తిరుమల గీతావళి
పల్లవి
కాలమే బాధించ
నిను చూడరాలేము
మన్నించవయ్యా..మా శ్రీనివాసా..
నిను కొలుచువారికి అండగా ఉండి ఆదుకోవయ్యా..ఆనందనిలయా..
చరణం
ఏడుకొండలు మాకు వైకుంఠమయ్యా
నీ దర్శనము మాకు కలగదేమయ్యా
నిను వీడి మేముఉండలేమయ్యా
కరుణించి మమ్ము దయచూడవయ్యా
చరణం
నీ నెలవు మాకు పండువెన్నెలగా
పలుకు తేనెలమాట నీ నామమయ్యా
నిదురించినా మేము నిను మరువమయ్యా
నీ నీడలోనే ఉంటాము మేము
చరణం
నిను చూడరాలేని భక్తులందరు కలిసి
గోవింద నామమును
తలపు చేసితిరయ్యా
నీ నవ్వు మాకు వర్షమై కురవగా
అన్ని మరిచితిమయ్యా..ఇది సత్యమయ్యా
కలియుగమునందున గోవిందుడొకడే
దరిచేర్చువాడు..ముక్తినిచ్చెడివాడు..
సి.యస్.రాంబాబు