నీ పేరేంటి బాబు అని అడిగింది, అప్పుడే హైదరాబాద్ వెళ్లే ట్రైన్ ఎక్కిన వేణు ని చూస్తూ, సుభద్రమ్మ. వేణు ఆమెకి సమాధానం ఏమి ఇవ్వకుండా ట్రైన్ అంతా కలియ తిరిగి చూసాడు, ఏవైనా ఫిగర్లు ఉన్నాయేమో, బీట్ కొట్టొచ్చు అని వెతుకుతూ, అయ్యో అదేంటి బాబు నిన్నే అడుగుతున్నా, పట్టించుకోకుండా అంతటా వెతుకుతున్నావ్, ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారా, అని మళ్ళీ అడిగింది సుభద్రమ్మ.
హబ్బా ఈవిడ గోలేంటి? అని చిరాగ్గా చూసి, ఎవరు ఫిగర్ లు లేకపోవడంతో, అమెతోనే హ నా పెరు వేణు అండీ అని చెప్పాడు. అవునా మరి పేరు చెప్పడానికి ఇంత సేపు చేశావ్ ఏంటి నాయనా, నీ పేరు మరి అంత చెండలంగా ఏమి లేదు, గాని కాస్త ఆ కిటికీ తలుపులు మూసేయి బాబు, ఈ చల్ల గాలి పడదు నాకు అంది. హ సరేనండి అని కిటికీ మూసేసాడు వేణు ఫిగర్ ఎవరు లేరు అని అనుకుంటుంటే
ఈ ముసల్దాని గోలేంటో అని అనుకుంటూ, ఇంతలో మళ్ళీ ఆవిడే ఏ ఊరు బాబు మీది,ఎక్కడికి ప్రయాణం, హైదరాబాద్ కేనా, ఏమి చదువుకున్నావ్ ఏంటి మీ నాన్నగారి పేరేంటి ఎం చేస్తుంటారు అంటూ అన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించింది,
వేణు కొంచం విసుకున్నా మెల్లిగా వివరాలన్నీ చెప్పాడు ఓహోఅవునా సరే కానీ తినడానికి ఏమైనా తెచ్చుకున్నవాలేదా? అని అడిగింది ఆ ముసలావిడ ఇదెక్కడి గోలరా బాబు అనిఅనుకుని లేదండి నేను టిఫిన్ తినేసి వచ్చాను అని అన్నాడు అవునా,సరే బాబు అని ఆమె తెచ్చుకున్న రాగి ప్లాస్క్ లోని నీళ్లుతాగింది ఇంతలో ట్రైన్ ఎదోస్టేషన్లో ఆగింది
అక్కడైన ఎవరైనా అమ్మాయి ఎక్కుతుందేమో అని చూడసాగాడు వేణు. వేణు మంచివాడే కానీ వయసులో ఉన్నాడు కొన్ని అల్లరిపనులు చేసే మనస్తత్వంఅందుకే అంత తొందర, ఇంతలో ఆ కంపర్ట్మెంట్ లోకి ఒక అందమైన మెరుపుతీగలాంటిఅమ్మాయి ఎక్కింది తన సీట్ నెంబర్ చూసుకుంటూ వస్తోంది వేణు కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి హమ్మయ్య ఈ ముసలిదానితో ప్రయాణం చేయాల్సివస్తుందని చాలా భయపడ్డాడు,
