తెలుగు వేమన పద్యాలూ | Telugu Vemana poems| Telugu Quotes

తెలుగు వేమన పద్యాలూ | Telugu Vemana poems| Telugu Quotes

తెలుగు వేమన పద్యాలూ | Telugu Vemana poems| Telugu Quotes

గంగిగోవు పాలు గరిటడైనను చాలు

కడివెడైన నేల ఖరముపాలు

భక్తికలుగు కూడు పట్టెడైననుజాలు

విశ్వదాభిరామ వినుర వేమ

భావం – కడవ నిండా ఉన్న గాడిద పాలు కంటే చక్కని ఆవు పాలు ఒక్క గరిటెడు ఉన్నా సరిపోతుంది.

 

అల్పుడెపుడు బల్కు నాదంబరముగాను

సజ్జనుండు పలుకు చల్లగాను

కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా

విశ్వదాభిరామ వినురవేమ.

భావం – ఎంతో విలువైన బంగారం శబ్ధం అంత విలువ లేని కంచు కంటే ఎలా తక్కువగా ఉంటుందో అలాగే మంచి వాని మాటలు చాలా చల్లగా నిరాడంబరంగా ఉంటే చెడ్డ వాని మాట మాత్రం ఆడంబరంగా ఉంటుంది.

తెలుగు వేమన పద్యాలూ | Telugu Vemana poems| Telugu Quotes

అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు

తినగ తినగ వేము తీయగనుండు

సాధనమున పనులు సమకూరు ధరలోన

విశ్వదాభిరామ వినుర వేమ

భావం – పాడగా పాడగా రాగం వృద్ది అవుతుంది.తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది.అలాగే దృడ సంకల్పంతో పట్టుదలతో చేపట్టిన పని చేస్తే తప్పకుండా సమకూరుతుంది.

 

ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు

కాచి యతుకనేర్చు గమ్మరీడు

మనసు విరిగినేని మరియంట నేర్చునా?

విశ్వదాభిరామ వినురవేమ

భావం – మూడు సార్లు విరిగితే దానిని రెండు సార్లు అతికించవచ్చు.కానీ అదే మనిషి మనసు ఒక్కసారి విరిగితే(అంటే ఏదైనా విషయం వల్ల మనసు నొచ్చుకుంటే)దానిని మరళ అతికించుట ఆ బ్రహ్మ దేవిని వల్ల కూడా కాదు.

 

ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన

నలుపు నలుపేకాని తెలుపు కాదు

కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా?

విశ్వదాభిరామ వినురవేమ

భావం – ఎలుక తోలు తెచ్చి ఎన్ని సార్లు ఉతికినా దాని సహజసిద్ధమయిన నలుపు రంగే అయినా తెల్లగా మారదు.అలాగే చెక్కబొమ్మ తెచ్చి దానిని ఎన్ని సార్లు కొట్టినా సరే మాట్లాడదు.(దీని అర్ధం ఏమనగా సహజ సిద్ద స్వభావాలను మనము ఎన్ని చేసినా సరే మార్చలేము)

 

ఆపదైన వేళ నరసి బంధుల జూడు

భయమువేళ జూడు బంటుతనము

పేదవేళ జూడు పెండ్లాము గుణమును

విశ్వదాభిరామ వినురవేమ

భావం – ఆపదల్లో చిక్కుకున్నపుడు సహాయపడేవాడే భందువు.భయముతో ఉన్నపుడు ధైర్యం చెప్పేవాడే మిత్రుడు.కటిక బీదరికంలోనైనా భర్తను గౌరవించేదే భార్య.

 

చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె

నీట బడ్డ చినుకు నీట గలిసె

బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా

విశ్వదాభిరామ వినురవేమ

భావం- ఆల్చిప్పలో పడ్డ స్వాతి చినుకు ముత్యంగా మారుతుంది.నీటిలో పడిన చినుకు వ్యర్ధం అవుతుంది.అలాగే ప్రాప్తి ఉంటే తప్పకుండా ఫలితం వస్తుంది.

 

చిక్కియున్న వేళ సింహంబునైనను

బక్కకుక్క కరచి బాధచేయు

బలిమి లేనివేళ బంతంబు చెల్లదు

విశ్వదాభిరామ వినురవేమ

భావం – అడవికి మృగరాజు అయిన సింహం చిక్కిపోయి ఉంటే వీధిన పోయే బక్క కుక్క కూడా భాద పెడుతుంది.అందుకే తగిన బలము లేని చోట పౌరుషము ప్రదర్శించరాదు.

తెలుగు వేమన పద్యాలూ | Telugu Vemana poems| Telugu Quotes

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *