అక్షర కొరకు
అంశం:ఉపాధ్యాయ దినోత్సవం
శీర్షిక: దిద్దుబాటు
కాలేజ్ లో చాలా సీరియస్ గా పాఠం చెప్తునాడు ప్రసాద్ మాస్టారు.గదంతా నిశ్శబ్దంగా ఉంది.కాని ఇంతలోనే ఏవేవో గుసగుసలు వినిపించేసరికి మాస్టారు కు శబ్ద భంగం అవడంతో వెనక్కి తిరిగి చూడగానే రాహుల్ పక్క బెంచి అతనితో మాట్లాడడం కనిపించింది.దాంతో మాస్టారుకు కోపం వచ్చి రాహుల్ అంటూ గట్టిగా అరిచాడు.దాంతోపాటే వెళ్ళు అవతలికి నా క్లాస్ లో నువ్వు ఉండడానికి వీల్లేదు ఇక నుండి నువ్వు ఈ క్లాస్ లోకి రాకూడదు వెళ్ళు గెటవుట్ అంటూ అరిచాడు.అది కాదు సర్ నేనేం తప్పు చేయలేదు సార్. నేను ఏమి చేయలేదు సార్ నా మాట వినండి అంటున్న రాహుల్ తో నేనేం వినను ఇక నువ్వు దయచెయ్ బయటకు అంటూ అరిచాడు ప్రసాద్ మాస్టారు.
చేయని తప్పుకు మాస్టారు తనని అందరిట్లో అవమానించడంతో రాహుల్ కి తల కొట్టేసినట్టు అయ్యింది.దాంతో బ్యాగు తీసుకుని బయటకు వచ్చాడు.అతనికి మాస్టారు పై చాలా కోపం వచ్చింది.దాంతో వెంటనే తన ఇంటికి వెళ్ళి మాస్టారు సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలు వెతికి వాటిని తన స్టైల్ లో మార్ఫింగ్ చేసాడు.దాంతో పాటే వాటిని మాస్టారి ఫోన్ నెంబర్ కు పంపాడు.
వాటిని మాస్టారు చూడగానే అతనికి అర్ధమయ్యింది.ఈ రోజు క్లాస్ లో తాను రాహుల్ ని బెదిరించడం వల్లనే ఇలా చేసినట్టు అనుకున్నాడు.వెంటనే తన కూతురిని తీసుకుని రాహుల్ ఇంటికి వెళ్ళాడు ప్రసాద్ మాస్టారు.రాహుల్ తండ్రి కృష్ణమూర్తి గారు ఒక ఇంటర్ కాలేజ్ లో పని చేస్తాడు.రాహుల్ తో పాటు అతనికి ఒక కూతురు కూడా ఉంది.కృష్ణ మూర్తి గారు ప్రసాద్ మాస్టారు రావడం చూసి ఏంటి మాస్టారు ఇలా వచ్చారు అంటూ ముందుగా ఆశ్చర్యపోయి రండి సర్ అంటూ లోపలికి పిలిచాడు మూర్తి గారు.
లోపలికి రాగానే ఇద్దరు కూర్చున్నారు ఏంటి ఇలా వచ్చారు అనగానే ప్రసాద్ మాస్టారు మూర్తిగారు మీ అబ్బాయిని ఒకసారి పిలుస్తారా అంటూ అడిగాడు. మా అబ్బాయా ఎందుకండి అంటూనే రాహుల్ అని పిలిచాడు తండ్రి పిలుపుతో బయటకు వచ్చిన రాహుల్ ప్రసాద్ మాస్టారు అతని కూతుర్ని చూసి ఆశ్చర్యపోయి ఏంటి నాన్నగారు అనగానే కుర్చోబాబు అన్నాడు ప్రసాద్ మాస్టారు. కూర్చుని మౌనంగా ఉన్న ప్రసాద్ గారితో ఏంటి సర్ ఏమి మాట్లాడరు అన్నారు మూర్తి గారు. సర్ ఈ అమ్మాయిని గుర్తుపట్టారా అని తన కూతుర్ని చూపించాడు ప్రసాద్ గారు హ అవును తెల్సు నా కాలేజ్ లోనే చదువుతుంది కదా తన పేరు ప్రణతి కదా అన్నాడు మూర్తిగారు అవును సర్ ఈ అమ్మాయి మా అమ్మాయే మిమల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరేం అనుకోవద్దు అన్నాడు ప్రసాద్ గారు అలా ఏం లేదు అడగండి అనగానే సర్ మీరు మా అమ్మాయిని ఎన్నిసార్లు కొట్టి ఉంటారు అని అడిగాడు.చాలా సార్లు కొట్టాను సర్ ఆమె చదువులో కాస్త వెనకబడి ఉంది అందుకే కొన్నిసార్లు కాస్త మందలించాను,అయితే ఏమైయ్యింది ఇప్పుడు అంటూ అడిగారు మూర్తి గారు.ఏమ్మా మీ సర్ నిన్ను కొట్టరా అనగానే అవును నాన్న కొట్టారు అంది ప్రణతి.మరి ఆ విషయం నవ్వు నాకెందుకు చెప్పలేదు అన్నారు ప్రసాద్ మాస్టారు.నేను తప్పు చేశాను కాబట్టే కొట్టారు అందుకే నేను మీకు చెప్పలేదు నా తప్పు ఉంది కాబట్టే నేను బాగా చదవాలని కొట్టారు అంతే తప్ప నా మీద కక్షతో కాదు కదా నాన్న అంది ప్రణవి.
ఇంతలో లోపలి నుండి మూర్తిగారి భార్య ఉమ కాఫీ కప్పులతో వస్తూ పిల్లలు చదవకపోతే వాళ్ళ భవిష్యత్తు కోసం మాస్టార్లు మందలించడం మామూలే కదండీ అయినా మీరు మా వారిని నిలదియడానికి వచ్చారా అంది ఉమ. లేదండి అలా అని రాలేదు మా అమ్మాయి ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉందో తెల్సుకోవడానికి వచ్చాను అంతే అన్నాడు ప్రసాద్ గారు.అయినా మన పిల్లలకు ఇప్పుడు కొట్టడం తక్కువయ్యింది కాని మన పిల్లలకు అవన్నీ తెలియవు గారాబం చేసి మనమే పిల్లలని చేడగోడుతున్నాం.మన కాలంలో మాస్టార్లు బెత్తాలు విరిగేదాకా కొట్టి,చదువు చెప్పబట్టే ఇప్పుడు మన జీవితాలు బాగున్నాయి.విలువలు,సంస్కారం లాంటివి మనకు నేర్పించబట్టే ఇప్పుడు మనం ఎంతో ఎదిగాం అన్నాడు మూర్తిగారు.
అవునండి మీరు చెప్పింది నిజమే మన కాలంలో మనం ఇలా ఉన్నాం కానీ ఇప్పటి పిల్లలు కాస్త మందలించిన మన మాన,ప్రాణాలు కూడా తీయడానికి వెనుకాడడం లేదు.కానీ అదే సమయంలో వారికి ఒక కుటుంబం ఉందని వాళ్ళు కూడా సాంకేతికతను నేర్చుకుంటున్నారు అని,వాళ్ళు కూడా ఏదైనా చేయగలరు అని తెల్సుకోలేకపోతున్నారు.వాళ్ళకి మందలిస్తే పరువు పోతుందని భ్రమ పడుతున్నారు,కానీ వారి జీవితం బాగుండాలనే మనం మందలిస్తున్నాం అని తెల్సుకోలేక పోతున్నారు అంటూ రాహుల్ వైపు చూసారు ప్రసాద్ గారు.
ప్రసాద్ మాస్టారు చెప్పిన మాటలన్నీ తన గురించే అని తెల్సుకున్న రాహుల్ తన తండ్రి కూడా ఆ అమ్మాయిని మందలించిన ఆమె ఇంట్లో చెప్పకపోవడం చూసి,మాస్టారు తన మంచికే ఇవన్ని చెప్తున్నారని తెల్సుకొని వెంటనే వచ్చి మాస్టారు చేతులు పట్టుకుంటూ నన్ను క్షమించండి మాస్టారు.నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని అనడంతో అప్పటి వరకు ఏమి మాట్లాడకుండా ఉన్న రాహుల్ అలా అనగానే మూర్తి దంపతులు ఆశ్చర్యపోయి ఏం జరిగింది మాస్టారు అన్నారు.ఏమి లేదండి మేము వచ్చిన పని అయిపోయింది ఇక వెళ్ళి వస్తాం పదమ్మ అన్నాడు ప్రసాద్ మాస్టారు తన కూతుర్ని తీసుకోని వెళ్ళిపోయాడు.
మూర్తి గారు రాహుల్ నీ ఏం జరిగిందని గట్టిగా అడిగేసరికి రాహుల్ తానూ చేసిన తప్పు గురించి చెప్పడం తో తల్లిదండ్రులు ఇద్దరు తమ కొడుకు ఇలా చేసాడని ఉహించక ఆ మాస్టారు ఇంటికి వచ్చి నీలో మార్పు తెచ్చాడు,కానీ అదే మాస్టారు పోలిస్ స్టేషన్ కి వెళ్ళి ఉంటె నీ జీవితం నాశనం అయ్యేది,కానీ ఆయన అలా చేయకుండా నువ్వు నీ తప్పునీ దిద్దుకోవాలని ఇలా చేసారు.ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బాగా చదువుకో అంటూ రాహుల్ కి బుద్ధి చెప్పడంతో అవునమ్మా నేను తప్పు చేశాను కానీ దాన్ని దిద్దుకొని ఇక ముందు మాస్టారు చెప్పింది వింటాను అన్నాడు.
తప్పు చేసినప్పుడే ఉపాధ్యాయుడు దండిస్తాడు అతనికి మనం జీవితంలో బాగుపడాలని మాత్రమే దండిస్తాడు తప్ప కక్షతో కాదనే నిజాన్ని తెల్సుకోవాలి
ఈ కథ నా సొంతమే అని హామీ ఇస్తున్నాను
భవ్యచారు