ఇప్పుడు టైం పాస్ కి అమ్మాయి వస్తోంది, మనంవేసే బిట్ కి మనకిపడితే పండగే, లేకుంటే మాత్రం టైమ్ పాస్ అవుతుంది, ఆమె అందాలని కళ్ళతో జుర్రుకోవచ్చు అని అనుకుంటూ ఆమె దగ్గరగా వెళ్లి మీ నెంబర్ నేను చూస్తాను అండీ అంటూ మాట కలిపాడు ఆ అమ్మాయి మొహం చిట్లించుకుంది అయినా సీట్ చూపిస్తాడని టికెట్ ఇచ్చింది. పిల్ల బుట్టలోపడినట్టే అని అనుకుని నెంబర్ చూసాడు ఆ నెంబర్ ఆ ముసలావిడ పక్కనే వారికిఎదురుగా వేణుసీట్ ఉంది దాంతో డిలాపడ్డాడు తన పక్కనలేనందుకు అయినా ఫర్వాలేదు ఎదురుగానే కదా ట్రయల్ వేయొచ్చు అని అనుకుంటూ సీట్ చూపించాడు థాంక్స్అండీ అందాఅమ్మాయి ఆమెతీయని గొంతువిని ఆహాఎంత బాగుందోగొంతు అని అనుకుంటూ ఆమె కూర్చుంది ట్రైన్ కదిలింది ఆమెతో మాట కలపాలి అని చాలాప్రయత్నాలు చేస్తున్నాడు వేణు ఆమె సర్దుకుని కూర్చుంది నైట్ జర్నీఅందరూ పడుకున్నారు
.ఆఅమ్మాయి బాగ్లోంచి ఎదో బుక్తీసి చదవసాగింది, ఆ బుక్ పేరు చూసాడు వేణు వెన్నెల్లో ఆడపిల్ల అనేపేరు కనిపించింది హమ్మ మాట్లాడనికి ఒక వంకదొరికింది అనిఅనుకునిమీరు యండమూరి ఫాన్స్ఆహ అండీనేను ఆ బుక్ ఎప్పుడో చదివేసా అతనికి నేను పెద్దఫ్యాన్ని లెండిఅని ఏవేవో వాగుతూ ఉన్నాడు ఆఅమ్మాయి చిరునవ్వుతో చూస్తోంది కానీ ఒక్క మాట కూడా మాట్లాడ్డం లేదు ,
ఇంతలో నాయనా వేణు నాకు బాగా ఆకలిగాఉంది ఎదోస్టేషన్ వచ్చేలాఉంద కాస్త ఏమైనా తెచ్చిపెడతావా అని అంది సుభద్రమ్మ, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని వేణు కూడా అలాగే బామ్మగారు, ఏం కావాలో చెప్పండి అలాగే మీకు కూడా ఏమైన కావాలంటే చెప్పండి తెస్తాను అని ఆ అమ్మాయి వైపు చూస్తూ అడిగాడు నాకు జెస్ట్ ఏమైనా fruits తెండి అంది ఆమె మీకేంకావాలి అని అడిగాడు వేణు బామ్మని
నాకు ఒక ప్లేట్ ఇడ్లీ, అలాగే దాంతో పాటువడ ఇంకా ఈఊర్లో ఎదో వంటకం ఫేమస్ అంట, అది కూడా తీసుకో ఎందుకైనా మంచిది ఒక ఫ్రైడ్రైస్ దాంతో పాటు ఎలాగూ అవ్వన్ని ఆరగాలి అంటే పెరుగన్నం కావాలి కాబట్టి ఆదోటి తీసుకో అలాగే ఒక అజీర్తి మాత్ర కూడా తీసుకో అని హోటల్ లో వెయిటర్ కి చెప్పినట్లు గడగడా చెప్పేసింది బామ్మ ఏంటి బామ్మ ఇవ్వన్నీ నీకేనా ఇంకా ఎవరైనా వస్తున్నారా అని అడిగాడు వేణు
ఎదో కడుపుకి తినలిగా నాయనా నాకే అవ్వన్ని ఇంకా తక్కువే చెప్పాను మాములుగా అయితే ఓపక్కకి కూడా రావు అవి అని అంది హమ్మ బామ్మ ఈ రోజు నా పర్సుఖాళీ ఇక అని అనుకుని ఎదో అనబోయిమళ్ళీ అమ్మాయి ముందు పరువు పోతుంది అని ఒక వెర్రి నవ్వునవ్వి అలాగే తేస్తా అని స్టేషన్లో దిగాడు ఒక పది నిమిషాలు ఎలాగో ఆపసోపాలు పడి అవ్వని తీసుకుని అలాగే ఆ అమ్మాయికి కూడా పండ్లు తీసుకుని మళ్ళీ ట్రైన్ ఎక్కాడు, …
