆవేశంగా శేఖరం.

తాను  హిమజను అన్ని రోజులు పెట్టిన ఇబ్బందులు గుర్తుకొచ్చిన సురేష్ చటుక్కున వెళ్లి హిమజ కాళ్ళు పట్టుకున్నాడు. తర్వాత శిరీష దగ్గరకు వెళ్ళి శిరీష నాకు జ్ఞానోదయం అయింది కళ్ళకు కమ్మిన కామపు పొరలు విడిపోయాయి. నన్ను క్షమించు చెల్లెమ్మ అని వెంటనే తిరిగి తన ఇంట్లోకి వెళ్లి పోయాడు.

అదేంటమ్మా రిపోర్టు ఇద్దాం అనుకుంటే అతను అలా వెళుతున్నాడు? అంటున్న శేఖర్ ని చూస్తూ శిరీష, అవసరం లేదు అన్నయ్య సమస్య తగ్గి పోయింది ఇక ఏ సమస్య ఉండదు. అని అంటూ తన పర్స్ లోంచి వేరే ఫోన్ తీసి అందులో నుంచి సిమ్ తీసి దాన్ని విరగ కొడుతూ చెత్త బుట్టలో వేసింది. శిరీష చేతిలో రెండు ఫోన్లు ఉండడం చూసిన హిమజ తనకు ఏదో అర్ధమయినట్లుగా శిరీష గట్టిగా కౌగిలించుకుంది. వారి మాటలు అర్థం కాని శేఖరం అలా చూస్తూ బొమ్మలా నిలబడిపోయాడు….

భర్త ప్రవర్తన ఎప్పుడో పసిగట్టిన శిరీష అతనికి బుద్ధి చెప్పాలని అనుకుంది హిమజ ఎంత క్షోభ అనుభవిస్తుందో అర్థం చేసుకుంది కానీ విషయం బయటపడితే పరువు పోతుంది తమ ఇళ్లలోని బంధాలు తెగిపోతాయి అని గ్రహించి విరగకుండా పాము చావకుండా పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో తెలియజేయాలని వేరే ఫోను వేరే సిమ్ము తీసుకొని ఇలా చేసి అతనికి బుద్ధి వచ్చేలా చేసింది.

ఇక జీవితంలో అతను ఎప్పుడు ఇంట్లోకి రాలేదు ఆమె కళ్ళలోకి చూడలేక సమస్య పోవడంతో నిశ్చింతగా ఇప్పుడు గుండెలపై చేయి వేసుకొని ఆదమరిచి నిద్రపోతే గలుగుతుంది అందరూ ఆలోచిస్తే మగాళ్ళంతా ప్రపంచంలోని ఆడవాళ్లందరూ అక్కాచెల్లెళ్ల చూస్తే అసలు ఈ సమస్య రాదు ఇలాంటి కష్టాల నీటిని తమ పంటి బిగువున భరిస్తున్న అక్క చెల్లెలు అందరికీ ఇది ఇది అంకితం…. మి

Related Posts

1 Comment

  1. మహిళలలో చైతన్యం వచ్చిన రోజు ఇలాంటి సంఝటనలు జరగవు

Comments are closed.