తెలివి తక్కువ వాడు

 

మాజిద్ .నస్రిన్ లకు పెళ్లి అయ్యి మూడేళ్ళు అవుతుంది.మాజిద్ ఒక ప్రభుత్వ శాఖ లో నాలుగో తరగతి ఉద్యోగి గా పని చేస్తున్నాడు.పెళ్లి కి ముందే మాజిద్ కూ కాస్త బుద్ది మాoద్యం అని తెల్సు నస్రిన్ కి ,అయినా తన భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని పెళ్లి చేసుకుంది నస్రిన్.పెళ్లి అయ్యాక అత్తగారి ఇంట్లో నుండే  భర్త  పొద్దునే  ఉద్యోగానికి వెళ్ళేవాడు,సాయంత్రం తిరిగి వచ్చేవాడు.అలా రోజు అతను వెళ్ళి రావడం తో అలసిపోయి భార్యతో కబుర్లు కానీ,సరదాలు కానీ తిరేవి కావు.చాలా రోజులు అలా భరించిన నస్రిన్ ఇక భరించ లేక పోయింది.

  రాత్రి భర్త వచ్చి,తనని దగ్గరికి తీసుకుంటుంటే,అతన్ని పక్కకు తోసేసింది,ఇన్నేళ్ళు మాజిద్ ఎలా ఉన్నా ,భార్య రావడం తో భార్యనే తన స్నేహితురాలిగా భావిస్తూ ,అన్ని విషయాలని తనతో చెప్పుకునే వాడు,అలాంటిది భార్య అలా పక్కకు తోసేయ్యడం తో,హతాశుడయ్యాడు.ఆమె కోపానికి కారణం ఏమిటో తెలియక అల్లాడి పోయాడు.వెంటనే దగ్గరికి వచ్చీ ఏం అయ్యింది,ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు నస్రిన్ ను.

నస్రిన్ మాజిద్ దగ్గరగా వచ్చి,నాకు ఇక్కడ ఉంటె బోర్ కొడుతుంది.నేను మీతోపాటు గా అక్కడికి వచ్చేస్తా,మనం ఊర్లోనే ఉందాం అని అంది ప్రేమగా.మళ్ళి భర్తని చూస్తూ మీరు పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తారు, నేను ఇక్కడ ఒక్కాదాన్నే ఉండాలి అంటే భయం గా ఉంది.అత్తా తో ఎంత సేపని మాట్లాడుతూ కుర్చుంటాను,అందుకే నన్ను మీతో పాటుగా తీసుకుని వెళ్ళండి అని అంది నస్రీన్.

అయ్యో అంతేనా సరే దానికేనా నువ్వు  ఇంతలా బాధ పడుతున్నావు,దానికేం నాలుగు రోజుల్లో ఎదో ఒకటి ఆలోచిద్దాం అని అన్నాడు మాజిద్ . అవునా అండి నిజమేనా మీరు నన్ను  తీసుకుని వెళ్తారా, యా అల్లా ,నిజంగా నాకు ఎంత మంచి భర్తని ఇచ్చినావు దేవుడా అని అంది చేతులు జోడిస్తూ ,మాజిద్ ఇక చాల రాత్రి అయ్యింది పడుకో అన్నాడు నస్రీన్ని, మళ్ళి మీరు పొద్దునే వెళ్ళాలి కదా,ఎంత మంచి వారండి మీరు అని భర్త ని హత్తుకుంది ప్రేమగా

నాలుగు కాదు మూడు నెలలు గడిచాయి,కానీ మాజిద్ ని ఎప్పుడు పోదాం అని అడిగినా రేపు,మాపు అంటూ,ఇల్లు దొరకలేదు అని ఒకసారి,ఒకసారి పని కాలేదు అని ఇలా అన్ని సాకులు చెప్తూ ఉన్నాడు,పట్టణం లో కాపురం పెట్టాలన్న తన కోరిక తీరలేక పోతునందుకు బాధ పడుతూనే,భర్త ఎప్పుడు మంచి వార్త చెప్తాడో అని ఎదురు చూస్తుంది నస్రీన్.

ఒక రోజు మధ్యానం సంతోషంగా ఇంటికి వచ్చిన మాజిద్ బట్టలు ఉతుకుతున్న నస్రీన్ దగ్గరికి వెళ్ళి నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది మన ఊరికె ,ఇక నేను ప్రొద్దున నుండి సాయంత్రం వరకు నీ ముందే ఉంటాను,మనం చాలా కబుర్ల చెప్పుకోవచ్చు అని అంటున్న భర్తను చూసి,అతని తెలివి తక్కువకు నవ్వాలో,ఏడవాలో తెలియక తల పట్టుకుని కూలబడింది నస్రీన్,ఆమె పట్నం కాపురం ఆశ అలా నీరయ్యింది…….

Normal
0

false
false
false

EN-US
X-NONE
HI

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-qformat:yes;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
mso-bidi-font-size:10.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-fareast-font-family:”Times New Roman”;
mso-fareast-theme-font:minor-fareast;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Mangal;
mso-bidi-theme-font:minor-bidi;}

Related Posts