తెలంగాణాలో ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చేసారు.

తెలంగాణాలో ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చేసారు.
పార్టీలు తమ మానిఫెస్టోను ఓటర్ల ముందు ప్రవేశ పెట్టారు.
ఓటర్లను ఆకర్షించే అనేక కొత్త
పధకాలను ప్రకటించాయి.
పార్టీలు తమ అభ్యర్ధులను
ప్రకటించే పనిలో ఉన్నాయి.
ఆ తర్వాత నామినేషన్ పర్వం
మొదలవుతుంది. ఆ తర్వాత
పోటీలోంచి తప్పుకోవాలి అనుకునే అభ్యర్ధులకు నామినేషన్లు ఉపసంహరణ
గడువు ఇస్తారు. ప్రచారం
ఊపందుకుంటోంది. అధికార,
ప్రతిపక్ష పార్టీలు విమర్శలు,
ప్రతివిమర్శలు చేసుకుంటూ
ఉన్నారు. అలికిడి మొదలైంది.
ఓటర్లను ప్రభావితం చేసేందుకు
ప్రతి పార్టీ తన శక్తికొలది కృషి
చేస్తోంది. ఎలక్షన్ కమిషన్ చాలా పకడ్బందీగా తమ పనులు చేసుకుంటూ పోతోంది.
పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారకుండా గట్టి
చర్యలు చేపడుతోంది. రాజకీయ పక్షాలు తమ
ప్రచారాన్ని ఉధృతం చేసారు.
తాము చేయదలచుకున్న
పనుల గురించి ప్రజలకు
తెలియజేసే పనిలో ఉన్నారు. అందరు ఓటర్లు పోలింగ్ రోజు
పోలింగ్ స్టేషనుకు వచ్చి ఓట్లు
వేస్తే కనుక సమాజంలో గొప్ప
మార్పు వస్తుంది. త్వరలో రాష్ట్రంలో నాయకులు చేసిన ధ్వనికి ఓటర్లు ప్రతిధ్వని వినిపిస్తారు. ప్రజల అలికిడి
నాయకులకు తెలుస్తుంది.

ఈ రచన నా స్వీయ రచన అని
హామీ ఇస్తున్నాను.

వెంకట భానుప్రసాద్ చలసాని.

telugu stories for kids

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *