తిరుమల గీతావళి
పల్లవి
గోవిందాయని పలికితిమంటే
ఓటమి మనకు ఉండదులెండి
శ్రీనివాసుని తలిచితిమంటే
అన్నీ శుభములు కలుగునులెండి
చరణం
కలియుగం దైవం శ్రీవెంకటేశ్వరుడు
వెంటేఉండి రక్షించునుగా
కోరిన కోర్కెలు తీర్చెడివాడు
ఆపదయందు కాపాడువాడు
చరణం
కాలహరణము చేయక మనము
స్వామిని నిత్యము కొలిచెదమండీ
కొలువై ఉండీ కాపాడు స్వామికి
ఏమిచ్చి తీరును ఋణము మనకు
చరణం
చల్లని స్వామి చిరునవ్వొకటే
మనలను రక్షించు మంత్రముగా/కదా
ఆనందనిలయుడు శ్రీనివాసుడు
మన గుండెలలో స్థిరనివాసుడు
చరణం
శ్రీదేవి భూదేవి దేవేరిలతో
చల్లగచూచును వడ్డికాసులవాడు
ఏడుకొండలు ఎక్కితిమంటే
తన చల్లనిచూపు పొందెదమండీ
సి.యస్.రాంబాబు