కళ్ళలో నిప్పు కణికలు
నవ్వులో చంద్రకాంతులు
హృదయంలో అగ్ని గోళాలు
ఆలోచనలు గంగా, గోదావరులు
ఆచరణలు వీచే గాలులు
కష్టం అంటే శ్రీరామచంద్రుడు
యుద్ధం కోరితే పరశురాముడు
కోపం చూస్తే బాలభానుడు
ప్రేమను పంచే చిన్నికృష్ణుడు
కల్మషం లేని కఠినాత్ముడు
నిరంతరం శ్రమించే సాటి మానవుడు
కల్కి
The hero
నవ్వుల్లో ఆణిముత్యాలు
చూపుల్లో చురకత్తులు
నడకలో మయూరం
నడతలో హిమాలయం
మనసు ఆకాశం
మాట జలపాతం
కష్టం చూస్తే తానే కన్నీరు
కోపం వస్తే ముంచే వరదహోరు
ప్రేమలో అలరించే రాధమ్మ
అల్లరిలో ఉరకలేసే కృష్ణమ్మ
మానవత్వం నింపుకున్న అపురూపం
అభిసారిక
The queen
ఇది ముఖం కనపడని పరిచయం. త్వరలో వీరి కథ మీ ముందుకు.
get ready…
– SINDHU HETHI