దాసు శ్రీరాములు (1846 – 1908) (దాసు శ్రీరాములు పంతులు లేదా దాసు శ్రీరామమంత్రి) ప్రసిద్ధ కవి, పండితులు, న్యాయవాది. వీరు కృష్ణా జిల్లా కూరాడ గ్రామంలో ఏప్రిల్ 8, 1846 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కన్నయ్య, కామమ్మ. చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలు నేర్చుకొని తన పన్నెండవ ఏట నూజివీడు సంస్థానంలో అష్టావధానం చేసి ప్రభువు మన్ననలనందుకున్నాడు. ఇరవై సంవత్సరాల వయసుకే తర్క, వ్యాకరణ, సంగీత, సాహిత్య, వేదాంతాలలో పాండిత్యాన్ని పొందారు. తరువాతి కాలంలో ఆంగ్లం చదివి 1878 సంవత్సరంలో ప్లీడరుగా మచిలీపట్నంలో ప్రాక్టీసు ప్రారంభించి, 1884లో ఫస్టు గ్రేడు ప్లీడరై ఏలూరులో న్యాయవాదిగా పనిచేశారు.
తరువాతి కాలంలో వృత్తిని వదిలి జీవిత శేషం సాహిత్య సేవకు వినియోగించారు. ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించి ఎందరో స్త్రీలకు నేర్పించారు. వీరు మే 16, 1908 సంవత్సరంలో పరమపదించారు. వీరి సతీమణి జానకమ్మ. వీరికి ఆరుగురు కుమారులు కేశవరావు, నారాయణరావు, గోవిందరావు, మాధవరావు, విష్ణురావు, మధుసూధనరావు లలో ఐదవ కుమారుడైన దాసు విష్ణు రావు స్వీయచరిత్ర లో 20 శతాబ్దమునాటి సాంఘిక రాజకీయములు వివరించిరి. వీరి ఏకైక కుమార్తె వేమూరి శారదాంబ పిన్నవయస్సులోనే సంగీతం తో పాటు సంస్కృతాంధ్ర విద్యాభ్యాసములు కావ్యరచనలుచేసిన 19వ శతాబ్దపు మహిళారత్నము.
రచనలు
దేవీ భాగవతము
తెలుగునాడు
అభినయ దర్పణం
జావళీలు, పదాలు
శాకుంతలము.
గ్రంథములు
ఆచార నిరుక్తి
దురాశపిశాచ భంజని
ఆంధ్రవీధీ దర్పణము
స్వరజితులు
జానకీపరిణయ నాటకము.
శతకములు
- చిలకల కొలికి శతకము 2. సోమలింగేశ్వర శతకము 3. ముద్దుగుమ్మ శతకము 4. చక్కట్ల దండ శతకము 5. సూర్య శతకము 6. కామాక్షీ శతకము
వీరు ఆశువుగా, 6 నెలల్లో తెనిగించిన ఆంధ్ర దేవీ భాగవతము ప్రత్యేక సాహిత్య కావ్యము. ఆయన్ని ఆశుకవి సింహులు అని పిలిచేవారట. ఇవి గాక జావళీలు, పదములు, బహు కృతులు కూడా ఆయనచే రచింపబడింది.
మాధవి కాళ్ల
సేకరణ