దీపావళి పండుగ మనం ఎందుకు జరుపుకుంటామంటే?

దీపావళి పండుగ మనం ఎందుకు జరుపుకుంటామంటే?

నరకాసురుడనే రాక్షసుణ్ణి సంహరించడం వలన ఒక రాక్షసుడు చనిపోవడంతో అతని నుండి రక్షింప బడ్డామని సంబరాలు జరుపుకోవడం పేరే దీపావళి..

దానిలో భాగంగానే ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించి ఒకరికొకరు తీపి తినిపించుకుంటూ , టపాసులు కాల్చుకుంటూ ఈ పండగను సంబరంగా జరుపుకుంటారు..

ఆ మాటకొస్తే ఏ పండుగకైనా ఏదో ఒక రాక్షసుణ్ణి సంహరించడమే!
దసరాకైతే పది తలలున్న రావణాసురుణ్ణి సంహరించడం..

ఇప్పటికీ కొన్ని చోట్ల రావణాసురుని బొమ్మను పెట్టి కాలుస్తుంటారు అదే దసరా రోజు..
ఇలా మన పండుగలన్నీ భలేగా ఉంటాయి..

 

అశ్వయుజ బహుళ త్రయెాదశితో మెుదలయ్యే దీపావళి కార్తీక శుద్ద విదియ భగినీహస్త భోజనంతో ముగుస్తుంది…

భూదేవి వరాహ స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురునికి శ్రీహరి చేతిలో చావు లేకుండా తల్లి చేతిలోనె మరణించేలా వరం పొందుతాడు ..

వర గర్వంతో లోక కంఠకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టి పీడించాడు..
అందుకే సత్యభామ చేతిలో సంహరింపబడ్డాడు..

అదండి నాకు తెలిసిన దీపావళి కథ..

ఉమాదేవి ఎర్రం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *