డ్రీమ్ గర్ల్ part – 2

చల్లగాలి గట్టిగా తాకుతుంది., అయినా హాయిగా ఉంది. చినుకులు చిటపటా తడుతున్నాయి., అయినా.. హాయిగా ఉంది. ఎందుకంటే ఆ క్షణం కోసం మది ఎన్నాళ్ళుగానో వేచి ఉంది. ప్రేమ భావన లో ప్రతి నిముషం హాయి కదా..

ఫా…….ట్ మని శబ్దం. అంత హోరు లో కూడా స్పష్టంగా వినపడింది. ఎందుకు వినపడదు అది వచ్చింది చెవికి రెండు అంగుళాల దూరం నుండే కదా

లాగిపెట్టి కొట్టాడు కల్కి. ఆ దెబ్బకి చెంపల్లో మందారాలు పూసాయి. అయినా అందం గానే ఉంది. కలకత్తా కాళీ లా తయారయ్యాయి కళ్ళు. అయినా.. ఒక్క మాట కూడా మాట్లాడకుండా పరుగున వెళ్ళిపోయింది.

రోడ్ టర్న్ అయ్యేవరకూ చూస్తూ ఉన్నాడు కల్కి. అలా వెళ్తూనే కనుమరుగైంది. ఒక్క క్షణం ఊపిరి పీల్చుకుని కళ్ళు నేలను చేర్చాడు. అంత హడావిడి లో కూడా అందెల సవ్వడి వినపడుతోంది కల్కి చెవులకు

రెప్పలు పైకి లేపి., కనుబొమలు దగ్గర చేసి చూస్తున్నాడు అలా ఎలా వస్తుంది అని. తాను అనుకున్నట్టుగానే ఆ సవ్వడి మరింత ఎక్కువగా వినిపిస్తూ ఒక్కసారిగా ఆగింది. ఈ సారి మరో శబ్దం మనసును తాకేలా…

కల్కి……….. I LOVE YOU……. అంటూ గట్టిగా అరిచి చెప్పింది సారిక అల్లంత దూరాన్నుండే. గాలి, నీరు, ఆకాశం, భూమి ఇరువురి మనసుల్లో రగిలే నిప్పు కు మాత్రమే వినపడుతోంది ఎవరూ లేని ఆ నిర్మానుష్య ప్రదేశం లో

ఏమీ.. బదులు చెప్పకుండా అలా చూస్తూ నిలుచుండిపోయాడు కల్కి అధికమౌతున్న ఆవేదనతో. ఇక బదులివ్వడని అర్థమై చెంపలపై జారిన నీటిని తుడుచుకుంటూ అక్కడ నుండి కదలలేక తప్పక వెళ్ళిపోయింది

సారిక వెళ్ళిపోయింది అని మనసుకి తెలియగానే జలజలా రాలిపోతున్నాయి కల్కి కళ్ళలో నీటి బిందువులు. మనసును పట్టి లాగేస్తున్నట్టు ఉంది తనకి. గట్టిగా పక్కనే ఉన్న బెంచ్ ను కొట్టాడు ఆపలేని ఆక్రోశం తో…

ఎవరో తనని పిలుస్తున్నట్టు వినిపిస్తుంది. చాలా లోతుగా.. ఎవరో ఎక్కడున్నారో అని చుట్టూ వెతుకుతున్నాడు ఉన్న చోటనే నిలబడి. ఎక్కడా ఎవరూ కనపడటం లేదు. ఇంతలో ఎవరో నెత్తి మీద ఒక్కటిచ్చినట్టు అనిపించి..     

కళ్ళు తెరిచి చూసాడు. పక్కనే కూర్చుని అయోమయం గా చూస్తుంది రూప. ఇదెవరు అని అడగకండి అందరూ పరిచయం అవుతారు వైట్ వైట్.

” హేయ్ నువ్వేంటి ఇక్కడా..” కల్కి డౌట్

” ఏరా… బుర్ర తిరుగుతుందా..  రాత్రి ఏమైనా వేశావా..? ” రూప క్వశ్చన్

” ఆయ్.! పిచ్చి పిచ్చి గా మాట్లాడేవో…  అక్క అని కూడా చూడను. వీపు విమానం మోత మోగిపోద్ది ”

” అది తర్వాత కానీ.. ఒకసారి నీ చెయ్యి చూసుకో ”

” అబ్బా.. బ్లడ్ వస్తుందే.. ”

” బ్లడ్ యే కాదురా.. కళ్ళల్లో నీళ్ళు కూడా వస్తున్నాయ్. నీకు తెలీకుండానే వస్తున్నాయా కల్కి.. ఏమైంది రా.. ” అని. అడుగుతుంది ప్రేమగా రూప

” ఔను అక్కా.. నిజంగా నాకు తెలీదు. ఎందుకిలా అవుతుందో.. అసలు ఎవరా అమ్మాయి ”

” అమ్మాయి ఎవరు రా.. ఏమైంది అసలు ”

” ఏమో అక్కా.. ఎవరో తెలీదు. నన్ను వదిలేసి వెళ్లిపోతుంటే తెలీకుండానే మనసు భారమైపోయి కళ్ళల్లో నీళ్ళు తిరిగేసాయి ”

” ఔనా… నిన్నొదిలేసి వెళ్లిపోవడం ఏంట్రా.. ”

” ఏమో అక్కా.. ఏం అర్థం కావడం లేదు. ఎంత ముద్దుగా ఉందో తెలుసా.. అలాంటి అమ్మాయిని కొట్టడానికి చేతులు ఎలా వచ్చాయో నాకు ”

” ఏంటీ.. కొట్టావా… మరీ ఇంతలా నా.. బ్లడ్ వచ్చేలా..?! ” ఆశ్చర్యం ఇంకా చిరాగ్గా ఫేస్ పెట్టింది

” అబ్బా.. బ్లడ్ వచ్చేలా కొట్టింది బెంచ్ ని తల్లీ. కానీ తనని కొట్టాను అక్కా.. కానీ అదేంటో బుగ్గలు కందేలా కొట్టినా.. i love you అందేంటి అక్కా.. ”

” అబ్బో.. లవ్వే.. నీ ముఖానికే.. అదేవరో పిచ్చిది అయ్యుంటుందిలే.. లేకపోతే పోయి పోయి నీకు ప్రొపొజ్ చేయడమేంటి ” అంది వెటకారంగా

” అక్కా.. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ.. ”

” హే.. పోరా… నీ ముఖానికి ఈ ఉడుక్కోవడం గట్రా సూట్ అవ్వదు కానీ పద ఆయింట్మెంట్ పెడతా ” అని ఏడిపిస్తూనే ప్రేమను చూపుతుంది రూప.

ఎంతైనా.. ముద్దుల తమ్ముడు కదా.. కల్కి గురించి ఈ ప్రపంచం లో అందరికంటే ఎక్కువ తెలిసింది తనకు మాత్రమే. అమ్మా నాన్నా వద్దు అని తిట్టిపోసే విషయాలను కూడా తనకు సపోర్ట్ గా నిలబడి ముందుకు నడిపేది తానే.

అందుకే కల్కి అక్క కి చెప్పకుండా ఏదీ చేయడు. ఏదైనా చేసినా అక్కకి చెప్పి తీరాల్సిందే. రూప కూడా అంతే తన తమ్ముడు కి మించిన హీరో లేడని తన అభిప్రాయం., అభిమానం.

అమ్మకి వీళ్ళిద్దర్నీ చూస్తుంటే తృప్తిగా ఉంటుంది. నాన్న అయితే  చిన్నప్పటి నుండీ అస్సలు కొట్టుకొని తన పిల్లల్ని చూసుకుని అతడి అదృష్టానికి తనలో తానే మురిసిపోతుంటారు.

❇️❇️❇️❇️❇️❇️❇️❇️❇️❇️

” అభీ… అభీ… చాలు రారా.. ఎంతసేపు అలా… ఏ కాలంలో ఉన్నావురా ఇంకా.. ” అని అమ్మ పిలుస్తుంది మేడమీద ఉన్న అభిసారిక ని

అరగంట తర్వాత కిందికొచ్చింది అభి. సహజం గా కోమలం గా మాట్లాడే తను ఈ ఒక్క విషయం లో మాత్రం అమ్మను అప్పుడప్పుడూ కోప్పడుతుంది. అదే ఎమోషన్ లో వచ్చింది అభి.

” ఏంటి అమ్మా.. ఎన్నిసార్లు చెప్పాను మెడిటేషన్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని ” అంది అభి అమ్మని ముద్దుగా కసురుకుంటూ

” ఏం మెడిటేషన్ యే.. పొద్దున వెళ్లి కూర్చుంటావ్., గంటలు గంటలు ఏంటిది. ఈ కాలం లో ఎవరైనా ఉన్నారా నీలా ”

” అమ్మా.. ఈ కాలం గురించి నాకు చెప్పకు. నాకు తెలుసు ఏం చేయాలో ఏం చేయకూడదో..  అందరిలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయలేను ”

” మరి ఇప్పుడు చేస్తున్నదేంటి.. అందరూ ఉదయాన్నే లేచి జాగింగ్ కి వెళ్తుంటే నువ్ మాత్రం తలుపేసుకుని ఆ గదిలో మౌనం గా కూర్చుంటావ్. దాన్ని ఏమంటారు ”

” అమ్మా… ప్లీజ్. ధ్యానం అనేది అదో గొప్ప వరం. అందరికీ దొరికేది కాదు. మనల్ని మనలా ఉంచే అద్భుత శక్తి. దాని గురించి పూర్తిగా తెలీకుండా మాట్లాడకు ”

వీళ్ళ డిబేట్ ఔతుండగానే నాన్న వచ్చి మధ్యలో కలుగజేసుకున్నారు.

” ఏంటి స్వప్నా.. నీ గోల పొద్దున్నే.. అదేదో మంచి పని చేస్తుంటే.. పొరుతావెందుకు. నీ పెద్ద కూతురు ఉంది గా.. దానికి చెప్పుకో నీ పాఠాలన్నీ. అభి కి కాదు ”

” ఔను లేండి మీరు ఇదీ.. ఒకటేగా.. వెనకేసుకొస్తారు మరి. ఏదో ఘన కార్యం సాధించినట్టు ” అండి అభి వాళ్ళ అమ్మ స్వప్న

” అభీ.. నువ్ ఏం చేయాలి అనుకుంటే అది చెయ్. మీ అమ్మ కి ఏం తెలీదు. మా అమ్మ చెప్తూ ఉండేది భగవంతుడి గురించి అప్పుడు నాకు ఎక్కేది కాదు.

అనుకోకుండా నీకు మా అమ్మ లక్షణాలు వచ్చి ఈ మార్గం లో వెళ్తున్నావ్. అది నీ అదృష్టం. దానికి నేను అడ్డు రాను. ఎవర్నీ రానివ్వను. అందరికీ ఆదర్శం అయ్యేలా ఉండాలి తల్లీ ” అని చెప్పారు అభి వాళ్ళ నాన్నగారు ఉదయ్

” సరే నాన్నా.. మీ సపోర్ట్ ఉంటే ఏమైనా సాధించగలను. అమ్మ పిచ్చిది లేండి నాన్నా.. తన మాటలు పెద్దగా పట్టించుకోను లేండి.

అమ్మ ఎప్పుడూ ఉండేదే గా.. ఇంతకీ అక్క ఏది నాన్నా.. ఇంకా రాలేదా జాగింగ్ నుండీ.. ”

” లేదురా.. అదే చూస్తున్నా.. ”

” సరే నాన్నా.. అయితే అక్క వచ్చాక అందరం కలిసి తిందాం లేండి అని అమ్మా.. నీ పూజ అయిపోయిందా.. ”  అని కేకేసింది అమ్మని

” ఆ.. అయిపోయింది రా.. ఏమ్మా.. ” అన్నారు అమ్మ

” ఏం లేదు అమ్మా.. రా ఇలా వచ్చి కూర్చో.. అలా ఎంతసేపూ వంటింట్లోనే అయిపోతుంది నీ జీవితం. నేను తెచ్చి పెడతా అన్నీ ఇలా రా ” అంటూ తనే లేచి కిచెన్ లో కి వెళ్ళింది

ఇడ్లీ, దోశ, చట్నీ అన్నీ తెచ్చి పెట్టేసరికి వచ్చింది లాస్య జాగింగ్ నుండి.

” అక్కా.. త్వరగా ఫ్రెష్ అయి వచ్చేయ్., ఆకలి దంచేస్తుంది ” అంది అభి

” ఆ.. ఇదిగో 10 min లో వచ్చేస్తా.. మమ్మీ డాడీ ప్లీజ్ వైట్ హా..” అని గబగబా వెళ్ళింది లాస్య తన రూం కి

ఫ్రెష్ అయి వచ్చాక నలుగురూ మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తున్నారు.

❇️❇️❇️❇️❇️❇️❇️❇️❇️❇️

” అమ్మా.. టిఫిన్ అయిపోయిందా.. “అంటూ అడుగుతున్నాడు స్నానం చేసి వస్తూ కల్కి

” అయిపోయింది నాన్నా.. ” అని సమాధానం చెప్పింది కల్కి వాళ్ళ అమ్మ గీత

” ఏమోయ్  అదే చేత్తో నాకు కూడా పెట్టేసేయ్ ” అంటున్నారు హాల్ లో నుండి కల్కి వాళ్ళ నాన్న మనోహర్

” నాన్నా.. నేను పెట్టనా.. ” అంది రూప

” వద్దమ్మా.. మీ అమ్మ చేత్తో పెడితేనే నాకు తిన్నట్టు ఉంటుంది. అయినా మీ తమ్ముడు ఉన్నాడు గా.. వాడు నువ్వు చూసుకోండి. మమ్మల్ని కెలకొద్దు మీరు ప్లీజ్ ” అంటూ నవ్వేస్తున్నారు రూప ఉడుకుమోతుతనం  చూసి

” పోండి నాన్నా.. ఎప్పుడూ ఇంతే మీరు. మీకు మీ ఆవిడే గొప్ప. నేను కాదు ” అంది బంగ మూతి పెట్టి

” నా బంగారూ…. నువ్ మా అమ్మవు రా.. అది నా పెళ్ళాం. నువ్ ఎందుకు కష్టపడడం. మీ అమ్మ చూసుకుంటుంది లే ” అంటూ పక్కన కూర్చోపెట్టుకున్నారు

” ఆ.. ఆ.. అలా ముద్దు చేయండి. రేపు పొద్దున బావ వస్తే మీరు వండి పెడుదురు గాని ” అంటున్నాడు కల్కి

” అంత లేదురా… నా బంగారు ఎప్పటికీ అమ్మా నాన్నకి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయదు. నువ్వే ఏ క్షణం ఏం వెలగబెడతావో అని భయం నాకూ మీ అమ్మకి ”

” నాకేం భయం లేదు లేండి. నా కొడుకు ఎప్పుడు ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. వాడేంటో మీకు తెలీదా అయినా.. ” అంది గీత

వీళ్ళు ఇలా పేచీ వేసుకుంటుండగానే రూప ఇడ్లీ లో కారప్పొడి, నెయ్యి వేసి తినిపిస్తుంది తమ్ముడికి పాపం చేతికి దెబ్బ తగిలింది కదా…

ప్రస్తుతానికి ప్రశాంతం గా ఉన్న ఈ జీవితాలు ఫ్యూచర్ లో ఏమౌతాయి. ఎన్ని మలుపులు తిరుగుతాయి.

*******

to be continued…….

– SINDHU HETHI 

Related Posts

1 Comment

Comments are closed.