తోలుబొమ్మలాట చూసిన మనిషి…

ఈ రోజు అంశం
తోలుబొమ్మలు

శీర్షిక
తోలుబొమ్మలాట

తోలుబొమ్మలాట చూసిన
మనిషికి తన జీవితం కూడా
ఆ బొమ్మలాట లాగే ఉందని
అనిపిస్తుంది. అయితే
తోలుబొమ్మలాటలోని ఆ బొమ్మలను కనపడే దారాలతో
మనిషి నియంత్రిస్తాడు.
బాధ్యత, సమాజం పట్ల
బాధ్యత, ఉద్యోగ ధర్మం
ఇవన్నీ మనిషిని ఆడించే ఆ కనపడని దారాలు.
పాప భీతి అనేది ప్రతి మనిషిని
నియంత్రించే ముఖ్యమైన దారం. అది లేకపోతే మనిషి
కౄరమృగంలా మారిపోతాడు.
మానవత్వం అనే ప్రధాన దారం
ఒక మనిషిని మనిషిగా ఉంచుతుంది. ఆ దారం తెగిపోతే మనిషి దానవుడే
అవుతాడు.దైవం అనుమతి
ఉన్నన్నాళ్ళు మనిషి ఈ జగన్నాటకంలో తన పాత్రను
పోషించి ఆ తర్వాత నిష్క్రమించాల్సిందే.
అదే జీవితం.

ఈ రచన నా స్వీయ రచన
అని హామీ ఇస్తున్నాను.
వెంకట భానుప్రసాద్ చలసాని.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *