తెలియదనటంలో తప్పులేదు..

ఈ రోజు అంశం
నాకు తెలియదు

శీర్షిక
తెలియదనటంలో తప్పులేదు.

మనకు అనేక విషయాలు గురించి తెలియదు. మనం అన్ని విషయాల గురించి
తెలుసుకోవాలన్నా అది
కుదరని పని. డాక్టరుకి
మనిషి శరీరానికి సంబంధించి
అన్ని విషయాలు తెలుసు.
సివిల్ ఇంజనీరుకి నిర్మాణ
రంగం గురించి అవగాహన
ఉంటుంది. ఇలా రకరకాల
మనుషులు తమ – తమ రంగాల్లో నిష్ణాతులై ఉంటారు.
వారికి ఇతర రంగాల్లో సరైన
అవగాహన ఉండదు. అయినా
బాధపడవలసిన అవసరం లేదు. నాకు తెలియదు అని
చెప్పటం చెడ్డ విషయం కాదు.
పూర్తి అవగాహన లేనప్పుడు
ఆ పనులు చేయటం సరైన
పని కాదు. ఆ పనులు చేయటం తెలిసినవారిని
అడగటంలో తప్పులేదు.
అన్ని విషయాల గురించి
తెలుసుకోవాలనుకోవడం
మంచిదే కానీ అది మనసు
అవసరం లేదు. మన రంగంలో
మనం అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇతర రంగాల్లో
నిపుణుల సలహాలు తీసుకోండి.

ఈ రచన నా స్వీయ రచన అని
హామీ ఇస్తున్నాను.

వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *