తోలుబొమ్మలు…..

అంశం:⁠- తోలుబొమ్మలు

శీర్షిక:⁠- సిద్ధపడతారు

            

                      “రేపు అఖిల్ అమెరికా నుంచి వస్తున్నానని ఫోన్ చేశాడు” అని చెప్పాడు నందకిషోర్.
“అవునా… అయితే ఎయిర్పోర్ట్ కి కీర్తిని పంపించండి” అని చెప్పింది అనురాధ.  
“అలాగే…” అని చెప్పి కీర్తి కి ఫోన్ చేసి విషయం చెప్తాడు నందకిషోర్.
అఖిల్ కి ఎవరు లేరు. తన అత్త ,మామలు అన్ని వాళ్లే అయి పెంచి పెద్ద చేశారు.
అఖిల్ కి బోలెడు ఆస్తి ఉంది కానీ అయిన వాళ్లే లేరు. అనురాధ , నందకిషోర్ లు దూర బంధువులైన అఖిల్ ఆస్తి చూసి పెంచి పెద్ద చేశారు.
పేరుకే అఖిల్ ఆస్తి అనుభవించేది మాత్రం తన అత్తమామలు. కీర్తిని అఖిల్ కి ఇచ్చి పెళ్లి చేస్తే అఖిల్ వాళ్ళ గుప్పిట్లో ఉంటాడు అనే నమ్మకంతో అఖిల్ ముందు మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు.
అఖిల్ వీళ్ళు చేతిలో తోలుబొమ్మగా ఆడిస్తూ ఏది చెప్తే అది నమ్మేటట్టుగా చేస్తున్నారు.
పై చదువులు కోసమని అమెరికా వెళ్ళాడు అఖిల్.
అఖిల్ కీర్తి తో చనువుగా ఉన్న అది ప్రేమ అనే భ్రమపడింది కీర్తి.
అయితే ఒక రోజు మనసులో మాట అడిగింది అనురాధ.
“అఖిల్ బాబు నీకు కీర్తి కి పెళ్లి చేయాలనుకుంటున్నాము. నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే ముహూర్తాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము” అని నందకిషోర్ అడుగుతాడు.
“క్షమించండి మావయ్య… నాకు ఆ ఉద్దేశం అసలే లేదు. నేను వేరే అమ్మాయిని ప్రేమించాను” అని అబద్ధం చెప్పాడు అఖిల్.
“ఆ అమ్మాయి ఎవరో చెప్పు అఖిల్ బాబు? ఆ అమ్మాయి వాళ్ళ పెద్ద వాళ్ళతో మాట్లాడి మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాము” అని చెప్పింది అనురాధ.
“అలాగే అత్తయ్య…” అని చెప్పి వెళ్ళిపోయాడు అఖిల్.
కోపంతో రగిలిపోతూ ,
“అమ్మ నువ్వేనా బావ ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తావా?” అని కోపంగా అరిచింది కీర్తి.
“ఆ పెళ్లి జరగదు ఆ పెళ్లికూతురు ప్లేస్ లో నిన్ను కూర్చోబెట్టి నీతో జరుగుతుంది. ఆ పెళ్లి ముహూర్తం మాత్రం మీ ఇద్దరికే పెడతాం” అని నవ్వుతూ చెప్తుంది అనురాధ.
తండ్రి కూతుర్లు అనురాధ ప్లాన్ విని సంతోషించారు.
“ఈ ఆస్తికి అధికారం మన కూతురే చెల్లయించేది. మన మాటే వేదంగా భావించే అఖిల్ బాబుని వేదంగా భావించి అఖిల్ బాబుని మన చెప్పే విధంగా ఆడే తోలుబొమ్మవుతాడు” అని నవ్వుతూ చెప్తాడు నందకిషోర్.
రెండు రోజులు తర్వాత నవ్య ని తీసుకొచ్చి వాళ్ళ అత్త మామకి పరిచయం చేస్తాడు అఖిల్.
అఖిల్ ,వెంకట్ , నవ్య లు ఈ ముగ్గురు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్.
అఖిలా అమెరికా వెళ్లిపోయిన తర్వాత వెంకట్ ఒక హాస్పిటల్లో డాక్టర్ గా ఉన్నాడు.
నవ్య సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తుంది.. ఈ విషయం తన కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికి తెలియదు.
ఎంతోమంది క్రిమినల్ ని దగ్గరనుంచి చూసిన నవ్యకి అఖిల్ అత్త మామని చూడగానే వాళ్ళు క్రిమినల్ గా కనిపించారు.
బయటికి మాత్రం నవ్వుతూ పలకరించింది నవ్య.
రెండు గంటల తర్వాత నవ్య నందన్ కిషోర్ అనురాధ ల మీద ఎంక్వైరీ మొదలు పెట్టింది కానీ ఈ విషయం ఎవరికీ తెలీదు.
ఆ ఎంక్వయిరీ లోనే వీళ్ళు చేసిన కొన్ని నేరాలు తప్పులకు సాక్షాలు కూడా సంపాదించింది.
మరొక వారం రోజుల తర్వాత తను ఫ్రెండ్ వెంకట్ తో కీర్తికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు అఖిల్.
కానీ ఈ పెళ్లి చూపులు చెడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరికి రెండు పెళ్లిళ్లు ఒకేసారి జరగాలని ఒకే ముహూర్తం పెట్టించారు.
పెళ్లి రేపు అనగా సాక్షాధారాలన్నీ ఒక దగ్గర దాచి పెట్టింది నవ్య.
నందన్ కిషోర్ అనురాధ ల చేతిలో తోలుబొమ్మగా ఆడుతున్న అఖిల్ ని ఈ సాక్షాదారాలతో వాళ్ళ నిజస్వరూపం బయట పెట్టాలి అని అనుకుంది నవ్య.
నందకిషోర్ కి పోలీస్ డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళ ద్వారా నవ్య సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ అని తెలిసి వాళ్ల మీద ఎంక్వయిరీ కూడా చేసింది అని తెలిసి సాక్షాదారాలతో నిరూపించబోతుందని తెలిసి ఆ సాక్షాలు కొట్టేయడానికి దొంగచాటుగా తన రూమ్ కి వెళ్తారు.
ఆ సాక్షాధారాలను కొట్టేయడమే కాక నవ్య అని కిడ్నాప్ చేశారు.
పెళ్లి జరగదు అని సంతోషిస్తుండగా కీర్తి కనిపించకుండా పోతుంది.
నందకిషోర్ , అనురాధలు నవ్యని కిడ్నాప్ చేయబోయి కీర్తిని కిడ్నాప్ చేశారు.
పెళ్లి మండపంలోకి పెళ్లి మండపంలోకి నవ్య రావడం చూసి అప్పుడు ఈ విషయం అర్థమైంది.
కీర్తిని కిడ్నాప్ చేస్తారు అని తెలిసి నవ్య తన టీం కి చెప్పి పెళ్లి మండపానికి తీసుకొచ్చేలా చేసింది.
కీర్తికి ఇష్టం లేకపోయినా వెంకట్ చేత తాళి కట్టించుకుని , మరోపక్క ఆనందంగా అఖిల్ , నవ్యల పెళ్లి జరిగింది.
నందకిషోర్ , అనురాధలు చేసిన నేరాలకి సాక్షాదారాలతో పోలీసులకి అప్పజెప్పింది నవ్య.
ఎవన్నైతే ఆడించాలి అని అనుకున్నారో వాళ్ల చేతే ఛీ కొట్టించుకున్నారు.
ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్న వెంకట్ ప్రేమ చూసి ఫిదా అయిపోయి అతనితో హ్యాపీగా ఉంది కీర్తి.

మొదట రాత్రి తను సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ అని తన భర్త అయినా అఖిల్ కి చెప్పేసింది నవ్య.
నూతన దంపతులు సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.

మన మిత్రులకి ఏదిస్తే అదే జరుగుతుంది మనకి మనము ఇతరులకి ఏమిస్తే అదే మనకు జరుగుతుంది మంచి అయితే మంచి , చెడు అయితే చెడు.

కొందరు ఉంటారు అధికారం , ఆధిపత్యం వహించాలని దాన్ని కోసం ఎన్ని తప్పులు అయినా చేయడానికి సిద్ధపడతారు. తర్వాత జైలు పాలు అవుతారు అది ఎందుకు తెలుసుకోరో అర్థం కావట్లేదు.

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *