తప్పు

 

మేము కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి మంచి రోజు చూసి గృహ ప్రవేశం చేద్దాం అనుకుని ,మంచి ముహూర్తం కోసం చూస్తున్నాం.ఆ ఇల్లు కట్టుకోవడానికి మేము చాలా కష్ట పడ్డాము.రూపాయి రూపాయి కూడబెట్టి,ఒక్క పూట తిని,ఒక పూటతినక,కూలిలకు డబ్బులు అవుతాయి అని వారిని పెట్టుకోక ,మేమే మట్టి,ఇసక అన్ని మోసి మరి కట్టుకున్నాము.అంతా మేము అనుకున్న సమయానికి,మేము అనుకున్న బడ్జెట్ లో పని అంతా అయిపోయింది.మాకు చాలా ఆనందం కలిగింది.

ఇక గృహ ప్రవేశానికి ఎవరెవర్ని పిలవాలి అని తెలియక,ఏ వంటలు చేయాలో,ఏమేమి సామాను కావాలో తెలియక,ఇలాంటి విషయాల్లో ఆరితేరిన మా చిన్నామ్మ ని పిలిచాను సహాయం కోసం,నేను పిలవగానే రాను అని అనకుండా వెంటనే వచ్చింది,నాకు అన్ని పనుల్లోనూ,సామాను సర్దడం లోనూ,కొత్త ఇంట్లో ఏ ఏ వస్తువులు ఉండాలో అనే విషయంలో  కూడా ఏంతో సహాయం చేసింది,.నిజం చెప్పాలి అంటే ఆమె మిద అదంతా వదిలి నేను నిశ్చింతగా ఉన్నాను అని చెప్పవచ్చు.

ఆమె మా అమ్మకు తోడబుట్టిన చెల్లి ,కావడంతో ఆమె అంటే ఉన్న నమ్మకం తో,నేను ఇల్లు,డబ్బుని అంతా తనకే అప్పగించి,నేను అందర్నీ పిలవడం కోసం,వారికీ పెట్టె బట్టలను తేవడం,అలాగే వంట వాళ్ళని మాట్లాడ్డం,కూరగాయలు తేవడం వంటివి చేయడం లో బిజీ అయ్యాను నేను,మా వారు ఇంటికి ఇంకా మిగిలిన పని ని చేయించడం,నిళ్ళ గురించి,మేస్త్రి కి డబ్బులు ఇవ్వడానికి,ఫంక్షన్ కి కావాల్సిన డబ్బు కొంచం తక్కువ కావడం తో ఒక స్నేహితుడి దగ్గర అప్పుగా తేవడానికి వెళ్ళారు.

నేను మా పిన్నిని ఇంట్లో ఉంచి,మిగతా పనులన్నీ చేసుకున్నాను,నేను అలా పని మిద బయటకు వెళ్తే పాపం పిన్ని తనకు తోచిన విధంగా వంట, టిఫిన్ చేసి,పిల్లలను స్కూల్ కూ పంపి,నేను అలసిపోయి వెళ్లేసరికి నాకు చల్లని నిల్లు ఇచ్చి,కడుపు నింపేది.మా ఇల్లే ,నా డబ్బే అయినా అలా అలసిపోయి వస్తే చేసి పెట్టాడానికి కూడా ఎవరైనా ఉండాలి కదా అని అనిపించింది నాకు.నిజమే కదా మా అమ్మ గారు ఉన్నా నాకు అలా చేసి పెట్టెది కాదు కావచ్చు,ఆ కృతజ్ఞత నాకు చాలా ఉంది.పాపం ఆమె ఇల్లుని,పిల్లలని,బాబాయిని వదిలేసి మరి ఇలా ఇక్కడ నాతో ఉండిపోయింది అని మా వారి కి  కూడా ఆవిడ అంటే చాలా అభిమానం కలిగింది.

సరే ఫంక్షన్ కూడా దగ్గరకు వచ్చింది మా వారు తెచ్చిన డబ్బు,ఇంట్లో ఉన్నడబ్బును కూడా ఆవిడా దగ్గరే పెట్టాము జాగ్రత్త కోసం,ఫంక్షన్ కూ అందర్నీపిలిచాను, దగ్గరి వాళ్ళను,స్నేహితులను, తెలిసిన వారిని అందర్నీ,అమ్మా వాళ్ళని,తమ్ముళ్ళని అందరూ వచ్చారు.మా ఇన్నేళ్ళ కల సొంత ఇల్లు అది తిరినందుకు,దాని కోసం మేము పడిన కష్టాన్ని అందరూ పొగుడుతూ ఉంటె నాకు ఎంతో తృప్తిగా అనిపించింది.

ఫంక్షన్ చాలా బాగా జరిగింది,చేసిన వంటలు కూడా బాగున్నాయి అని అందరూ మెచ్చుకున్నారు,పుట్టింటి వాళ్ళు మాకు బట్టలు పెట్టారు,మేము వారికీ పెట్టాము,అంతా ఇంటికి కావాల్సిన వస్తువులు గిఫ్ట్ లుగా ఇచ్చారు, అంతా వెళ్ళాక గిఫ్టులని చూసుకున్నాం,నేను పిన్ని,మా వారు ఆ రాత్రి బాబాయి రమ్మని అనడం తో మా పిన్ని నేను వెళ్తున్నా అని అంటూ బీరువా తాళాలు నాకు అప్పగించి హడావుడిగా వెళ్ళి పోయింది.

పాపం ఆవిడా గత పదిహేను రోజుల నుండి ఇక్కడే ఉంది కదా,ఎన్ని రోజులు ఉంటుంది లే అని అనుకుని ,నేను ఏమి అనలేకపోయాను,ఇంకా నయం ఇన్ని రోజులు ఏమి అనని బాబాయికి థాక్స్ చెప్పుకున్నా, ఆవిడా వెళ్ళేటప్పుడు మంచి పట్టుచీర, లాడ్డుల్లంటివి కట్టి ఇచ్చాను,బాబాయికి,పిల్లలకు కూడా బట్టలు పెట్టాను నా సంతోషం కోసం.ఇంకా మా వారు అయితే ఏమైనా డబ్బు కూడా ఇమ్మని అన్నారు,కానీ నేనే డబ్బు ఇస్తే ఆవిడని పనిమనిషి అని భావిoచినట్లు,అవమానించినట్టు అవుతుంది అని ఇవ్వకుండా ప్రేమగా బట్టలు పెట్టి,పంపించాను.

నాలుగు రోజుల తర్వాత మా వారు ఎన్ని డబ్బులు మిగిలాయి అని అడిగారు ,ఎందుకంటే అయన స్నేహితుని దగ్గర తెచ్చిన డబ్బులు ఖర్చు అవ్వకపోతే ఇచ్చేద్దామని అనుకుని నన్ను అడిగారు.నాకు డబ్బు ఎంత మిగిలిందో అని తెలియక బీరువా తెరిచి,డబ్బు లేక్కబెట్టాను,అందులో ఒక ఇరవై వేలు తగ్గినట్టుగా అనిపించాయి.అదే విషయాన్నీ నేను మా ఆయనకు చెప్పాను,అవునా నేను డబ్బు తెచ్చిన తర్వాత నికే ఇచ్చాను,మళ్ళి నేను తీసుకోలేదు అని అన్నాను.అవునండి నేను కూడా మీరు తెచ్చిన తర్వాత పిన్ని కి ఇచ్చి దాచమని అన్నాను,నేను కూడా అందులోంచి ఏమి తియ్యలేదు అని అన్నాను,మరి ఏమైనట్టు పోనీ మీ పిన్ని ఏమైనా అని అన్నారు నా మొహం లోకి చూస్తూ….

ఎంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు ఆవిడకు అంత అవసరం ఏమిటి,అంట ఇల్లు,ఆస్థి పెట్టుకుని ,మనకు సేవ చేసింది.మన ఇంటికి కాపలాగా,మన పిల్లకు వండి పెడుతూ కంటికి రేప్పలా చూసుకున్న ఆమెనే అనుమానిస్తున్నారా అని నేను అయన నోరు మూసాను. పాపం ఆయన ఇక ఏమి అనలేక బయటకి వెళ్ళిపోయారు.ఆయన వెళ్ళాక నేను ఆలోచనలో పడ్డాను,నిజమే అయన అన్నట్టుగా ఆమె తీసి ఉంటె,అవును తీసింది ఏమో అందుకే హడావుడిగా వెళ్లిపోయింది.అయినా డబ్బు ఎవరికీ చేదు,నేను నా దగ్గర ఉన్న డబ్బే నేను వాడను,అయన స్నేహితుడి డబ్బును అసలు ఇద్దరం ముట్టలేదు.

కాబట్టి ఈ హడావుడిలో మేమేమి పట్టించుకోము అని తీసి ఉంటుందేమో,తను పదిహేను రోజులు మా ఇంటికి కాపలా ఉన్నందుకు,మాకు వండి పెట్టినందుకు,తీసుకుందా ,ఇప్పుడు వెళ్ళి అడిగితె ఎలా ఉంటుంది,హమ్మో అడిగితె ఇంకేమైనా ఉందా,నేనేమీ దొంగనా అని అంటుంది. అమ్మకు చేత కాదని ఈవిడని నమ్మి తెచ్చుకుని నేను తప్పు చేసానా,కడుపు కాలు కట్టుకుని,కట్టుకున్న ఇల్లు,మేము డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడ్డామో మాకె తెల్సు, అలనిది అంత డబ్బు ఎలా తీసి ఉంటుంది.వేరొకరి డబ్బును అలా తియ్యడానికి మనసెలా ఒప్పి ఉంటుంది,మనం అలా ఒకరి డబ్బుని తియ్యగలమా,హమ్మో పరాయి సొమ్ము పాము వంటిది ,అలా ఎలా తీస్తాం,బజార్లో రూపాయి దొరికితేనే చుట్టూ చూసి,ఎవరిదో అని ,ఎవరూ లేకపోతేనే కదా తీసుకుంటాం, ఎవరి సంగతి ఏంటో కానీ నేను మాత్రం అలా ముట్టను ఒకరి సొమ్మును,అందుకే నేను ఇల్లు కట్టుకోవడానికి ఇన్నేళ్ళు పట్టింది.

అడగడం వల్ల నాకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది,బoదువుల అందరిలో ఆమె నన్ను పిలిపించుకుని,పని చేయించుకుని,నాకు దొంగతనం అంటగట్టింది అని ఊరంతా  టం టం చేస్తుంది.ఇలా ఆలోచనలో ఉన్న నేను ఆయన వచ్చింది కూడా గమనించలేదు. ఆయన వచ్చి అను జరిగింది ఎదో జరిగి పోయింది,నువ్వు బాధపడి,మమల్ని బాధ పెట్టకు ,అనవసరంగా మనసు పాడు చేసుకోకు,పాపం పెద్దావిడ తెలియక చేసి ఉంటుంది,మా అమ్మే ఇలా చేస్తే నేను ఊరుకునే వాడిని కదా అని నన్ను అనునయించాడు.మేము ఇక ఆ విషయాన్నీ మర్చిపోయి,మా పనిలో పడ్డాము.   

ఒక వారం రోజులకు మా బాబాయికి యాక్సిడెంటు అయినట్టుగా ఫోన్ వచ్చింది మాకు,మేము హడావుడిగా వెళ్ళి అన్ని విధాల సహాయం చేసాము పిన్నికి తోడుగా ఉండి, పది రోజులు ఆసుపత్రిలో ఉన్న బాబాయికి కోలుకున్న తర్వాత   వారిని ఇంట్లో దింపి, వచ్చేటప్పుడు ,పిన్ని కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ “ తప్పు చేశాను రా అంది” నా చేయి పట్టుకుని,నేను ఆవిడ లో జరిగిన” మధనం “కళ్ళలో చూసి, చేయిని తట్టి వదిలేసా ఒదార్చినట్టు…

 

Normal
0

false
false
false

EN-US
X-NONE
HI

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
mso-bidi-font-size:10.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-fareast-font-family:”Times New Roman”;
mso-fareast-theme-font:minor-fareast;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Mangal;
mso-bidi-theme-font:minor-bidi;}

Related Posts