తీవ్రవాదులను ఏరివేయాలి

అక్షర కొరకు
అంశం : తీవ్రవాదం
శీర్షిక : తీవ్రవాదులను ఏరివేయాలి,,,,,,!!

తెగబలిసిన ధనికులు
మరోవ్యాపకం కనబడక
మత చాందసత్వంతో
దేశాల ఉనికికే పెనుప్రమాదంగా
దేశంలోనే అంతర్గత భద్రతకు ముప్పుగా
మనుషుల మాన ప్రాణాలను హరిస్తూ
సిగ్గులేకుండా ఇది చేసింది మేమే అని ప్రకటించడం కడు హేయం,,,,,,,
డబ్బున్న కిరాతకులు కిరాయి గూండాలకు మతం మత్తు నూరిపోస్తున్నారు,,,,,,,
వివిధ దేశాలలో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలను అతి రహస్యంగా పంపిణీ చేస్తూ జాతిని నిర్వీర్యం చేస్తున్నారు,,,,,,,
పైపెచ్చు ఉగ్రదాడుల్లో ప్రార్థనా స్థలాలలో మనుషుల ప్రాణాలను ఈగల్లా నలిపేస్తున్నారు,,,,,,,
ఏ మతమైనా విశ్వశాంతినే కోరుతుంది తప్ప ప్రాణాలను కాదు,,,,,,
ధనమదాంధులు కిరాతక రాజకీయాలు తమ ఉనికి కోసం అమాయక ప్రజలను పొట్టన బెట్టుకుంటున్నారు,,,,,,,
దళారీ దేశాలలో మానవత్వం కొరవడిన బహుముఖ నేరగాళ్లు తమ దేశాల్లోనే అల్లకల్లోలం సృష్టిస్తూ ప్రభుత్వాలు నిలబడలేని పరిస్థితి,,,,,,,,,
మనిషిని మనిషి చంపుకోవడ మేందిరా బేవకూఫ్,,,,,,,
తిన్నది అరగక అగ్రదేశాధినేతలు సైతం తమప్రాభల్యము చాటుకోవడమే లక్ష్యంగా దేశాలలో యుద్ధబీభత్సం సృష్టిస్తున్నారు,,,,,,,,
ఈ మారణహోమంలో సామాన్య ప్రజలు జీవనం సాగించలేని పరిస్థితి,,,,,,,,,
ఈ తీవ్రవాదులను అతిరహస్య గూఢచర్యంతో ఎక్కడికక్కడ ఏరిపారేయడమే ఉత్తమం,,,,,,,
మనం మనుషులం రాక్షసులం కాదు, కాస్త మానవత్వంతో ఆలోచించు మనిషిని మనిషి చంపొచ్చార లుచ్చా,,,,,,

అపరాజిత్
సూర్యాపేట
హామీపత్రం : ఈ కవిత నా కలం సేతయని నా హామీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *