తెలవారుజామున మా ఊరి సెలయేటి శబ్దాలు…

అంశం : వె . రాత్రులు

పేరు: జంగం నరసింహ.

జోరుగా వీస్తున్న ఈదురు గాలులు..

హోరుమని ప్రవహిస్తున్న సెలయేటి శబ్దాలు…
తెలవారుజామున మా ఊరి కోడి పుంజుల కూతలు…
నిద్ర లేచేసరికి పక్కగా పరిగెడుతున్న జింకలు…
తెలవారేటప్పటికి తల్లిదండ్రులు తమతమ పిల్లలను లేపే విధనాలు..తెలవారి కొన్ని గంటలు అయినా ఆగని మా ఊరి చలిమంటలు…

ఉధయం తొమ్మిధికల్లా తొలిబడిగంట మోతలు…
గుండెలో గుబులు రేపే ఉపాధ్యయుల బోర్డ్ మీధ రాతలు..
మా నొటుపుస్తకంలో మేము వ్రాసే వంకర టింకర గీతలు…
వర్షంలో మేము ఆడిన ఆటలు..మోగెనొయ్ మా వీపు మీధ పిడి గుద్దుల మోతలు…
అన్నం బెల్ కొట్టగానే అడుగులో ఆడుగేస్తూ మా పలకలపై వ్రాసిన ఎక్కాలు…

వెలగ మాను తొరలో పెట్టిన మా పలకలు..అమ్మ వెనకాలగా వచ్చి ఎత్తుకొని ఎగరవేసిన క్షణాలు…
నాన నవ్వుతూ వచ్చి నా చేయి పట్టుకున్న జ్ఞాపకాలు..ఎన్నో వెన్నెల రాత్రిలో మా బహుధా నది లో ఆడి అలసిన కబడ్డీ ఆటలు…..ఇంకా ఎన్నో మధురమైన చిన్న నాటి మధుర శ్రుతు లు …… శుభ రాత్రి మిత్రులు……🙏

ఇది నేను వ్రాసినదే

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *