దీపావళి పండుగ రోజు సాయంత్రం..

శీర్షిక:⁠- మనసుకు తెలియని ఒక ఆనందం కలుగుతుంది

ఒక సంవత్సరం  దీపావళి పండుగ రోజు సాయంత్రం మా పితృ దేవతలకు మా ఇంటికి వస్తారు అంట అని వాళ్ళ కోసం అన్ని రకాల వంటలు చేసి పూజ చేసి ఆ మందిరం దగ్గర మా పెద్దల ఫోటోలు పెట్టి దీపం పెట్టి ఇంట్లో ఎంత మంది ఉన్నారో అన్ని విస్తర ఆకులు పెట్టిన పక్కనే బిందేతో నీళ్ళు పెట్టి , అందులో వండిన అన్ని పెట్టి ఇంట్లో ఉన్నావాళ్లలందరు ఒక్కొక్కళ్లు వెళ్లి దేవుడికి , పెద్దవాళ్ళకు నమస్కారం చేసుకుంటాము.

ఇంట్లో ప్రతి రూమ్ లో , మూలలో దీపాలు వెలిగించి పెట్టాతాము..

తర్వాత టపాసులు కాల్చేటప్పుడు ఒక టపాసు వెళ్లి ఇంట్లో ఉన్న కుర్చీ మీద టవల్ పై పడి కొంచం కాలిపోయింది.

సరదాగా టపాసులు కాల్చడం తప్పు కాదు. కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
ఆ టపాసుల మోత వల్ల మా చెవులు పాడు అయ్యో అవకాశం ఉంది.

కాలుష్యాని పాడు చేస్తూ మనం ఎన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటామో మీరే ఆలోచించండి.
ఆ రోజు ఇంట్లో వాళ్ళలందరు ఖచ్చితంగా పూజకి ఉండాలి.

అందరితో సరదాగా కబుర్లు చెప్పుకుని , తర్వాత అందరం కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకుంటాము..

కొన్ని సార్లు ఇంట్లో వాళ్ళలందరితో గడపడం వల్ల మనసుకు తెలియని ఒక ఆనందం కలుగుతుంది..

నాకు దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం.

మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *