దారి (2 Great Ways- A bad way and a way filled with Humanity)

దారి

దారి
దారి

 

ప్రతిరోజు నేను పారాలు చెప్పడానికి వెళ్ళే దోవలో ఒక ముసలమ్మా బుట్ట పెట్టుకుని ఏ కాలం లో కాసే పళ్ళ ను ఆ కాలం లో అమ్ముతూ ఉండేది. (అమ్ముతూ ఉండేది అని నేను అనుకున్నా) నేను ప్రతిరోజు అనుకుంటూ ఉండేవాడిని ఆవిడ దగ్గరికి వెళ్ళాలి మాట్లాడాలి అని కానీ ఎప్పుడు కుదిరేది కాదు అయితే చాలా కాలం ఆవిడను గమనించనే లేదు ఒకసారి ఎందుకో బాగా వర్షం పడుతుంది నేను ఆటో లో ఇంటికి వెళ్తున్న ఆ సమయంలోనే ఆమెని చూడడం జరిగింది

ఆవిడ అంత వర్షంలో కూడా పళ్ళు అమ్ముతూ ఉండేది అది చూసి నేను ఏంట్రా బాబు ఆమెకు ఏం పనిలేదా ఇంత వానలో ఇలా పళ్ళు అమ్మడం ఏంటి ఎందుకు ఎవరికోసం చెయ్యడం హయిగా కృష్ణా రామా అని అనుకుంటూ ఇంట్లో కుర్చోక ఎందుకు ఇంత పంతం ఆవిడకు పిల్లలు భర్త లేరా అని అడిగాను ఆటో అతన్ని దానికి అతడు అవును సారు ముసలిది ఎంత చెప్పినా వినదు కొడుకులు, కోడళ్ళు, మనుమళ్ళు, అందరూ ఉన్నారు.

అయినా ఇది ఈ పని చేయకుండా ఉండదు పాపం కొడుకు చెప్పి, చెప్పి విసిగి పోయాడు అతనికి ఊర్లో తల కొట్టేసినట్టు గా ఉంటున్నా ఆ ముసల్ది ఈ పని మాత్రం ఆపదు ఎవరి కోసమో చూస్తూ ఉంటుంది రాత్రి ఎనిమిది వరకు ఉంటుంది.

ఈ చెట్లల్లో పామో, తేలో వచ్చి కర్చినా దిక్కు ఉండదు అంటే నాకేం కాదు అంటూ బోసి నోటి తో నవ్వుతుంది అన్నాడు. ఇదెంతో విచిత్రంగా వింతగా అనిపించింది. నాకు విషయం ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నా కానీ నాకెప్పుడూ సమయమే దొరకలేదు అడగడానికి  వెళ్లి ఆవిడతో మాట్లాడడానికి కానీ, ఎలాగైనా వెళ్ళాలనుకుంటే ఇంతలోనే నాకు వేరే చోట ఎలక్షన్ డ్యూటీ పడింది.

దాంతో నేను వెళ్ళక తప్పలేదు. ఆవిడ విషయం పక్కకు పెట్టేసి నేను నా పనిలో మునిగిపోయాను డ్యూటీ అవ్వగానే మా చిన్న మామగారు చనిపోవడంతో ఇంకో వారం రోజులు అక్కడే ఉండి తిరిగి నెల రోజుల తర్వాత మళ్ళి నేను నా స్కూల్ కి వచ్చాను.

ఎప్పటిలా ఆటోలో వెళ్తున్న నాకు ఆవిడ ఉన్న స్థలం లోకి రాగానే చూపులు తిప్పాను. కానీ, ఆవిడ నాకు కనిపించలేదు ఏమైందో అనుకున్నా. ఈరోజు రాలేదేమో అని అనుకున్నా ఒక వారం రోజులు అలాగే గడిచాయి నేను చూడడం ఆవిడ రాకపోవడం. నేను నిరాశగా తల తిప్పుకోవడం.

అలా వారం రోజులు అయ్యాక ఇక ఆపుకోలేక ఆ రోజు ఆటోని అక్కడే ఆపేసి దిగి ఆ ఊర్లోకి నడిచాను, ఆవిడ గురించి తెలుసుకుందామని. ఆటో అతను నన్ను చూసి గుర్తు పట్టి  సారు ఆవిడ కోసమేనా ఆమె చనిపోయింది సారు అన్నాడు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. నాకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. నేను అతని  దగ్గరగా వెళ్లాను ఏమైందో అడుగుదామని. ఇక నా ఆత్అరుత చూసి తను చెప్పడం మొదలు పెట్టాడు.

దారి

ఒక రోజు ఎప్పటిలా వెళ్లి రాత్రి వరకు అక్కడే కూర్చొని ఇంటికి వచ్చాక తిని పడుకున్న ఆవిడ మళ్ళి లేవలేదంట అంతే అదే జరిగింది చేతనైనప్పుడే ఎవరితో చేయించుకోకుండా వెళ్లిపోయింది అన్నాడు ఆటో అతను నేను వాళ్ళింటికి వెళ్ళాలి అనగానే తీసుకుని వెళ్లి ఆమె కొడుక్కు పరిచయం చేసాడు.

అతను తన తల్లి గురించి చెప్తూ మా అమ్మ చాలా గోప్పది సార్ తల్లి ఎవరికైనా గొప్పనే కానీ ఆమె మా అందరితో పాటుగా పాతిక మందిని దత్తత తీసుకుని పోషించింది. మా నాన్న పాము కరిచి చనిపోవడం తో ఈ ఊరికి వలస వచ్చాం అప్పుడు మా అమ్మ చాలా నీరసంగా ఉందట అయితే ఈ ఊరి కి వచ్చే దారిలో ఒక ముసలి అతను కూర్చుని ఉన్నాడంట…

అతను మా అమ్మని చూసి తన దగ్గర ఉన్న పళ్ళు, నీళ్ళు ఇచ్చి నువ్విక ఈ ఊర్లోనే ఉండు నీకేం భయం లేదు. ఏ కాలం లో పళ్ళు ఆ కాలం లో అందరికి పంచు, అందరి ఆకలి నువ్వు తీరిస్తే నీ పిల్లల ఆకలి నేను తీరుస్తాను అని చెప్పాడంట ఇక అప్పటి నుండి మేము కాస్త నిలదొక్కుకునే వరకు కష్టపడిన మా అమ్మ తర్వాత ఏ కాలం లో కాసే పళ్ళను ఆ కాలం లో అక్కడ పెట్టుకుని కూర్చునేది.

వచ్చే పోయే బాటసారులు అక్కడ ఆగి వారి ఆకలి దప్పిక తీర్చుకునేవారు. ఇదంతా ఆవిడ ఉచితంగా చేసేది బర్లు గొర్రెలు కాసుకునే పశువుల కాపర్లు, పక్క ఊరినుండి వచ్చే బాటసారులు అక్కడ ఆగి దప్పిక తీర్చుకుని నీ కడుపు సల్లగుండా అని దీవించడమే మాకు శ్రీ రామరక్షగా మారింది. ఇప్పుడు మా అమ్మ చూపించిన దారి లోనే మేము కూడా నడవాలని అనుకుంటున్నాం దానికి మా వంతు కృషి చేస్తాము అని చెప్పాడు .

ఇక అప్పుడు  నాకు అర్ధం అయింది. ఏంటంటే గొప్పవాళ్ళు ఎక్కడో లేరు మన చుట్టూ పక్కలే ఉన్నారు.

వారిని మనం గుర్తించకపోవడమే మన దౌర్భగ్యం అని నాకప్పుడు అనిపించింది. ఎందుకంటే ఆవిడ గురించి నేను చాలా చులకనగా మాట్లాడ్డం గుర్తొచ్చి సిగ్గుతో తల దించుకున్నా..” నలుగురి కడుపు నింపడమే మానవత్వం, అనే గొప్ప దారి చూపిన దేవత ఆవిడ ..”

అప్పుడు నాకు అర్ధం అయ్యింది. మానవత్వం ఇంకా చనిపోలేదని, ఇంకా మిగిలే ఉందని…

అప్పుడు  నాకు అర్ధం అయ్యింది ప్రపంచానికి, దేశానికి తెలియని గొప్పవాళ్ళు ఎందరో ఉన్నారు అని. అది మనం గుర్తించడం లేదు అని.

కాని, అది మనం గుర్తించి వారిని గౌరవించాలి.

దారి
దారి

ఇక ఈ కథకి దారి అన్న పేరు సరిపోయిందో కాదో కామెంట్ చెయ్యండి.

మరొక కథని ఇక్కడ చదవండి…

https://aksharalipi.com/2021/03/16/%e0%b0%a8%e0%b1%81%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87-%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b0%82/

Related Posts