తృప్తిగా

 

సావిత్రి వయస్సు ఎనబై ఏళ్ళు ..కొడుకులు,కోడళ్ళ ,మనవళ్ళు,మనవరాళ్ళు తో చాలా బాగా ఆడుకుంటూ, కోడళ్ళ తో సేవలు చేయించుకుంటూ ఉంది.ఆమె వయసులో ఉన్నాప్పుడు చాలా కష్టాలు పడి,చాలా మంచిగా పిల్లలకు చ దువులు చెప్పించి ,అందరిని ఒక స్థాయిలో ఉండేలా చేసింది సావిత్రమ్మ..

అయితే చిన్న తనం లోనే భర్త చనిపోవడం, పిల్లలను పెంచే బాధ్యత తన నెత్తి మిద పడడం వల్ల తన కోరికలు ఏవి తిర్చుకోకుండా,వారికి అన్ని విధాలా చూసుకోవడం కోసం,చిన్న చిన్న కోరికలను అన్నిటిని పక్కకు పెట్టి,వారిని తీర్చి దిద్దడానికి కృషి చేసింది సావిత్రి..వారిని పెంచి పెద్ద చేయడం తో సావిత్రి కాస్త సావిత్రమ్మలా మారిపోయింది…

అలంటి సావిత్రమ్మ తన బాధ్యతలు తీరడం తోనూ ,వయస్సు మిద పడడం తోనూ,చావుకు దగ్గరగా వచ్చింది.ఒక నాడు బాత్రూం లో జారి పడిన సావిత్రమ్మ మళ్ళి లేవలేక పొయింది.అలా అని ఎవరితోనూ చేయించుకునే ఉద్దేశం కూడా ఆమెకి లేదు.కానీ కాలు,నోరు,నడుము లేవలేక అలాగే మంచానికి పరిమితం అయ్యింది.అలా అని చనిపోవడానికి ఆమెకున్న ఎదో ఒక బలమైన కోరిక ఆపుతూ ఉంది. ఆమెకి చాలా మంచి వైద్యం అందిన్స్తున్నా ఆమె కోలుకోలేక పొయింది,ఎదో చెప్పాలనే ఉంది కానీ చెప్పలేక పోతుంది..

ఎంతో మంది మంచి డాక్టర్లు వచ్చి వైద్యం చేసినా ఆమె కు ఏం కావాలో మాత్రం తెలుసుకోలేక పోతున్నారు.కొడుకులు తమ తల్లి కి ఎదో తీరని కోరిక ఉందని గ్రహించి రకరకాలుగా అడుగుతూ ఉన్నారు.కానీ ఆమె మాత్రం ఏమి చెప్పలేక పోతుంది.పోనీ దేనిమీదా అయినా రాయమని అందామని అనుకున్నా ఆమెకు చదువు రాకపోవడం తో,ఏమి చేయాలో తెలియక అన్ని రకాల పండ్లు,ఆహార పదార్ధాలు అన్ని తెచ్చి పెడుతున్నారు ,కానీ ఆమెకు మాత్రం తృప్తి కలగడం లేదు.

అయితే సావిత్రమ్మ కు ఒక తీరని కోరిక మిగిలి పొయింది.అదేంటి అంటే తను పని చేసేతప్పుడు ఒక హోటల్ ముందు నుండి వెళ్ళేది.ఆ హోటల్ ముందుకు రాగానే లోపలి నుండి ఒక కమ్మని వాసనా,ఘుమాయింపు ఘుమ ఘుమ లు వచ్చి,కడుపులో ఆకలిని పెంచేవి.కానీ అదేంటో మాత్రం ఆమె కి తెలియ లేదు.ఒక రోజు ఆ హోటల్ లో పని చేసే ఒక వ్యక్తి ని అడిగింది సావిత్రి ,ఇలా వాసనా వస్తున్న దాన్ని ఏమంటారు అని ,అదా దాన్ని బిర్యానీ అని అంటారు.దాంట్లో నెయ్యి,మసాలా వస్తువులు వేసి,మటన్  ముక్కలు,కానీ చికెన్ ముక్కలు కానీ,లేదా అవేవి తినని వారికీ కూరగాయలు అన్ని వేసి చేస్తారు. అబ్బో అది తినాలి అంటే పెట్టి పుట్టాలి,అంత బాగా ఉంటుంది ..

ఆ హోటల్ లో పని చేసే నేనే అది తినలేదు ఇప్పటి వరకు ,ఇక నువెం తింటావు అని అంటూ చెప్పి ఆటను వెలి పోయాడు .. ఇక అప్పటి నుండి ఆమె కు ఆ బిర్యానీ తినాలన్నా కోరిక కొండలాగా పెరిగి పోతు వచ్చింది,కానీ బాధ్యతల నడుమ బంది అయిన సావిత్రమ్మ అ కోరిక మాత్రం తిర్చుకోలేక పొయింది.

ఇప్పుడు అంతా ఉండి,అన్ని ఉన్నా,వాళ్ళు ఏమి కావాలని అడుగుతున్నా నోరు తెరిచి చెప్పలేని తన అశక్తత కు దిగులు పడ సాగింది సావిత్రమ్మ,కానీ చెప్పే అవకాశం లేక పొయింది,కొడుక్కు చెప్తే తెచ్చి పెడతాడేమో కానీ అదేంటో చెప్పాలనుకున్నా దాని పేరు ని మర్చిపోయింది.

సావిత్రమ్మకు  ఇలా అయ్యిందని తెల్సి ఆ హోటల్ లో పని చేసే ఆ వ్యక్తి వచ్చాడు ఒక రోజు ఆమె ని చూసి పోవడానికి,అతను రాగానే సావిత్రమ్మ మొహం వెలిగి పొయింది.ఆమె కొడుకు అతని ముందు కుర్చుని బాబాయి,అమ్మ ఎదో చెప్పాలి అని అనుకుంటుంది కానీ మాకు ఆమె చెప్పేది ఏమి అర్ధం కావడం లేదు.కాస్త నువైనా అదేంటో కనుక్కుని చెప్పు బాబాయి,మాకెంతో చేసిన మా అమ్మ చివరి కోరిక ఏంటో మేము తీర్చలేక పోతున్నాము.నీకైనా అర్ధం అవుతుందేమో కాస్త అడిగి చూడు అని బతిమాలాడు కొడుకు….

అయ్యో దానికేం లే నాయనా,నేను కనుక్కుని చెప్తాలే అని సావిత్రమ్మ ముందు కు వంగి,ఏమ్మా సావిత్రమ్మ ఏం కావాలో చెప్పు ,పాపం వాళ్ళు పిల్లలు వాళ్ళని ఎందుకు ఇలా మనోవేదనకు గురి చెయ్యకు,ఏమి కావాలో అడుగు,అవును ఎలా చెప్తావు లే నోరు లేని జివి వి ,సరే నేను నీకు ఒక్కొక్కటి చెప్తా,నీకేం కావాలని ఉందొ నేను చెప్పినప్పుడు నా చెయ్యి పట్టుకో అని అన్నాడు,సావిత్రమ్మ అలాగే అని తల ఉపింది.

అతను ఒక్కొక్క వస్తువు పేరు ,పండ్ల పేర్లు,కూరగాయల పేర్లన్నీ చెప్తున్నాడు,కానీ దేనికి సావిత్రమ్మ స్పందించడం  లేదు. అతను అంతకు ముందు హోటల్ లో పని చేసి ఉండడం తో,హోటల్ లో చేసేవి తినాలని ఉందేమో అని గుర్తొచ్చి,తనకు ఇష్టమైనవి చెప్పసాగాడు,అలా చెప్తూ,చెప్తూ బిర్యానీ దగ్గరకు వచ్చే సరికి సావిత్రమ్మ గట్టిగా అతని చేతిని పట్టుకుంది.

దాంతో మబ్బు విడినట్లు అయిపోయింది కొడుకులకు,బిర్యానీ కావాలాట్రా,అమ్మో సావిత్రమ్మ బిర్యానీ తినాలని మీ చిన్నప్పటి నుండి కోరిక రా పాపం మీ కోసం ఆమె అన్ని చంపుకుంది ,అని చెప్పడం తో,వెంటనే కొడుకులు ఘుమ ఘుమ లాడే బిర్యనిని తెప్పించారు,వేడి వేడి బిర్యానీ ని తన చేతులతో తీసుకుని ఉఫ్,ఉఫ్ అని ఉదుకుంటూ తిన్నది సావిత్రమ్మ తృప్తిగా..……

Normal
0

false
false
false

EN-US
X-NONE
HI

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
mso-bidi-font-size:10.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-fareast-font-family:”Times New Roman”;
mso-fareast-theme-font:minor-fareast;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Mangal;
mso-bidi-theme-font:minor-bidi;}

Related Posts