అక్షర లిపి
అంశం :తోలు బొమ్మలు
శీర్షిక మట్టి బతుకులు
వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు
వైజాగ్.
శీర్షిక :మట్టి బతుకులు
“బంకమన్ను ముద్దలు చేసి, పిడచలు కట్టి
బాధలన్నీ తనలో ఇముడ్చుకొని, భారమైన హృదయంతో, బతుకు తెరువు కోసం, రకరకాల మట్టి బొమ్మలు చేస్తూ, ఆ మట్టిని గట్టిగా పిసికే ఓపిక లేక, తెల్లారే గంజినీళ్లు త్రాగి, ‘జీవిత చక్రం అనే చక్రంలో త్రిప్పుతూ, బంకమన్ను తో కుండలు చేస్తూ, కొనేవారు లేక చల్లని కుండ నీరు మరిచిపోయి, ‘ఫ్రిజ్జు నీళ్లకు అలవాటు పడి, పేరుకుపోయిన కొండలన్నీ వెర్రి ముఖం వేస్తూ, ఎవరు కొంటారా? అని ఎదురు
చూస్తూ, ఈ రోజుల్లో ‘స్మశాన వాటిక కు, మనిషి తో పాటు తరలిపోయి బద్దలై పోయే తమ జీవితాలను,! తలుచుకుంటూ కుండ తో పాటు ‘కుమ్మరి ‘కూడా ఆక్రోసిస్తు, పోనీ మట్టిబొమ్మలు చేద్దామంటే, ‘మరబొమ్మలు వచ్చి, భారతీయ కళలను అధ: పాతాళానికి త్రోసివేసిన, నేటి సమాజానికి బడుగు జీవుల బాధలు అర్థం చేసుకోమని, ప్రాణమున్న ‘మట్టి బొమ్మలను’ ఆదుకోమని ప్రార్ధిస్తూ
మీ వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు🙏