తొలి అడుగు
నేను చనిపోతాను అంది రజియా ఛీ అవేం మాటలు అలా అంటే నేనేం కావాలి అన్నాడు మహమ్మద్ మీరు మరొకర్ణి చేసుకొని హాయిగా ఉండండి అంది రజియా కన్నీళ్లను తుడుచుకుంటూ అలా ఎలా కుదురుతుంది. నువ్వు లేకపోతే నేను ఉండగలనా లేదు పోతే ఇద్దరం పోదాం అంటున్న మహమ్మద్ నోటిపై చేయి వేసింది రజియా ఇద్దరు గట్టిగా కౌగిలించుకున్నారు.
ఇంతలో ఎవరో వస్తున్న శబ్దం వినిపించి ఇద్దరూ దూరంగా జరిగారు. మత పెద్దలు ఇంట్లోకి వస్తూనే ఎం నిర్ణయం తీసుకున్నారు అంటూ అడిగారు. మాకు కొంచం సమయం కావాలి అన్నాడు మహమ్మద్. ఎంత సమయం కావాలి అన్నాడు మత పెద్ద మాకొక సంవత్సరం కావాలి అన్నాడు మహమ్మద్. నువ్వెందుకు దీన్ని పెద్దగా చేస్తున్నావ్ మనలో ఇదంతా మాములు విషయమే కదా అన్నాడు అతను.
కానీ నేను దానికి సిద్ధం గా లేను. నాకు పెళ్లయ్యి అరునెలలు కూడా కాలేదుఅప్పుడే పిల్లలు పుట్టాలి అంటే ఎలా అది కూడా నాకు పుట్టరు అని మీరెలా అంటారు. ఇది మంచిది కాదు. దానికి నా తమ్ముడునీ వాడుకోవాలనీ అనుకోవడం పెద్ద తప్పు వేరే మతాల్లో అయితే వదిన అంటే తల్లితో సమానం అంటారు అన్నాడు మహమ్మద్.
చుప్ రహో అవన్నీ మాకు తెలుసు చూడు నువ్వు సంవత్సరం అంటున్నావు కాబట్టి మేము నీకు సంవత్సరం సమయం ఇస్తున్నాం అప్పటికి కాకపోతే మేము మా నిర్ణయాన్ని అమలుచేస్తాం అన్నాడు ఇంకొకతను అది అలా చెప్పండి వీడికి చెప్తున్నా అర్థం కావడం లేదు అంది మహమ్మద్ తల్లి.
అమ్మా ఆపు అమ్మా ఇంకెన్నాళ్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. నువ్వు, పిన్ని, అత్త, అంతెందుకు నాన్నమ్మ కూడా ఇలాగే కదా మీ ఇష్టాఇష్టాలు మర్చిపోయి, మీ మనసును దృఢంగా, కఠినంగా చేసుకుని, మీ ఆత్మభిమానం చంపుకుని దీనికి తలోంచారు. కానీ కాలం మారిందమ్మా ఇప్పుడు కూడా ఇలాగే చేయమంటే ఎవరూ చేస్తారు. చేయరు ఇలాంటివీ మీరు చేసినప్పుడు మీరు పడిన మానసిక క్షోభ ఎలాంటిదో నాకు తెలుస్తుంది.
కానీ మీరు చేసారని మీరు పిల్లలకు కూడా ఇలాగే చేయమంటే ఇప్పుడు చేయం మాకంటూ ఒక మనసు, ఆత్మభిమానం అన్నీ ఉన్నాయి. రెప్పోద్దున నాకు పుట్టిన కొడుకు నీ చూస్తున్న కొద్దీ నాకు నా తమ్ముడే కనిపిస్తాడు తప్ప నేను కనిపించను. అతని కళ్ళలో నుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి.
అయినా మాకూ పెళ్ళి చేశారు పిల్లల్ని కనడం కనకపోవడం మా ఇష్టం మా ఇష్టాలను వద్దనే అధికారం, హక్కు మీకు లేదు, మా ఇష్టాలను కాలదన్నే అనే అవకాశం మీకు లేదు కాబట్టి మమల్ని ఆపే హక్కు మీకు లేదు. ఇప్పుడే నేను నా భార్యను తీసుకోని వెళ్తున్నాను. ఇంకెన్నాళ్లు ఈ ఆచారాలు, సంప్రదాయం అంటూ మమల్ని కట్టి పడేస్తారు అంటూ ఒక నిర్ణయానికి వచ్చినట్టు మళ్ళీ వారిని చూస్తూ…
నేను చూస్తాను ఇవి ఇంతకుముందులా జరగకుండా ఒక్క ఆడపిల్ల కూడా అన్నీ చంపుకుని పెద్దల మాటకు తలవంచకుండా తనకు నచ్చినట్టు ఆత్మ గౌరవం తో ఉండేలా చూస్తాను. ఇది నాతోనే మొదలుపెడతాను అంటూ పద రజియా అని భార్యతో పాటు బయటకు వెళ్ళిపోయాడు మహమ్మద్.
మహమ్మద్ అంటున్న ప్రతీ మాట అక్కడ ఉన్నవారి గుండెల్లో మంటలు రేగించాయి. అక్కడ ఉన్న తల్లి, అత్త, పిన్ని వాళ్ళు ఆ క్షణం పడిన క్షోభ గుర్తుకువచ్చి కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా మత పెద్దలతో గొంతు లో గంభీర్యంతో అవును మహమ్మద్ చెప్పింది నిజమే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మేము పెద్దల మాటలు వినాలి అనుకున్నాం కానీ మా మానసిక పరిస్థితి ఎలా ఉందేదో మాకు తెలుసు.
మీరు అన్నీ చెప్పి వెళ్తారు కానీ ఆ తర్వాత ఎదురైయ్యే పరిస్థితి గురించి, అవమానాల గురించి మీకెలా తెలుస్తుంది. ఇన్నాళ్లకు అయినా నా కొడుకు వలన పరిస్థితి మారింది అనుకుంటాను, ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను, కుటుంబం, గౌరవ మర్యాదలు, సంప్రదాయం అంటూ మా నోరు నొక్కేసారు. కానీ ఇవన్నీ ఇక నుండి జరగకుండా చూసుకుంటాను నేను కూడా నా కొడుకు తో పాటే ఈ ఉద్యమానికి తొలి అడుగు వేస్తాను అంటూ బయటకు నడిచింది నస్రీన్…
అక్కడున్న పెద్దలు మిగిలిన కుటుంబ సభ్యులు కూడా తాము చేసినప్పుడు ఎలా మనసులో క్షోభ పడ్డారో తల్చుకుంటూ అలాగే నిలబడి పోయారు మత పెద్దలు మాత్రం ఇంకో ఇల్లు వెతుక్కుంటూ బయటకు వెళ్ళిపోయారు.
ఈ కథ మీ అందరికీ అర్ధమై ఉంటుందని భావిస్తున్నాను. ఏ మతాన్ని కించపరిచే ఉద్దేశ్యం నాకు లేదు కానీ అందులో ఉన్న లోపాలను మాత్రమే గుర్తించాలి. అలాంటి స్థితులని మతం పేరిట వాడుకోకూడదు అనే ఉద్దేశ్యం తోనే ఈ కథ రాయడం జరిగింది… ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను..
భవ్యచారు