తలచినదే జరిగినదా …

ఏంట్రా బాబు ఇంత లేట్ అవుతుంది అసలు ఈ రోజు అవుతుందా లేదా  వాళ్ళని ఒప్పించిందా ? లేదా ? అసలేం జరిగిందో, ?వాళ్ళ ఇంట్లో, ఆఫీస్ లో వాళ్ళు  ఏమన్నారో, ఏంటో , కనీసం రిప్లై కూడా ఇవ్వడం లేదు. మెసేజ్ చూస్తుంది కానీ అసలు దీన్ని వద్దులే బాబోయ్ నోట్లో బూతులు రాకుండా కాపాడు తండ్రీ అని వెయ్యి దేవుళ్ళకు మొక్కుతూ పార్క్ లో అసహనంగా తిరుగుతూ ఉన్నాడు వరుణ్. ఇంతలోనే ఏంటి సార్ అలా టెన్షన్ పడుతున్నారు అంటూ వచ్చాడు రోజు అతనికి పల్లీలు అమ్మే హుస్సేన్ అడిగాడు.అతని వల్ల హుస్సేన్ కు రోజూ వంద రూపాయల ఆదాయం వస్తుంది కాబట్టి ఆ మాత్రం ఆప్యాయత కురిపించడం లో తప్పులేదు గా.అతని ప్రశ్నకు అసలే కోపంగా ఉన్న వరుణ్ ఆ నా ప్యాలెస్ లో ఉడ్చ డానికి ట్రంప్ వస్తాను అని అంటున్నాడు మరోవైపు నాయుడు గారు బైడన్ వస్తాను అని తెగ అడుగుతున్నారు ఎలా అని నెత్తి కొట్టుకుంటున్న మరీ నువ్వేమైనా సలహా ఇస్తావా అని అడిగాడు వెటకారంగా….

అయ్య బాబోయ్ అలాగే ఇద్దరి తో పాటు మీరు ఓ చెయ్యి వెయ్యండి మరి పని సురుగ్గా అయిపొద్ది అన్నాడు హుస్సేన్ కూడా వెటకారం ధ్వనించే లా దానికి హుస్సేన్ నీ కొరకొరా చూస్తూనే ఇంకా రాని రాణీ నీ తిట్టుకుంటూనే పల్లీలు కొనకపోతే ఇంకేం అంటాడో అనుకుంటూ అంతా టెన్షన్ లోనూ వంద ఇచ్చీ ఇరవై రూపాయలు పల్లీలు తీసుకున్నాడు వరుణ్. చిల్లర ఇవ్వకుండానే రేపిస్తాలే బాబు మీరు మాత్రం వెళ్ళడం మానొద్దు అంటూ  గుండెల్లో గునపాలు  గుచ్చేసి అధ్గది అదేదో ముందే చేయొచ్చుగా బాబు అంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడు హుస్సేన్.

ఇంతలోనే రాణీ వస్తూ కనిపించింది రెండుగంటలు గా ఎదురుచూస్తుంటే ఇప్పుడు నిదానంగా నడిచి వస్తున్న రాణి ని చూడగానే కోపం కట్టలు తెంచుకుంది అయినా సరే దాన్ని చూపిస్తే తనని ఉతికి ఆరేసి ఎండ గడుతుందని గుర్తొచ్చి కోపాన్ని బయట పెట్టకుండా ప్రేమగా దగ్గరికి వెళ్తూ ఎంటమ్మ తొందరగానే వచ్చావు అన్నాడు నవ్వుతూ, మొహమంతా పళ్ళు చేసుకుంటూ దానికి రాణి అతన్ని కిందనుండి పైకి ఒకసారి చూసి ఏంటి క్లాస్ పీకుతున్నావు జాగ్రత్త అంటూ వేలు చూపించేసరికి అయ్యో అది కాదు బంగారం నిజంగానే అంటున్నా ఇంకాస్త లేట్ అవుతుందేమో అనుకున్నా నీకు క్లాస్ పికడానికి నాకు ధైర్యం ఎక్కడిది .అవును కానీ అసలు సంగతి చెప్పు తొందరగా అన్నాడు వరుణ్..

లేదు వరుణ్ ఒప్పుకోలేదు అలాంటివి కుదరదు అన్నారు అంది రాణి పల్లిల్లు నములుతూ ఏంటి నువ్వు చెప్పేది కుదరదు అన్నారా నేను ఎంత హోప్ పెట్టుకున్నా తెలుసా అసలు అందుకే ఇన్ని రోజులు ఆగింది కూడా నేను అడిగితే కాదన్నారు అనేగా నిన్ను పంపింది అయినా నువ్వేదో పొడిచి వస్తావని పంపితే ఇలా నీరసంగా వచ్చావు అన్నాడు వరుణ్ .ఆ మాటతో తిక్కరెగిన రాణీ ఓయ్ ఏంటి ఊరుకుంటే మరి రెచ్చిపోతున్నారు అదేదో మీ తాత ఆస్థి అన్నట్టుగా ఇవ్వండి అంటే ఇవ్వడానికి వాళ్ళు ఏమైనా పిచ్చి వాళ్ళ ఏంటి అయినా ఈ వింత కోరిక ఏంటో అసలు ఎవరైనా ఇలాంటి కోరిక కొరతారా దీన్ని మీడియాలో పెడితే వైరల్ అవుతుంది తెలుసా మీ పిచ్చి కోరికలకు అంతు అదుపు లేకుండా పోతుంది అంటూ లెఫ్ట్ రైట్ తీసుకుంది రాణి..

ఏయ్ ఏంటి నావి వింత కోరికల సోషల్ మీడియా లో పెడతావా వద్దు బాబోయ్, అయినా నావి పిచ్చికొరికలు ఏంటి క్రికెట్ అంటే పిచ్చి కాబట్టి ఆ గ్రౌండ్ లో పెళ్లి చేసుకోవడం ఇదిగో రోజులో చాలా భాగం ఆఫీస్ లో ఉండడం వల్ల ఆఫీస్ లో శోభనం జరుపు కోవడం పెద్ద వింతేంటి చాలా మంది చేయడం లేదా ఎన్నో రకాలుగా చేస్తున్నారు.చేసుకుంటున్నారు అన్నాడు వరుణ్ ఉక్రోషంగా ..చేసుకుంటున్నారు అండి కానీ ఇలా వింతగా ఆఫీస్ లో శోభనం మాత్రం ఎవరూ చేసుకోరు ఖర్మ అంటూ నుదురు కొట్టుకుని గ్రౌండ్ లో పెళ్లి అంటే ఎలాగో కష్టాలు పడి డబ్బు కట్టి మా నాన్న గారు ఎలాగో చేశారు ప్రేమపెళ్లి అయినా ..

ఇక శోభనం మాత్రం ఆఫీస్ లో కుదరదు అంటే కుదరదు అంటున్నారు వాళ్ళని ఒప్పించడానికి ఆర్నెల్లు గా ట్రై చేస్తున్నా వాళ్ళు ఒప్పుకోవడం లేదు ఆర్నెల్లు అయినా ఇంకా కన్యగనే ఉండాల్సి వస్తోంది అంటూ మూతి తిప్పింది రాణి. అబ్బా రాణి అది అలాగే ఉండు అంటూ ఫోన్ తీసి సెల్పీ దిగాడు అతనికి తెలుసు రాణి బలహీనతలు ఏమిటో దాంతో కూల్ అయినా రాణి నవ్వుతూ ఫోటో కి పోజ్ ఇచ్చింది. అదయ్యకా మరి ఇప్పుడెలా అన్నాడు వరుణ్ దిగులుగా మొహం పెడుతూ ఇక ఈ జీవితానికి శోభనం కాకుండా పెళ్లి అయినా బ్రహ్మ చారి, బ్రహ్మ చారిని లా ఉండాలా అన్నాడు రాణి ఒళ్లో తలదాచుకుంటూ…

ఇంతలోనే రాణి నవ్వుతూ తన బాగ్ లోంచి తాళాలు తీసి అతని కళ్ళ ముందు ఊపింది దాంతో వరుణ్ కలల లోగిళ్ళు, అలాగే మొహం కూడా వెలిగిపోయింది మతాబులా దొంగ అయితే సాధించావన్నమాట ఎంతైనా ఆడవాళ్ళు ఏదైనా సాధించగలరు అని నిరూపించారు. అంటూ తనని హత్తుకున్నాడు.. తను ఎంత కష్టపడి  ఆ  పని చేసిందో,ఎంత లంచం ఇచ్చిందో గుర్తొచ్చి మనసు మూలిగింది. అయినా ఒక్కసారి గోబణం అయ్యాక ఆయన తన చేతిలో బొమ్మ కదా అని సంతృప్తి పడిపోయింది అతని దగ్గర నుండి తాను ఇచ్చిన లంచాన్ని  ఎలా వసూలు చేయాలో ఆలోచిస్తూ ఉహల్లోకి జారిపోయారు ఇద్దరూ…

Related Posts