తెలివి తక్కువ దొంగలు
** ** ***
సుదా!ఇలా రావే! ఎప్పుడు నీ పని నీదే కాని నన్నసలు
పట్టించుకోవూ? పిలిచాడు సుద భర్త సురేష్ పిలిచాడు
అనేకంటె అరిచాడనె చెప్పాలి.
ఆఁ….వస్తున్నానండి నాకు పిల్లలకు స్కూల్ కి టైమవుతుందని తెలుసు కదా!
అయినా అరుస్తారు అనుకుంటూ వచ్చింది సుద. నేను
షాప్ ఓపెన్ చేయాలి కదా దేవుడి పూజ చేయాలి ఈ
రోజు వాకిలి ఊడ్చే అవ్వ రాలేదు కాస్త ఊడ్చి పెట్టు నేను
పూజ చేస్తా అన్నాడు సురేష్.
అలాగె అలాగె అనుకుంటూ వచ్చినంత వేగంగా వెనకకు పరిగెత్తింది స్టౌ మీద కూర మాడుతుందని.
సుదకు ముగ్గురు పిల్లలు వాల్లను బడికిపంపి తనూ
బడికి వెల్లాలి మరి అందుకే ఉదయాన్నె ఈ హడావిడి
సుద భర్త పెద్ద బిజ్నెస్ మాన్ ఇంటి ముందు పెద్ద గదిలో
షాప్ గిన్నెలు, బోల్ల బిజినెస్ స్టీలు,ఇత్తడి, రాగి వాటితో తయారయిన అన్ని రకాల పాత్రలు అమ్మడం, పాతవి కొనడం లాంటివి నడిపించె వాడు
పెళ్లిల్ల సీజన్ లో అయితే చాలా బిజీగా ఉండేవాడు.
లాభాలు కూడ చాలానె వచ్చేవి.మాట తీరుతో జనాలను
బోల్తా కొట్టించే వాడు “పావుల ,చారాణ “లాభం ఉంటె నన్ను
చెప్పుతో కొట్టండి అనె పదజాలం వాడుతూ వాల్లు తన
షాప్ లోనె కొనేలా చేసేవాడు.
ఆ విధంగా సంపాదించి ఉన్న ఊర్లోనె రెండు మూడు
ఇల్లులు కొన్నాడు.చాలానె ఆస్థి కూడ సంపాదించాడు.
ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబుతో రోజూ కుస్తీ పడుతూ
సుద కూడ సంపాదిస్తూనె ఉంది.
కాలం ఉరుకుల పరుగులతోనె పనివాల్లను పెట్టుకుని
నడిపిస్తూ తీయగానె గడిచిపోతుంది. పెద్ద పిల్లవాడు
9,మద్య అమ్మాయి 7చిన్నమ్మాయి 5,చదువుతున్నారు
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా!విధి వక్రించింది
దేవుడు వీల్ల ఆన్యోన్య దాంపత్యం చూసి ఈర్ష పడ్డాడేమెా
ఒకరోజు సడన్ గా హార్ట్ ఎటాక్ తో సురేష్ పడిపోయాడు
సుద బడిలోనె ఉంది.
పనివాడు పరిగెత్తిపోయి సుదకు విషయం చెప్పాడు
సుద షాక్ అయి ఉరుకుల పరుగులతో వచ్చి హాస్పిటల్
కి తీసుకెల్లింది . డాక్టరు చూసి చనిపోయాడని నిర్థారించా
రు ఫస్ట్ టైంలోనె కార్డియా కరెస్ట్ అయిందని చెప్పారు.
సుద కుప్పకూలి పోయింది.
బోరుబోరున ఏడ్చింది కాని తనకోసం ఏదీ ఆగదు కదా!
అందరు బందువులు కలిసి కార్యక్రమాలన్ని జరిపించి
సుదకు ధైర్యం చెప్పి వెల్లిపోయారు.
సుద కూడ కొంచెం కొంచెం కోలుకుని పిల్లలకోసం ధైర్యాన్ని
కూడగట్టుకుని ఒంటి చేత్తో పిల్లల బాద్యత స్వీకరించింది
కాని ఇన్ని రోజుల్లా తను బడికెల్లి వచ్చేసరికి ఇంట్లో ఎవరు
ఉండరు సురేష్ ఉన్నప్పుడు ముందు దుకాణం పనివాల్లు
ఉండేది పిల్లలు బడి నుండి తనకన్నా ముందు వచ్చినా
వాల్లే చూసుకునేవాల్లు.
ఇప్పుడు దుకాణం తీసివేసింది తనవల్లకాదని పనివాల్లు లేరు దాంతో పిల్లలను హాస్టల్ లో వేసింది అంతా తారు
మారయ్యింది.
** *** *** ***
ఒంటరి బ్రతుకయ్యింది సుదది రోజు పొద్దున్నె లేవడం
తయారు కావడం బడికి వెల్లి రావడం ఏదో తిన్నాననిపించి పడుకోవడం ఆదివారాలొస్తె పిల్లల
హాస్టల్ లకు వెల్లడం చూసి రావడం జీవితం ఇలాగె
గడిచి పోతుంది.
దుకాణం ఇంట్లోనె ఉంటుంది షట్టర్ మూసేసి దాని
పక్కకున్న చిన్న గేటులోంచి నడుస్తుంది ఆ ఇల్లు
డూప్లెక్స్ హౌజ్ అది పైన కూడ రూములుంటాయి
కాని ఒక్కదానికి ఎందుకవన్ని కిందహాలె సరిపోతుంది
ఎప్పుడన్న పిల్లలు సెలవులకొస్తె తప్ప పైకెల్లడం లేదు
ఇలా ఓ అయిదు సంవత్సరాలు గడిచాయి.
బండ్లు ఓడలయి ఓడలు బండ్లు అయినట్టు ఆస్తి కరిగి
పోతుంది పిల్లల చదువుకు ఇంక పెల్లిల్లు చేయాలి
ఇలాంటి ఆలోచనలతో నిద్ర సరిగా రావడం లేదు
దానికి తోడు వయసవుతుందేమెా చాలా లావయ్యింది.
ఒకరోజు బడి నుండి వచ్చి అన్నం తినేసి పడుకుంది
చలికాలం కావడంతో స్వెటర్ తొడుక్కుని మఫ్లర్ కట్టుకు
ని నిండా కప్పుకుని ఉంది ఆలోచనలతో నిద్ర రావడం
లేదు టైం చూసుకుంటూనె ఉంది మద్యమద్యలో
రెండవుతుంది తను పడుకున్న మంచం పక్కగానె పైకి
మెట్లు ఉంటాయి.
మెట్ల పై నుంచి దబ దబా మనుషులు దిగుతున్న శబ్దం
వచ్చింది
మెల్లగా కప్పుకున్న చెద్దరు కొద్దిగా తొలగించి చూసేసరికి
ఇద్దరు దొంగలు చేతిలో కత్తులతో గుండె ఆగినంత పన
య్యింది సుదకు
తీసిన చెద్దరు మల్లీ పైకనుకుని కల్లు గట్టిగా మూసుకుంది
ఒకడు వచ్చి సుద పైకి వంగి బీరువా తాలాలు ఇవ్వు
లేకపోతె పొడిచేస్తా అన్నాడు
మెత్తకిందనె ఉన్న తాలాలు తీసి మెల్లగా చెయ్యి బయటకు పెట్టి ఇచ్చింది
సుద చేతికి గాజులు లేవు నుదుటికి బొట్టు లేదు స్వెటరు వేసుకోవడంతో చాలా లావుగా కనిపించిందేమెా మగ
వాడని అనుకున్నట్టు ఉన్నారాదొంగలు
ఏయ్ అడిగినవన్ని ఇవ్వు కదిలావో చంపేస్తా అని
బెదిరించి ఒకడు మంచం దగ్గరే ఉన్నాడు
ఇంకొకడు బీరువా తెరిచి అందులోని బట్టలన్ని లాగేసి
ఒక నగల డబ్బ తీసాడు
ఒరేయ్ పెద్ద నగలడబ్బ ఉందిరా అని రెండోవాడికి
చెప్పాడు
అందులో నగలున్నాయెా లేదో చూడరా అని మెుదటి వాడన్నాడు
తెరిచి వాడి దగ్గరున్న లైట్ తో చెక్ చేశాడు వడ్డానం
చెంపచెరాలు చెవులకమ్మలు ఏవేవో గొలుసులు
చాలానె నగలున్నాయి దాంట్లో.
పదరా,పద పద తొందరగా పోదాం ఇంత బంగారం
కోటి రూపాయల విలువ చేస్తుందిరా పద పరిగెత్తుదాం
అనుకుని ఆపెట్టె పట్టుకుని ముందు తలుపులు
తెరుచుకుని పారిపోయారు.
