అక్షర కొరకు
అంశం :- ఉపాధ్యాయ దినోత్సవం(చిత్ర కవిత)
తేది:- 01/09/2026
కవితసంఖ్య:- 17
శీర్షిక:- దిక్సూచిలాగా
@@@@@@@@@@@@@@@@@
అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి
జ్ఞానం అనే వెలుగుతో నింపేవారు గురువు
అక్షర ముక్క నేర్పి బ్రతుకు బాట చూపి
ఉన్నత శిఖరాలకు నడిపేవారే గురువు
చేతికి బలపం ఇచ్చి లోకం పరిచయం చేసి
మంచి చెడుల మధ్య భేదం చాటి చెప్పి
తప్పు చేస్తే మందలించి ఒప్పుకు వెన్ను తట్టి
అమ్మలాగా లాలించి నాన్నలాగా పాలించేవారే గురువు
ఎన్ని కష్టాలు వచ్చినా చెదరని ధైర్యాన్ని ఇచ్చి
గమ్యాన్ని చేరే వరకు దిక్సూచిలాగా నిలిచి
తాను కరిగిపోతూ విద్యార్థులకు వెలుగుని ఇచ్చే
అమ్మ బిడ్డకు జన్మనిస్తే
ఉపాధ్యాయులు జీవితాన్ని ఇచ్చే
తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే
మాతృదేవోభవ , పితృదేవోభవ , ఆచార్యదేవోభవ
అని మన సంస్కృతి గురువుకు దైవ సమానం అని స్థానం ఇచ్చింది
ప్రపంచాన్ని మార్చగల శక్తి విద్యకు ఉంటే ఆ విద్యను అందించే శక్తి ఉపాధ్యాయులకు ఉండే
కేవలం పుస్తకాల్లో జ్ఞానమే కాకుండా
జీవితంలో ఎదురయ్యే సమస్యలను
ఎలా ఎదుర్కోవాలో ఏది మంచి , ఏది చెడో విచక్షణతో నేర్పేది ఒక్క గురువు మాత్రమే
ఆ గురువు అనే రూపానికి నా శిరస్సాబి అభివందనం…
డా. సరికొండ రమాదేవి
హామీ పత్రం :-
ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను..