తప్పా ఒప్పా (Is that Wrong or Right 3or2)

తప్పా ఒప్పా

తప్పా ఒప్పా
తప్పా ఒప్పా

అది ఒక మామూలు బస్తీ ఆ బస్తీ లో ఒక చిన్న బడ్డీ కొట్టు నడుపుతున్న నారాయణమ్మ ఆమెకు అది ఒక్కటే ఆధారం దారి తోనే ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని తనను పోషించుకుంటూ జీవనం గడుపుతుంది అటు పుట్టింటి నుండి బంధువులు చుట్టాలు అంటూ ఎవరూ లేరు నారాయణమ్మ .

 

ఇక నారాయణమ్మ కూతురు శోభ పదో తరగతి వరకు చదువుకొని ఇక తనకు స్తోమత లేదని గవర్నమెంట్ కాలేజీ అయినా పుస్తకాలకు బట్టలకు బాగా ఖర్చు అవుతుందని భయపడిన నారాయణమ్మ కూతురికి నచ్చజెప్పి  షాప్ నీ చూసుకోమని చెప్పింది.శోభ కూడా చదువంటే  పెద్దగా ఇష్టం లేకపోవడం లక్ష్యం కూడా ఏమీ లేకపోవడంతో తల్లి మాటకు త ల ఊపి  కొన్ని రోజులు షాప్ లో కూర్చునేది శోభ శోభను అక్కడ ఉంచి ఆమె జామకాయలు  తీసుకుని స్కూల్ వద్దకు వెళ్లి  అమ్మేది.

 

శోభ షాప్ లో కూర్చుని  వచ్చే పోయే వాళ్ళని అప్పుడప్పుడు  వచ్చే గిరాకీని చూసు కుంటూ  కాలక్షేపం చేసేది.. అలా రోజులు గడుస్తూ ఉండగా మా షాప్ కు రోజు పదకొండు గంటలకు ఒక యువకుడు వచ్చి రెండు సిగరెట్లు తీసుకొని ఆమె అక్కడే తాగేసి ఒక చాక్లెట్ కొనుక్కొని నోట్లో వేసుకుని చప్పరిస్తూ వెళ్ళిపోయేవాడు.

 

మొదట్లో శోభకు అది వింతగానూ విచిత్రంగానూ అనిపించేది ఎవరైనా సిగరెట్లు జేబులో వేసుకుని వెళ్ళిపోతారు కానీ అతను మాత్రం అక్కడే తాగేసి వెళ్లేవాడు తల్లిదండ్రులకు తెలియకుండా తాగుతున్నాడు ఏమోలే  అనుకుంది శోభ. అతన్ని అంతగా పట్టించుకోలేదు అయితే రోజులు గడుస్తున్న కొద్దీ అతను ఎప్పుడు ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూడడం మొదలుపెట్టింది.

 

అతను రాగానే అతని బ్రాండ్ సిగరెట్ తీసి రెడీగా పెట్టడం, పిప్పరమెంటు చాక్లెట్ తీసి పెట్టడం చేసేది ఒకరోజు అతను రాకపోతే ఆమెకు ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండేది. రోజంతా ఒకటి రెండుసార్లు శోభ బయటపడింది కూడా నిన్న రాలేదు అని అడగడం,అతను కనిపించగానే మొహం మెరవడం గమనించకపోలేదు.

 

బాగానే ఉందని లైన్లో పెట్టాలనుకున్నాడు మల్లేశం మాటలు కలిపాడు మనసులు కూడా కలవడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. అతని పేరు మల్లేశం పక్కనే ఉన్న పల్లె కానీ ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అనే నమ్మకంతో ఇక్కడికి వచ్చి స్నేహితుని ఇంట్లో ఉంటున్నాడు.

వాళ్ళింట్లో సిగరెట్ తాగితే బాగుండదని ఇలా వచ్చి తాగుతున్న అని చెప్పాడు నువ్వు ఏం చదివావు అని అడిగింది శోభ నేను డిగ్రీ వరకు చదివి ప్రభుత్వఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చాను,నాకు ఎవరూ లేరు అని మల్లేశం చెప్తే ,అదెలా నీకు వస్తుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అంది శోభ.

 

అప్పుడు తన కాలును చూపించాడు అది ఎడమకాలు పాదం మెలితిరిగి ఉండడం చూసి,ఇది ఇలా ఉంటే  ఉద్యోగం వస్తుందని చెప్పి నన్ను నమ్మిస్తావా అంది కోపంగా అయ్యో పిచ్చి మొద్దు ఇది ఇలా ఉంటే వికలాంగులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది.దాని వల్ల నాకు ఉద్యోగం రావడం నిజం అని అన్నాడు ధీమాగా.. శోభ అతని మాటలు నమ్మింది.

 

ఇక వారి కబుర్లకు. ఆమె షాప్ అడ్డగా మారింది ఇంతలో నారాయణమ్మ  జామకాయలు అమ్మే స్కూల్లోనే టీచర్లు ఆడపిల్లలకు టైలరింగ్ నేర్పించడం మొదలు పెట్టారు అది తెలుసుకున్న నారాయణమ్మ నా బిడ్డకు కూడా నేర్పిస్తారు  అమ్మ అని అడిగింది వారిని అయ్యో నారాయణమ్మ ఇది పేద వారి కోసమే కదా తప్పకుండా నేర్పిస్తాను రేపట్నుంచి నీ కూతుర్ని ఇక్కడ పంపు అని అన్నారు స్కూల్ వాళ్ళు,

తప్పా ఒప్పా

దాంతో నారాయణమ్మ షాపులో ఉంటూ శోభను టైలరింగ్ నేర్చుకోవడానికి పంపేది అది పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు కాబట్టి శోభ ఇంటికి రావడం నారాయణమ్మ తీసుకుని వెళ్లడం చేస్తూ ఉండేది.మల్లేశం శోభ ఇద్దరు కలుసుకోవడానికి అది పెద్ద ఆటంకం అనిపించలేదు.

 

వాళ్లు బాగానే మాట్లాడుకోవడం కలుసుకోవడం చేస్తున్నారు కానీ తల్లి కళ్ళలో పడకుండా శోభ మాత్రం ఎన్ని రోజులు దాస్తుంది ఒక రోజు పళ్ళు అమ్మడానికి వెళ్ళిన నారాయణమ్మ గుండెల్లో కాస్త దడగా ఉండడం తో తొందరగానే ఇంటికి వచ్చేసింది.

 

ఆమె రాక గమనించని వాళ్ళిద్దరు పకపకా నవ్వుతూ శోభ భుజాలమీద చేతులేసిన మల్లేష్ ని చూస్తూ ఎవరు నువ్వు నా బిడ్డ మీద చేతులు వేసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు అని అనగానే  చప్పున  చెయ్యి తీసేసాడు మల్లేశం కానీ భయపడలేదు అత్త నువ్వు ఇట్లా కూర్చో నీకు అంతా చెప్తాను శాంతంగా విను అని అన్నాడు మల్లేశం.

 

అసలే చిరాకు లో లో ఉన్న నారాయణమ్మ ఏంట్రా వినేది అదేదో ఎర్రి బాగులది నీ మాయలో పడింది ఏమో నేను అలా పడేదాన్ని కాదు ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచింది. ఈ గలాటా విని చుట్టుపక్కల ఉన్న నలుగురు చేరారు విచిత్రం చూస్తూ వారిని చూసిన మల్లేశం కొంచెం నేను చెప్పేది విను అని అన్నాడు.

 

చత్ నా పోరి నా కాకుండా చేద్దామని ఏవో వేషాలు వేస్తున్నావ్ ఏంది నారాయణమ్మ .ఇంతలో గుంపులో ఎవరు అతను ఏదో చెప్తాను అని అంటున్నాడు కదా వినవమ్మ ఒకసారి ఏం చెప్తాడో అని అన్నారు. అదే అవకాశంగా తీసుకున్న మల్లేశం నారాయణమ్మ కుర్చీని ఆమె వద్దకు జరిపి కూర్చోబెట్టి ఆమె కాళ్ళ కింద గా అతను శోభా ఇద్దరు కూర్చుని.

 

అత్త నా పేరు మల్లేశం నా దీపక్క పల్లె ఉద్యోగం కోసం వచ్చిన నాకంటూ ఎవరూ లేరు నేను శోభ ఇష్టపడుతున్నాం కాబట్టి మా ఇద్దరికీ నువ్వు పెద్ద మనసు చేసుకొని పెళ్లి చెయ్ అని ఉన్నాడు అని చూస్తూ ఎవరు దిక్కు లేదు అనుకుంటే ఏ దిక్కులేని నిన్ను నమ్మిన పిల్లలు ఎలా ఇవ్వాలి అని అంది.

 

అత్త అందరూ అలా అనుకుంటే మనలాంటి వాళ్లకు పెళ్లిళ్లు కూడా కావు కావాలంటే మన ముగ్గురం ఒకే దగ్గర ఉందా నీ పిల్లను మోసం చేసే వాడిని అయితే ఇప్పుడు ఆ పని చేసేవాడిని కావాలంటే అడగండి ఇంతవరకు వేలు కూడా వేసి ముట్టలేదు ఏదో ఈరోజు జోక్ చేస్తుంటే భుజం మీద చెయ్యి పడింది అంతే అని అన్నాడు వినయంగా శోభ కూడా అవునమ్మా ఆయన చాలా మంచి వారు ఆ ఒక్క లోపం తప్ప ఆయనకు ఏ లోపం లేదు అని అనగానే నారాయణమ్మ ఏ లోపం గుడ్డోడా, గున డా అని మల్లేష్ న్నీ  తేరిపార చూసింది

 

ఇక లాభం లేదని అది కాదు అత్త ఇదిగో నాకు కాలు పుట్టుకతోనే ఇలా ఉందని మెలితిరిగిన కాల్ ని చూపించాడు మల్లేశం. చక్కదనాల తన బిడ్డను ఈ అవిటి వాడికిచ్చి పెళ్లి చేయాలా అని నేను అసలు ఒప్పుకోను అని అంది నారాయణ , అత్త అత్త తొందర పడకు నాకు ఇలా ఉండడం అదృష్టమే కానీ దురదృష్టం కాదు అని అన్నాడు మల్లేశం అలా ఉండడం అదృష్టమా నాకే నీతులు చెప్పకు అంది నారాయణమ్మ,

 

అయ్యో అది కాదు నాకు ఇలా ఉంటే వికలాంగుల కోటాలో గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అని చుట్టూ చూస్తూ ఏమయ్యా మీకు తెలుసు కదా చెప్పండి అని అడిగాడు.

 

ఒక చదువుతున్నట్టుగా ఉన్న యువకుడు ఒకరు ముందుకు వచ్చి అవునండి వికలాంగులకు ప్రభుత్వం ఉద్యోగం వస్తుంది అర్హులైన వారికి అని చెప్పాడు కూడా చేయలేదు వాడికి కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగం ఇచ్చారు అని చెప్పాడు అందరూ చెప్తున్నది వింటున్న నారాయణమ్మ కరగసాగింది

 

అది చూసిన మల్లేశం అత్త నేను నమ్మకంగా చెబుతున్న కదా నన్ను నమ్ము నిజంగా ఉద్యోగం వస్తుంది నీ కూతుర్ని నీ కంటే బాగా చూసుకుంటా అన్నాడు ఇంతలో పక్కింట్లో ఉండే దగ్గరికి వచ్చిన సంబంధం, అత్త ఆడబిడ్డల పోరు లేదు బిడ్డతో పాటు ఆమెను చూసుకుంటూ నువ్వు ఉండొచ్చు అంతేగా కాదంటే వేరే కాపురం పెట్టించు కాదని ఇప్పుడు అన్నావో మళ్లీ ఇలాంటి సంబంధం వస్తుందో లేదు ఎటూ వెళ్ళకుండా నీ కళ్ళ ముందే ఉంటుంది అని చెప్పాడు అది నిజమే అని అనిపించింది.

