తిరుమల భక్తులకు టీటీడీ పాలక మండలి బిగ్‌ షాక్‌

తిరుమల భక్తులకు టీటీడీ పాలక మండలి బిగ్‌ షాక్‌ ఇచ్చింది.

ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ ప్రయాణాన్ని వారం రోజులు పాటు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూన్నామని… టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటన చేశారు.

దర్శన టిక్కెట్లు రీ షేడ్యూల్ చేసుకునే వెసులుబాటును త్వరలోనే కల్పిస్తామని హామీ ఇచ్చారు.

 

Image

 

20 సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా తిరుమలలో గత 15 రోజులుగా వర్షాలు కురిసాయని.. కొండ చరియలు విరిగిపడడంతో నాలుగు ప్రాంతాలలో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ఆయన వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించేందుకు డిల్లి నుంచి ఐఐటి నిపుణులును రప్పిస్తున్నామని స్ఫష్టం చేశారు.

ఇటు వంటి ఘటనలు పునరావృతం కాకూండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే రెండో ఘాట్ రోడ్డులో మరమత్తు పనులుకు సమయం పట్టే అవకాశం వుందన్నారు. ప్రస్తుతం మొదటి ఘాట్ రోడ్డులోనే వాహన రాకపోకలుకు అనుమతిస్తామని వెల్లడించారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.

Related Posts

Leave a Reply

Your email address will not be published.