అవ్వన్ని బామ్మకి అందించి మీ పేరు చెప్పలేదండి అంటూ పళ్లు అందించాడు ఆమె నవ్వుతూ నా పేరు ప్రియా అండీ థాంక్స్అండీ అంది పళ్ళు తీసుకుoటూ బామ్మ మాత్రం అవ్వన్నీ తీసుకుని, మొహమాటం ఏమి లేకుండా తినసాగింది వేణు ప్రియ మాటల్లోపడి ఆమె ఎక్కడ చదువుతుంది ఏమి చదువుతోంది ఎక్కడ ఉంటారో వివరాలు అడగసాగాడుఆమె కొన్నిచెప్తూ కొన్నింటికి చిరునవ్వు నవ్వుతూ దాటవేస్తూ పళ్ళు తీసుకునితింటూ కూర్చుంది
వేణుమాత్రం ఆమెఅందాలను జుర్రుకుంటూచొంగలుకారుస్తూ ఆమెని ఎలాగైనాబుట్టలో వేసుకోవాలని చూస్తున్నాడు ఆమెకాస్త నవ్వుతూమాట్లాడి వివరాలన్నీ చెప్పేసరికి తనబుట్టలోపడిపోతోంది అనే సంతోషంలో ఉన్న వేణుని బాబు నువ్వు తినడానికి ఏమి తెచ్చుకోలేదా అంటూ అడిగింది సుభద్రమ్మ, ” అబ్బా ఈముసలిదానికి ఏమిపని లేదు పానకంలో పుడకలా నా వెంటపడుతుంది“అనిఅనుకుని లేదండీ అనిఅన్నాడు“అయ్యో అవునా, మీరింక తిన్నారేమో అనిఅనుకున్నఇప్పుడేలా సరే ఉండండి
నా దగ్గర బిస్కెట్లు ఉన్నాయి “అవి ఇస్తా“, కనీసం అవిఅయినా తినండి “లేదంటే రాత్రంతా ఆకలితో ఉండలేరు“ “అనిఅంటూ ఆ అమ్మాయి తనబాగ్లోంచి బిస్కెట్లు తీసి ఇచ్చింది,”‘ పర్లేదండి నేను ఇంకో స్టేషన్లో తింటాలెండి, అని అన్నాడు వేణు “”,మీరు ఇప్పుడు తీసుకోకపోతే, “నా మీద ఒట్టే అంది ఆ అమ్మాయి బుంగమూతిపెట్టి అదోలా నవ్వుతూ దానికే వేణు సంబరపడిపోయి నాకోసం ఎంతగానో ఆలోచిస్తుంది అంటే బుట్టలోపడినట్టే, అనిఅనుకుని సరే అని తీసుకోబోయాడు వేణు బాబు నాదగ్గర అని ఎదోఅనబోయిన
బామ్మని చేతితో వారిస్తూ “పర్లేదు బామ్మ ఇవి తింటాలెండి అని ఆ బిస్కెట్లు తింటూ ప్రియాతో కబుర్లలో పడ్డాడు, “బామ్మకి నిద్రవస్తోందిఅని “వేణుకి బాబు కాస్త నాసామాను చూస్తూ ఉండు నాకు నిద్ర వస్తుంది ” పడుకుంటా, అంది బామ్మ,” అలాగే బామ్మ అనిఅనుకుని “ హమ్మ బామ్మ పడుకుంది, ఇక ఈఅమ్మాయి దగ్గరకి వెళ్లిమన ప్రతాపం చూపించాలి అనిఅనుకున్నాడు మనసులోబామ్మ నిద్ర పోయింది కాసేపు కబుర్లుచెప్పుకున్నాక వేణుకి నిద్రముంచుకు రాసాగింది, ఇదేంటి ఆ అమ్మాయిని ఎదో చేద్దామనుకుంటే ఇలా నిద్ర వస్తుంది అని అలాగే ప్రియాతో మాట్లాడుతూనే నిద్రపోయాడు వేణు , …..
బాబు బాబు లే అని ఎవరో లేపడంతో బద్ధకంగాలేచి చుట్టూ చూసాడు ఎవరో నలుగురు వ్యక్తులు ట్రైన్ దిగుతూ వేణుని లేపారు ఏంటి బాబు అంత మొద్దునిద్ర ఇదే లాస్ట్ స్టేషన్ దిగు దిగు అయినా ఆ నిద్రపోవడం ఏంటి ఒంటి మీద చొక్కాకూడాలేకుండా అని నవ్వుతూ అన్నారు.అదే చివరిస్టేషన్ కావడంతో పాపంపోనీ అని లేపి విషయం చెప్పారు అప్పుడు వేణు చొక్కాలేకపోవడం ఏంటి అని అనుకుని తనని తాను చూసుకుని చేతితో ఛాతీ భాగాన్ని కప్పుకుని బామ్మఏదీ ప్రియఏది అని అన్నాడు
బామ్మ ప్రియానా ఇక్కడ ఎవరులేరు బాబుముందు నీ సామాను ఉందేమో చూసుకో అనిఅన్నాడు అందులోని ఒక వ్యక్తి, “వేణు వెంటనే తన బ్యాగ్ పర్స్ చూసుకున్నాడు ఏవిలేవు తనబ్యాగ్ లో ఉన్న పదివేలు బంగారు గొలుసు, ఉంగరాలు పాంట్ లో సేఫ్ ఉంచుకున్న ఇంకోఅయిదువేలు అన్ని గాయబ్ అయ్యాయి, అయ్యో నా పర్స్,నా బ్యాగ్ అని అన్నాడు ఆదుర్దగా, “ అంటే వాళ్ళు మీ వాళ్ళుకాదా అని అడిగాడు ఆవ్యకి
కాదండీ ఇదే ట్రైన్ లో పరిచయంఅయ్యారు అని అన్నాడు వేణు నువ్వు అంత చనువుగా ఉంటే మీవాళ్ళే అనిఅనుకున్నాం మరి మరిచయం లేనివారితో ఎందుకు బాబు అంత చనువుగా ఉన్నావ్ అని అన్నాడు ఇంకో వ్యక్తి, “హ ఏముందండీ, లడ్డులా అమ్మాయి కనిపించగానే సొల్లుకార్చాడు వాళ్ళుఇతన్ని కరిగించేసారు, ” ఇక్కడ ఇలాంటివి చాలా జరుగుతాయి లెండి మనలాంటి పెద్ద వాళ్ళతో వీళ్లు మాట్లాడరు
అమ్మాయి అనగానే సొల్లు కార్చి వాళ్ళ మాయలో పడతారు అన్నాడాయన” వాళ్లిద్దరూ ఇలాగే చాలామందిని మోసంచేశారు మీకుఅదే జరిగింది ఇప్పటికైనా కాస్తజాగ్రత్తగా ఉండండి అనిఅన్నాడు అప్పుడే అక్కడికివచ్చిన ఆ స్టేషన్ పోర్టర్ మరి ఇప్పుడు ఇతని పరిస్థితి ఏమిటి అన్నాడు ఇంకోవ్యక్తి ఎవరైనా తెలిసిన వారు ఉంటే ఫోన్ చేసి రమ్మని చెప్పండి అంతే వాళ్ళు వచ్చేవరకు ఇదేబోగీలో ఉంటాడు అన్నాడు తేలికగా పోర్టర్ ఫోన్ కూడా లేదు అన్నాడు వేణు హ అది ఉంచుతారా ఏంటి ఇదిగో నాఫోన్ నుండిచేయి అని ఫోన్ ఇచ్చాడు పోర్టర్,
తెలిసిన ఫ్రెండ్ కి ఫోన్ చేసి విషయం చెప్పి త్వరగా రమ్మనిచెప్పాడు వేణు ఆఫోన్ తీసుకునివెళ్లిపోయాడు పోర్టర్ వాళ్ళుకూడా వేణు తెలివితక్కువతనానికి నవ్వుకుంటూ అతన్ని జాలిగా చూస్తూ వెళ్లిపోయారు. తానుబుట్టలో వేద్దాం అని అనుకుంటే తననే బుట్టలో వేసి తననే బురిడీ కొట్టించిన బామ్మ ప్రియలని తలచుకుని“డామిట్ కథ అడ్డం తిరిగింది “అనిఅనుకుని ఇకముందు జాగ్రత్తగా ఉండాలి అనిఅనుకున్నాడు,
“’తనఅమ్మాయిలపిచ్చితనకి ఈ విధంగా బుద్ధి వచ్చేలా ఆ దేవుడు చేసాడు అని అనుకుంటూ,” తనస్థితికి తానే జాలిపడుతూ ఏడుస్తున్నాడు మనసులో….
Normal
0
false
false
false
EN-US
X-NONE
HI
/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
mso-bidi-font-size:10.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-fareast-font-family:”Times New Roman”;
mso-fareast-theme-font:minor-fareast;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Mangal;
mso-bidi-theme-font:minor-bidi;}