 

మళ్ళీ ఇలాంటి సంబంధం రాకపోవచ్చు అతనికి ఎవరూ లేరు అలాగే ఉన్నాడు ఇక ఉద్యోగం రాకపోయినా  కష్టం చేసి ఇంత ముద్ద పెడితే హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అని ఆలోచించి కూతురు మొహంలోకి చూసింది తల్లి తల్లి ఏమంటుందో అని భయం స్పష్టంగా కనిపించింది కళ్ళు అతని మీద ఉన్న ప్రేమ కూడా కనిపించింది తల్లికి,బాగా ఆలోచించి నారాయణమ్మ సరే మీ పెళ్లికి ఒప్పుకుంటాను కానీ ఉద్యోగం వచ్చిన తర్వాతనే పెళ్లి అని మరొక   కిటుకు పెట్టింది,

 

అమ్మ కంచం నిండా అన్నం పెట్టి చేతులు కట్టేసి నట్లు చెప్తున్నావు ఉద్యోగం వచ్చే దాకా చూస్తూ ఊరుకుంటుందా అది వచ్చేది వస్తుంది ఏమో పెళ్లి అయినాక రావచ్చేమో అయినా ఈ నెలలో చేయకపోతే ఇంకో మూడేళ్ల దాకా ముహూర్తాలు లేవంట, అందరూ అదే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు చేయకపోతే తర్వాత మీ ఇష్టం అన్నాడు ముసలాయన.

 

అది విన్న మల్లేశం కూడా అత్త పెళ్లి అయితే నా అదృష్టం మారుతుందని పంతులు చెప్పాడు ముందు పెళ్లి కానీ అత్త అన్నాడు నారాయణమ్మ తాను మరి అతి చేస్తున్నానెమో  అని అనిపించి సరే మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించాలి అని అడిగింది నారాయణమ్మ  ఆ మాటకు శోభ కళ్ళు తళుక్కున మెరవడం  గమనించకపోలేదు తల్లి.. మరి ఇక సమస్య తీరిపోయింది పిల్ల తొందరగా పప్పన్నం పెట్టు మరి వస్తాం అని అక్కడున్న అందరిని తీసుకొని వెళ్ళాడు ముసలాయన .

 

వారం రోజుల్లోనే మంచి ముహూర్తాలు పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో తన ఇంటి ముందే పందిరి వేయించి వంటలు చేసి ఎన్ని రోజులు దాచిన డబ్బంతా తీసి అందరికీ భోజనాలు మర్యాదలు చేసింది నారాయణమ్మ. ఒక్కగానొక్క కూతురు పెళ్ళికి మరి ఆమాత్రం చేయకపోతే ఎలా అని అనుకుంది తమ ఇంటికి చుట్టపుచూపుగా వచ్చి నా కొడుకు మిత్రుడు ఒక ఇంటి వాడు కావడంతో మిత్రుని తల్లిదండ్రులు కూడా పెళ్లికి వచ్చి సంతోషించి వారిని ఆశీర్వదించారు.

 

పెళ్లి మూడు రాత్రులు అయ్యాక మల్లేశం తన భార్యను తీసుకొని కొత్తగా అద్దెకు తీసుకున్న ఒక చిన్న గ దికి మారిపోయాడు ఇంకా భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా సుఖంగా కాపురం చేసుకోసాగారు నారాయణమ్మ పళ్ళు అమ్మడం మానేసి షాప్ లోనే ఉండసాగింది మనవడి కోసం ఎదురు చూస్తూ.మల్లేశం అనుకున్నట్టుగా ఉద్యోగం రాలేదు కానీ ఫోన్ డబ్బా పెట్టుకోడానికి మాత్రం ఇచ్చారు దాంతో అతను డబ్బు పెట్టి అందులో నుంచి తాను వేరే పని కి వెళ్లి సాగాడు కాపురం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది ఈ ఉద్యోగం రాకపోయినా తన తెలివితో రెండు చేతులా సంపాదించడం చూస్తూ నారాయణమ్మ సంతృప్తిగా ఉంది.

 

మల్లేశం ఒకరోజు కూడా తనకు ఇది కావాలని అడిగేవాడు కాదు అయితే పెళ్లి లోనే తన వద్ద ఉన్న బంగారం కూడా పెట్టడంతో తనకు ఇప్పుడు ఇవ్వాలన్నా ఏం లేదు.తన షాపును చూసుకుంటూ నారయణంమ్మ ,అటూ ఎస్టీడీ బూత్ ని చూసుకుంటూ శోభ, పనికి వెళ్తూ మల్లేశం లు  జీవనం సాగిస్తున్న తరుణంలో శోభ గర్భవతి అని తెలిసి తల్లి,భర్త ఇద్దరి ఆనందానికి అవధులు లేవు.శోభను చాలా బాగా చూసుకుంటున్నాడు మల్లేశం,తన భర్త తనను ఇంత బాగా చూసుకోవడం చూసి శోభ మురిసిపోయేది.

 

ఇక భార్యని ఇంట్లో పని కూడా  చెయ్యనివ్వకుండా ఎత్తేత్తు మాణిక్యం లా చూసుకుంటూ,పళ్ళు,మందులు ఇప్పిస్తూ,మంచి కొడుకుని కానాలని చెప్తూ ఉండేవాడు.శోభను నెలలు నిండి,కన్పయ్యే రోజు వచ్చింది.అయితే మళ్ళీ ఏదైనా సమస్య వసై కష్టం అని భావించిన మల్లేశం ఒక రోజు ముందుగానే శోభను ఆసుపత్రిలో అడ్మిట్ చేసాడు.తల్లి కూడా వెంటే వుండి కూతురుకు ధైర్యం చెప్పసాగింది.

 

నొప్పులు మొదలయ్యాయి.శోభ కు చుక్కలు కనిపించసాగాయి.భయంతో బిగుసుకు పోయింది.నొప్పులు తియ్యలేక పోతుంది,శక్తి చాలడం లేదు.లేడీ డాక్టర్ శత విధాలా ప్రయత్నం చేయాసాగింది.కానీ శోభ సహకరించలేక పోతుంది.అసలే మొదటి కానుపు తల్లి ఎంత ధైర్యం చెప్పినా,తనకు ఉండే భయం తనకు ఉంది.అసలు ఆమెకు శక్తి లేకుండా పొతోంది,ఎంతగా అనుకున్న నొప్పులు తియ్యలేక పోతుంది,

 

రెండు గంటలు ప్రయత్నాలు చేసినా,అరిచి,అరిచి సృహ తప్పి పోయింది శోభ,నార్మల్ డెలివరీ కావాల్సిన పిల్ల ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా సృహ తప్పి పడిపోతే ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం అని వెంటనే ఆపరేషన్ చేయాలని అనుకుని,అదే మాటను మల్లెషం కి, నారాయణమ్మ ఇద్దరికి చెప్పింది,కూతురు అలా కావడంతో తల్లి మనసు ద్రవించి,నాకు నా కూతురు బతికిస్తే చాలమ్మా,దాన్ని బతికించు అని బతిమలింది డాక్టర్ ని,

 

మలేశం కి కూడా అంత కొత్తే కాబట్టి తన ఉద్దేశ్యం కూడా అదే అన్నట్టుగా మొహాన్ని పెట్టాడు.డాక్టర్ గారు నా ప్రయత్నం నేను చేస్తా అని అంటూ కాగితాల మీద సంతకాలు తీసుకుని,ఆపరేషన్ చేసింది,కానీ కడుపులో పిల్లాడు అప్పటికే ఉమ్మ నీరు మింగేసాడు,అది అతని మెదడు లోకి వెళ్లి మెదడు లోని నరాలు కొంచం దెబ్బతిన్నాయి లేత నరాలు అంత ఉమ్మ నీరు తాకిడికి తట్టుకోలేక పోయింది.

 

చిన్ని మెదడు,పుట్టిన పిల్లాడు ఏడవలేదు దాంతో కాళ్ళు పైకి,తలా కిందకు చేసి ఉమ్మ నీరు కక్కించారు,వీపు మీద కొట్టారు,నీరు పోవడం తో బాబు ఏడ్చాడు,కానీ బరువు కూడా తక్కువ,దానికి తోడు జాండిస్ కూడా ఉండడం తో రెండు రోజులు అబ్జెర్వ్ వేషన్ లో పెట్టరు,శోభ కూడా బాగా నీరసించి పోయింది,

 

ఎలాగైతేనెం తల్లి పిల్లాడు క్షేమంగా ఉన్నారని  సంతోషించారు నరాయనమ్మా ,మల్లేశంలు.శోభ క్షేమంగా ఇంటికి తిరిగొచ్చింది కానీ  ఆసుపత్రి నుండి వచ్చేటప్పుడు డాక్టర్ గారు మల్లెశాన్నీ పిలిచి ,చూడు బాబు మీ అబ్బాయి బాగా ఉమ్మ నీరు తాగడం వలలు మెదడుకు చేరి మెదడు లోని నరాలు దెబ్బతిన్నాయి.పెరిగెటప్పుడు అవి సరి కావచ్చు,లేదా కాకపోవచ్చు,దాని వల్ల బాబు ఎదుగుదల లోపం రావచ్చు.

 

మిగతా అన్ని విషయంలో అంతా బాగానే ఉంది.కాస్త మందులు అవి వాడండి,అని చెప్పి పంపింది.అప్పటి నుండి మల్లేశం తీరులో మార్పు రాసాగింది.శోభను పిల్లాన్ని సరిగ్గా చేసుకోక పోవడం,ఇంటికి లేట్ గా రావడం శోభ ఏదైనా అడిగితే  పెడరసంగా సమాధానం ఇవ్వడo చేస్తున్నాడు.

 

శోభకు అదే చాలా విచిత్రంగా ఉంది.బాబు పుట్తక ముందు ఎన్నో కబుర్లు చెప్పిన  మల్లేశం,ఇప్పుడు అసలు ఏమి మాట్లాడక పోవడం,తిరిగి ఎదో కారణం తో తనను తిట్టడం , బాబు ను  ఎత్తుకోకపోవడం వంటివి  చేస్తున్నాడని తల్లికి చెప్పుకొని బాధపడింది. అయితే నారాయణమ్మ తొందరపడకుoడా కూతుర్ని ఓదార్చి బారసాల అయ్యాక పంచాయతీ పెట్టించాలని అనుకుంది.

 

వీళ్ళు ఇలా అనుకునే నాటికి మల్లేశం ఒక ప్రైవేటు కంపెనీలో ఆఫీస్ బాయ్ గా ఉద్యోగం చేసేవాడు. అక్కడ వరమ్మ అనే ఆవిడ కూడా ఊడవడానికి   తుడవటానికి వచ్చేది. మల్లేషానికి వరమ్మ మీద అంతకుముందు ఏ అభిప్రాయం లేదు.కానీ భార్య ఎప్పుడైతే లోపం గల పిల్లాన్ని కని అప్పటినుండి తన బాధ ఎవరికైనా చెప్పుకుని సేద తీరాలి అనుకున్నాడు. అప్పుడు అతని కళ్ళకు వరమ్మ దేవతలా కనిపించింది.

 

మల్లేశం విచారంగా ఉండడం చూసి ఏమైంది అని అడిగింది మల్లేశం ఆమెకు ఉన్న విషయం చెప్పాడు  వరమ్మ లౌక్యంగా ఆలోచించి తన సానుభూతిని  తెలిపి అక్కున చేర్చుకుని గుండెల్లో పెట్టుకుని ఓదార్చి చింది. అక్కడున్న సుఖాన్ని వదలని మల్లేశం ఇంటికి చేరాడు ఇక దాదాపుగా పట్టించుకోకుండా ఆఫీసులో పని ఎక్కువగా ఉందని చెప్పసాగాడు బారసాల కు కూడా ఇలా వచ్చి అలా వెళ్ళి పోయాడు మల్లేశం.

 

అది గమనించిన నారాయణమ్మ అల్లుడు తీరును అనుమానించి అతని వెంట వేరేవాళ్లను పంపింది చూసి రమ్మని వాళ్ళు ఇచ్చిన సమాచారంతో తల్లీకూతుళ్లు  మెదళ్ళు మొద్దు మారిపోయాయి అతను వరమ్మ ఉంచుకున్న సంగతి అంతా బస్తీలో తెలిసిపోయింది. బారసాల అయిపోయిన మూడోరోజు పెద్దలకు చెప్పి  పంచాయతీ పెట్టించింది అది తెలిసి మల్లేశం చిందులు తొక్కుతూ వచ్చి నా పెళ్ళామే  ఏమీ అడగలేదు నువ్వు నన్ను  ఏందినేను అడిగేది అని అన్నాడు .

 

పెద్దలు ఆమె తల్లిగా బాధ్యత వహించి పిలిచింది నువ్వేం చెప్పుకుంటావో  చెప్పుకో అని అన్నారు దాంతో మల్లేశం తెగించి ఇంతవరకు వచ్చిన తరువాత ఇక ఆగేది ఏముంది  మాకు సంబంధం ఉన్నమాట వాస్తవమే నేను దాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు మరి శోభ పరిస్థితి ఏంటి అని అడిగారు పెద్దలు.

 

అది నా పెళ్ళాం కాదు ఎప్పుడు అయితే ఆ మందబుద్ది పోరన్ని కన్నదో అప్పుడే నాకు దానికి విడాకులు అయినట్టే అని అన్నాడు. ఎవరు మందమతి ఏం మాట్లాడుతున్నావ్ అని అడిగారు పెద్దలు అప్పుడు డాక్టర్ చెప్పిన విషయం బయట పెట్టాడు మల్లేశం.

 

అది విన్నవాళ్ళు బాగానే ఉంది పుట్టిన పిల్లోడు అట్టా అయిపోతాడని ఆ తల్లి  ఏమన్నా కలగన్నదా యమ యాతన పడి కన్నది నువ్వు చెప్పేదాకా  ఆ పిల్లోడు వెర్రి పిల్లోడు అని ఎవరికీ తెల్వలే, అయినా ఇదెంది ఇద్దరు కలిసి కన్న బిడ్డనే నా యే,మరి ఆమెను వదిలేస్తే ఎట్లా నిన్ను అది వదిలేయాలి కదా అని నువు అట్లనే ఉన్నావు కాబట్టి ఏమీ అవుతుంది తొలి సంతానం సాదుకొని సంసారం చేసుకోండి బిడ్డా, ఇది పద్దతి కాదు బిడ్డా అని అన్నారంతా,

 

దానికి మల్లేశం నేను ఇట్లా ఉన్నా అనే మంచి పిల్లను చేసుకుంటే మంచి పిల్లలు పుడతారు అని అనుకున్న కాని మళ్ళ అట్లనే పుడితే ఏం సాదుత,నాకు వచ్చే జీతం తిననికే సాలది అయితే ఆ పోరన్ని ఎక్కడైనా వదిలేసి వస్తె ఇద్దర్ని ఉంచుకుంటా  అన్నాడు మల్లేశం,

 

దానికి శోభ అంత కష్టపడి కన్నది వదిలిపెట్టాడానికి కాదు నేను వదలను అని అంది పిల్లాణ్ణి గుండెలకు హత్తుకుని,అయితే ఇది నా కొద్దీ అన్నాడు మల్లేశం,ఎలా అనకు మంచివడివి అనింపిల్లను ఇస్తే ఇట్లా చేస్తావా,నా బిడ్డ గొంతు కొస్తావా,

 

నువ్వు కూడా వైకల్యం ఉన్నవాడివే కదా నిన్ను కుడా మీ తల్లిదండ్రులు వదిలేస్తే ఇలా ఉండే వాడివా,నీ బిడ్డను నువ్వు చూసుకోలేవా నీ బిడ్డను నువ్వే తీసుకుని పో,నా బిడ్డకు నేను మళ్ళీ మారు మనువు చేస్తా,అంతా నా బిడ్డ తప్పె అన్నట్టుగా మాట్లాడుతున్నావు, అంది నారాయణమ్మ ఆ చేసుకో నాదేం ఉంది అని అనగానే

 

ఎవరూ లేని వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటున్నావు ఏమో నా బిడ్డ నీకు అవసరం లేనప్పుడు నీ బిడ్డా మాకు అవసరం లేదంటూ శోభ చేతిలో ఉన్న బిడ్డను తీసి మల్లేశం చేతిలో పెట్టేసి,అయ్యా వచ్చినందుకు అందరికి దండం,ఇక ఈ మనిషికి ,ఆ బిడ్డకు మాకు ఏ సంభంధం లేదు.విడాకులు కూడా జల్దె తీసుకుంటా,చూసారు  కదా నా బిడ్డను ఒక  పిల్లతల్లి  మీ ఏరికలో మంచి సంభంధం ఉంటే చూడండి కానీ ఆ సంభంధం లో ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అని చెప్పి అందరికి దండం పెడుతూ శోభ చెయ్యి పట్టుకుని ముందుకు కదిలింది.అందరూ వెళ్లిన ఆ పంచాయితీ లో దోషిలా నిలబడ్డాడు మల్లేశం.

 

ఇక్కడ తప్పు ఎవరిది ,తన తప్పు ఏం లేకపోయినా అందరి ముందు దోషిలా తలొంచుకున్న శోభ ఏం తప్పు చేసింది.కూతురికి ఆ మొగుడు వద్దని తీసుకెళ్ళున నారాయణమ్మ చేసింది  ఒప్పా తాను వికలాంగుడిని కాబట్టి తన పిల్లలు మంచిగా పుట్టాలనుకున్న మల్లేశం ది తప్పా, ?

 

పెళ్లి అయ్యి ఒక బిడ్డకు తండ్రి అని తెల్సికూడా మల్లెషాన్ని చేరదీసిన వరమ్మ ది తప్పా, తల్లి చెప్పగానే బిడ్డను వదిలేసి వెళ్ళిన  శోభా ది తప్పా,అల్లున్ని ఎలాగో మంచి చెసుకోకుండా ఆవేశంలో భార్య భర్తలను విడదీసిన నారాయణామ్మ ది తప్పా,,?

 

ఒకవేళ అల్లున్ని మార్చాలని అత్త ప్రయత్నిస్తే అల్లుడు మారెవాడా ,వరాలు అతన్ని వదిలేసేదా, ఈ ప్రశ్నలకు సమాధానాలు మీ సమీక్ష రూపంలో ఇవ్వండి… (ఇది ఒక నిజమైన సంఘటనకు అక్షర రూపం,ఆమె పోలీసు కేస్ పెట్టింది కానీ ఆమెకు ఎవరైనా అండగా ఉంటే ,ఇలా చేస్తే అతని పరిస్థితి ఏంటని ఊహించి రాసిన కథ ..

 

అయితే ముగింపు  ఎంత ఆలోచించినా అతనికి బుధ్ధి రావడం అన్నది రొటీన్ కాబట్టి మీరు కూడా మీ ఆలోచనలు పంచుకుని,ఇది చదివిన మీ ఆలోచనా సరళి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని  మిమ్మల్ని అడుగుతున్న సమీక్ష రూపంలో తెలియ చేయండి..

 

నా ముగింపు అదే బిడ్డను వదిలేసి తల్లి వెళ్లిపోవడం కొంచం కఠినం అయినా కథకు తప్ప లేదు..కాస్త వెరైటీ గా ఉండాలని ….

Related Posts