వాల్ల అడుగుల శబ్దం ఆగేదాక చూసి దడదడలాడుతున్న
గుండెను చేత్తో పట్టుకుని మెల్లగా లేచి చూసింది సుద
అసలు నగలేమి పోలేదు అవి ఎప్పుడో తన కూతురు
డాన్స్ కోసం కొన్న గిల్టు నగలు అసలువన్ని లోపలి
సీక్రెట్ లాకరులో ఉన్నాయి.
అవన్ని తీసింది తన మెడలో ఉన్నవి కూడ తీసి ఒక
బట్టలో మూటకట్టి డబ్బాలో దాచేసి ముందుకెల్లి
అందరిని పిలిచింది
మా ఇంట్లో దొంగలు,దొంగలు పడ్డారని అరిచింది దాంతో
ఆ వాడలో ఉండేవాల్లు పక్కింటి వాల్లు వచ్చి టీచరు
ఇంట్లో దొంగలట రండి రండి అని ఒకరిని ఒకరు పిలుచుకుని అందరూ వచ్చి చూసారు
అయ్యెా!అయ్యెా!అన్ని ఎలా చిందర వందర చేసేసారో
చూడండి….
అయ్యెా పాపం టీచరుగారి నగలన్నీ దోచేసారు వాల్ల
చేతులు పడిపోను అని ఒకరు
ఇంకా నయం కొట్టలేదు చాకుతో పొడవలేదు అని ఒకరు
ఒకరు మంచి నీల్లు తెచ్చి తాగించారు.
పక్క ఆనందరావు తెల్లారాక పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలన్నాడు
అవునవును రేపు మన ఇల్లల్లో పడ్డా ఆశ్చర్యం లేదు
దొంగ వెధవలకి మన కాలనీ తెలిసిపోయింది పొద్దున్నే
రిపోట్ ఇద్దాం అన్నాడు రంగారావు.
అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి వాల్ల భార్యలను
టీచరుకు తోడుగా ఉంచి ఎవరింటికి వాల్లు వెల్లారు.
తెల్లవారి అన్నట్టుగానె పోలీస్ స్టేషనులో అంతా కలిసి
రిపోట్ ఇచ్చారు
ఏమేమ్ నగలు పోయాయని ఆ స్టేషను S.I అడగగానె
టీచరు నగలన్నీ కూడ పక్కవాల్లె చెప్పేశారు.
అన్నీ రాసుకుని వాల్లు దొరకగానె పంపిస్తామన్నారు.
కొద్ది రోజుల తర్వాత ఇంతమంది కలిసి అడగడం వాడలో
పరపతి గల వాల్లు పెద్ద పెద్ద వాల్లు ఉండడంతో ఊరికే
వాల్లు అడగడం వలన ఎక్కడ దొరికిన నగలో కాని అన్ని
దొరకలేదమ్మ కొన్ని దొరికాయని తీసుకొచ్చి ఇచ్చారు
వాడల వాల్ల సమక్షంలో….
వాడలో వాల్లుకూడ ఇవి టీచరు గారివే ఈ చంద్రహారం
రోజూ వేసుకునేదే పాపం చూడండి బోడి మెడతో ఉంటుంది అన్నారు.
ఇక చెప్పేదేముంది టీచరుగారికి అదనంగ బంగారం కూడ
వచ్చింది.
అంతలో అమ్మాయికి ఒక సంబందం రావడంతో ఆ
బంగారం అతా పెట్టి ఘణంగా పెల్లి చేసింది
పాపం టీచరు గారింట్లో దొంగలు పడి సొమ్మంతా దోచుకు
పోయారు పెల్లి ఎలా చేస్తుందని వాడలో వాల్లే ఎవరికి
తోచినంతా వాల్లు కట్నాలరూపంలో,డబ్బుల రూపంలో
సహాయం చేసారు.
సుద మాత్రం ఆ దొంగలను తలుచుకుని వాల్లు తనింట్లో
అడుగు పెట్టడం వలన తనకు జరిగిన లాభానికి వాల్లు
కనపడితె కాల్లు కడిగి తలపై చల్లుకోవాలనుకుంది.
ఆ తెలివి తక్కువ దొంగలు మాత్రం ఆ గిల్టు నగలను
ఏం చేసుకున్నారో ఏమెా!!!!!!!
ఇక కథ కంచికి మనమింటికి.
**** *****
ఉమాదేవి ఎర్రం